Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ పూజ చేసి విహారితో ఆశీర్వాదం తీసుకోవడానికి అక్షింతలు కొంగున కట్టుకొని కాఫీ కలుపుకొని విహారి దగ్గరకు వెళ్తుంది. కనమ మహాలక్ష్మీ విహారి గది వైపు వెళ్లడం చూసిన సహస్ర లక్ష్మీని ఆపుతుంది. లక్ష్మీని పిలిచి కాఫీ ఎవరికి అని అడుగుతుంది. విహారి బాబు గారికి అని లక్ష్మీ చెప్తే నా బావ జోలికి వెళ్లొద్దని చెప్తే అర్థం కాదా అని చెప్పి కాఫీ తీసుకొని సహస్ర విహారి దగ్గరకు వెళ్తుంది. సహస్ర విహారికి కాఫీ ఇచ్చేసి కిందకి వచ్చిన తర్వాత లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్తుంది.
లక్ష్మీ: విహారి గారు ఈ రోజు పూజ పూర్తి చేసుకున్నాను మీరు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారని.
విహారి: లక్ష్మీ ప్లీజ్ ఈ పూజలు పునస్కారాలు వద్దని చెప్పానా లేదా పూజల పేరుతో పస్తులుండి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పానా లేదా.
లక్ష్మీ: విహారి గారి ఇంకెన్నో రోజులు లేవండి ఈ పూజ పూర్తి అయిన తర్వాత మీరు చెప్పినట్లే వింటాను ఈ ఒక్క సారికి నేను చెప్పినట్లు వినండి ఈ అక్షింతలు తీసుకొని ఆశీర్వదించడం ప్లీజ్.
విహారి చేతిలో లక్ష్మీ అక్షింతలు పెట్టి కళ్లు తిరిగి పడిపోతుంది. విహారి చూసి పట్టుకుంటాడు. దాంతో కాఫీ కప్పు కింద పడిపోతుంది. ఇక సహస్ర మీదకు వచ్చి చూసే సరికి లక్ష్మీ దాక్కుంటుంది. కప్పు ఎలా పగిలిపోయిందని విహారి అడుగుతాడు. దాంతో విహారి కనకాన్ని వెళ్లిపోమని సైగ చేసి చేయి జారి పడిపోయిందని చెప్తుంది. లక్ష్మీ కిందకి వెళ్లిపోతుంది. అక్షింతలు విహారి దగ్గరే ఉన్నాయని కనకం అనుకుంటుంది. ఇక సహస్రనే కింద పడిన కప్పు క్లీన్ చేస్తుంది. లక్ష్మీ ఎలా అయినా తన మీద అక్షింతుల వేసేలా దీవించు తండ్రీ అని దేవుడిని కోరుకుంటుంది. ఇక మీద నుంచి విహారి తన దగ్గరున్న అక్షింతలు కింద ఉన్న లక్ష్మీ మీదకు సహస్ర చూడకుండా వేసేస్తాడు. లక్ష్మీ చాలా సంతోషిస్తుంది.
మరోవైపు ఆదికేశవ్ ఇంట్లో బామ్మ ఆదికేశవ్తో హైదరాబాద్ వాళ్ల చీరలు చూశాను చాలా బాగా నేశావని అంటుంది. ఇక ఆదికేశవ్‌కి వసుధ కాల్ చేస్తుంది. చీరల పని ఎంత వరకు వచ్చిందని అడుగుతుంది. పని జరుగుతుందని బాగా కుదురుతున్నాయిని అంటాడు. వసుధ అదికేశవ్‌ని పొగుడుతుంది చీరలు బాగా ఉంటాయని నమ్మకం ఉందని అవికూడా బాగుంటే ఇక్కడా కొందరికి చెప్తామని అంటుంది. ఇక ఆదికేశవ్ సంతోషం చూసి బామ్మ ఏమైందని అడిగితే పెద్దింటి వాళ్లు ఆర్డర్స్ గురించి పొగుడుతుంటే సంతోషంగా ఉందని ఇంకా డబ్బు వస్తే వాటితో కూతురు అల్లుడికి ఏమైనా చేస్తానని అంటాడు. ఇక కూతురు అల్లుడు త్వరగా వారసుడిని ఇవ్వాలని అనుకుంటారు. ఇక సహస్ర బయట బట్టలు తీస్తున్న లక్ష్మీని చూస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక సహస్ర దగ్గరకు వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అంటే లక్ష్మీ మనం వెళ్లే ఊరిలో కనిపించడం.. బావ కూడా అక్కడే కనిపించడం ఇద్దరూ ఒకే రోజు ఇంటి నుంచి వెళ్లి ఒకే రోజు రావడం అన్నీ చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుందని ఏదో తేడాగా ఉందని అంటుంది. దాంతో అంబిక మొదట్లో చక్కబెడితేనే పరిస్థితి దారిలోకి వస్తుందని సమస్య ముదిరితే ఎవరూ ఏం చేయలేరు అని అంటుంది. జాగ్రత్త పడు అని అంబిక సహస్రకు చెప్తుంది. దాంతో సహస్ర లక్ష్మీ గది చెక్ చేస్తానని పైకి వెళ్తుంది. సహస్ర లక్ష్మీ గది మొత్తం వెతుకుతుంది.
బ్యాగ్‌కి ఉన్న ట్యాగ్ చేసి ఫ్లైట్‌లో లక్ష్మీ వచ్చిందా. ఇంట్లో పని మనిషిగా ఉన్న తనకు ఫ్లైట్‌లో తిరిగే అంత సీన్ ఉందా నిజంగానే లక్ష్మీ వెనకాలే ఏదో జరుగుతుందని అనుకుంటుంది. ఇక లక్ష్మీ గదివైపు వస్తుంటుంది. దాంతో లక్ష్మీ దాక్కుంటుంది. లక్ష్మీ లోపలికి వెళ్లగానే తలుపు చాటుగా ఉన్న సహస్ర లక్ష్మీ చూడకుండా బయటకు వెళ్లిపోతుంది. సహస్ర అంబికకు లక్ష్మీ బ్యాగ్‌కి ఉన్న ఫ్లైట్ ట్యాగ్ చూపిస్తుంది. అంబిక సహస్రతో లక్ష్మీకి అంత సీన్ ఉందా అని అనుకుంటుంది. మనకు తెలీకుండా లక్ష్మీ ఏదో చేస్తుందని అనుకుంటారు. లక్ష్మీ మీద ఇకపై ఇంకా ఫోకస్ పెట్టాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆ రోజు పొదుపే ఈ రోజు కొండంత అండ.. ఫ్యామిలీని మాటలతో చంపేసిన సుమిత్ర..!