Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి మందు తాగుతుంటే లక్ష్మీ చూసి మందు తాగొద్దని బతిమాలుతుంది. నన్ను వదిలేసే దానివి నాకు ఏమైనా అయితే నీకు ఎందుకు అని విహారి అడుగుతాడు. లక్ష్మీ మందు బాటిల్ లాక్కొని పడేస్తే కారులో నుంచి మరో బాటిల్ తీసి తాగుతాడు.
లక్ష్మీ వద్దని చెప్తే లక్ష్మీని నెట్టేసి నన్ను వదిలేయ్ నేను ఎలా చస్తే నీకు ఎందుకు అని అంటుంది. ఇక్కడి నుంచి వెళ్లు అని లక్ష్మీ మీద అరుస్తాడు. విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకుంటావా అని అడుగుతాడు. లక్ష్మీ మౌనంగా ఉంటుంది. దాంతో విహారి నువ్వు ఒప్పుకోవు కదా అని మందు బాటిల్‌లో తల పగలగొట్టుకుంటాడు. విహారి గారు అని లక్ష్మీ వెళ్తే నెట్టేస్తాడు. నా గాయం నీకు కనిపిస్తుందా నా మనసులో బాధ కనిపించడం లేదా అని అడుగుతాడు. లక్ష్మీ ఏడుస్తుంటుంది. ఇంతలో సహస్ర విహారిని చూసి ఏంటి బావ రక్తం అని ఏడుస్తూ హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది.
లక్ష్మీ చాలా ఏడుస్తుంది. ఇక లక్ష్మీని వెతుక్కుంటూ ప్రకాశ్ వస్తాడు. రోడ్డు మీద లక్ష్మీ ఏడుస్తుంటే వెళ్లి పెద్దగా నవ్వుతాడు. కనక మహాలక్ష్మీ నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నా ఇలా ఏడ్వడం అనవసరం.. ఒక యథార్థం చెప్తా విను.. రేపు విహారి సహస్రతో హనీ మూన్‌కి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత నిన్ను గెంటేస్తారు. నీకు ఎలాగూ మంచి ఉద్యోగం ఉంది కాబట్టి మనం కలిసి బతికేద్దాం అని అంటాడు. లక్ష్మీ కోపంతో పిచ్చిఎక్కిపోయి ప్రకాశ్‌ని పచ్చడి చేసేస్తుంది. రాక్షసుడా నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందిరా నిన్ను చంపినా పాపం లేదు అని కొడుకుతుంది. పాపం లక్ష్మీ చాలా ఏడుస్తుంది. లక్ష్మీ ఏడుస్తూ వెళ్లడం చూస్తే చాలా ఏడుపొస్తుంది.
ఇంట్లో అందరూ విహారి ఆచూకీ కోసం ఏడుస్తూ ఉంటారు. ఇంతలో విహారిని సహస్ర హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంది. విహారి ఇంటిని చూసి ఓహో నరకానికి వచ్చేశామా అంటాడు. అమ్మ నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా.. అత్త నువ్వు ఎదురు చూస్తున్నావా అంటాడు. విహారి తాగావా అని యమున అడిగితే తాగింది మందే విషయం కాదు అని అంటాడు. తాగితేనే నాకు నిజాలు వస్తాయి అంటాడు. ఇక అందరూ మాట్లాడకుండా వెళ్లమని అంటారు. లక్ష్మీ కూడా మాట్లాడొద్దు అంటే ఏ నేను మాట్లాడకూడదా మాట్లాడితే నాకు అన్నీ నిజాలే వస్తాయి. మామూలుగా మాట్లాడను ఇప్పుడు మాట్లాడనివ్వండి అంటాడు.
విహారిని పద్మాక్షి ప్రశ్నిస్తుంది. తాగి ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. విహారి ఏడుస్తూ మనకి బాగా దగ్గరైన వాళ్లు దూరం అయితే ఆ బాధ భరించలేం అని ఏడుస్తాడు. లక్ష్మీ కూడా ఏడుస్తుంది. యమున విహారిని మాట్లాడనివ్వకుండా తీసుకెళ్లాలి అని చూస్తుంది. విహారి వెళ్లను అంటాడు. విహారి ఏడుస్తూ నా బాధ ఎవరికీ అర్థం కావడం లేదు ఏంటి మామయ్య అంటాడు. పద్మాక్షితో అత్తయ్య నేను నీతో మాట్లాడాలి మీ అందరితో మాట్లాడాలి అని కింద పడిపోతాడు. యమున సహస్రతో విహారిని లోపలికి తీసుకెళ్లమని చెప్తుంది. సహస్ర ఏడుస్తూ బావని తీసుకెళ్తుంది.
లక్ష్మీ గదికి వెళ్లి చాలా ఏడుస్తుంది. లక్ష్మీ దగ్గరకు పద్మాక్షి వస్తుంది. యమున బయట నుంచి ఏం మాట్లాడుతారా అని చూస్తుంటుంది. పద్మాక్షి లక్ష్మీకి టవల్ ఇచ్చి వానలో తడిచిపోయావ్ తుడుచుకో అని అంటుంది. ఇక లక్ష్మీతో లక్ష్మీ నువ్వు వచ్చినప్పుడు నుంచి నేను చూస్తున్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నువ్వే కారణం అవుతున్నావ్.. నీకు తెలిసి జరుగుతుందో లేక నువ్వే ఇరుక్కుంటున్నావో నాకు తెలీదు కానీ రేపు నా కూతురు అల్లుడు ట్రిప్ కోసం వెళ్లున్నారు. నేను నీకు చాలా రిక్వెస్ట్‌గా చెప్తున్నా.. నీ వల్ల రేపు ఎలాంటి ఇబ్బంది రాకూడదు.. ప్రశాంతంగా హనీమూన్‌కి వెళ్లాలి నీ వల్ల ఏమైనా సమస్య వస్తే అస్సలు క్షమించను అని అంటుంది.
లక్ష్మీ పద్మాక్షితో నా వల్ల విహారిగారు సహస్రమ్మల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగదు అని అంటుంది. పద్మాక్షి వెళ్లిపోయిన తర్వాత యమున వచ్చి నా కొడుకుకి ఈ పరిస్థితికి కారణం నీ వల్ల ఏ సమస్య రాకూడదు అని అంటుంది. విడాకులు అయిపోగానే మీ బంధానికి స్వస్తి పలకాలి.. విహారితో నీ విడాకులు అయిపోయిన తర్వాత ప్రకాశ్ సంగతి తేల్చుతా అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది. ఓ వైపు లక్ష్మీ ఏడుస్తుంటే పాపం మరోవైపు విహారిని చూస్తే సహస్ర ఏడుస్తుంది.
విహారి నిద్రలో కనక మహాలక్ష్మీ కనక మహాలక్ష్మీ ఎలా నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధ పడ్డావ్ అని విహారి అనడం సహస్ర వింటుంది. లక్ష్మీ బావకి విడాకులు ఇస్తుందా అనుకుంటుంది. నువ్వు లేని జీవితం నేను జీవచ్ఛవంలా నేను ఉండలేను అని విహారి కలవరించడం విని సహస్ర చాలా ఫీలవుతుంది. యూఎస్ వెళ్లిన తర్వాత నా దారిలోకి బావని తీసుకొచ్చుకుంటా అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.