Nindu Manasulu Serial Today Episode పర్మిషన్ లేకుండా ఐశ్వర్య రంజిత్ గదికి వెళ్లిందని ప్రేరణ తిడుతుంది. రంజిత్‌ని బతిమాలడానికి లోపలికి వెళ్లే సరికి రంజిత్ ప్రేరణ వాళ్ల బ్యాగ్‌లు బయట పెట్టి కూర్చొని ఉంటాడు. ప్రేరణ రంజిత్‌ని ఎంత బతిమాలినా రంజిత్ ఒప్పుకోకుండా తన రూల్స్ బ్రేక్ చేసినందుకు పది నిమిషాల్లో ఇళ్లు ఖాళీ చేసేయమని చెప్పి బయటకు వెళ్తాడు. ప్రేరణ ఐశ్వర్యతో ఇప్పుడేం చేస్తాం.. అమ్మకి ఏం చెప్తాం అని చాలా కంగారు పడుతుంది. ఇంతలో గణ అక్కడికి వస్తాడు.
గణ: ఏంటి ఎప్పుడు చూసినా మీరే కలుస్తున్నారు మీ అమ్మ కనిపించడం లేదు. ఈ సారి ఏ కొంప కూల్చడానికి వెళ్లిందో. ఎంత మందిని వలలో వేసుకోవడానికి వెళ్లిందో.ప్రేరణ: రేయ్ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదు.గణ: మీరు చేసే పనులకు మీకు మర్యాద దక్కుతుందా.. బ్రోకర్‌తో.. అవునురా ఒక ఫ్యామిలీకి ఇళ్లు ఇప్పించే ముందు వాళ్లు ఎవరు ఏంటో తెలుసుకొని ఇళ్లు ఇప్పించాలి కదా.. నేను అంతా మీ వాళ్లకి వీళ్ల గురించి చెప్పినా నువ్వు ఎలా వీళ్లకి ఇళ్లు ఇప్పిస్తావ్ రా. వీళ్ల అమ్మేమో అమాయకంగా ఎవరు దొరుకుతారా ఎలా వలలో వేసుకోవాలా అని చూస్తుంటే వీళ్లిద్దరూ వాళ్ల ఆస్తులను ఎలా కొట్టేయాలా అని చూస్తుంటారు.ప్రేరణ: నోర్ముయ్ ఇంకొక్క మాట మా కోసం మాట్లాడితే నేనేం చేస్తానో నాకు తెలీదు.గణ: వీళ్లతో కాదు కానీ ఓనర్‌ని పిలు వీళ్ల బాగోతం చెప్దాం.ఐశ్వర్య: ఇంత అంటున్నావ్ కదా నువ్వు మమల్ని అన్నట్లే మీ అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకొంది అని నువ్వు అక్రమ సంతానం అనిఅంటే నీకు ఎలా ఉంటుంది. మా నాన్నకి పుట్టా అంటావ్ కదా నీ లో ఆ సంస్కారమే లేదేంటి.గణ: ఇది మీ సంస్కారం నన్ను మీలో కలిపేసుకున్నారన్నమాట. హైదరాబాద్ ఉన్న మా నాన్నని వైజాగ్ రప్పించుకుంది మీ అమ్మ. వలలో వేసుకుంది మీ అమ్మ. మీ ఇద్దరినీ కని మా నాన్నని బ్లాక్ మెయిల్ చేసింది కూడా మీ అమ్మే.ఐశ్వర్య: సో మేం రాజశేఖరం గారి పిల్లలం అని నువ్వు ఒప్పుకుంటున్నావా. గణ: కనింది అన్నాను కానీ మా నాన్నకే పుట్టారని అనలేదు కదా. మా నాన్నలాగే మీ అమ్మకి బలైన పోయిన వారు ఎందరో. మీ అమ్మ దగ్గర ఉన్న లిస్ట్‌లో మా నాన్న నెంబరు ఎంతో. వాళ్లలో ఎవరికైనా మీరు పుట్టుండొచ్చు కదా. ప్రేరణ కొట్టడానికి చేయి ఎత్తితే నిజం చెప్తే పౌరుషం వస్తుందా అని అడుగుతాడు.
మా నాన్న కళ్లు తెరిచే రోజు నీ పని ఉంటుంది. మా ఓర్పునకు ఓ హద్దు ఉంటుంది అని అంటుంది. ఇంతలో బ్రోకర్ వచ్చి ఓనర్ లేరు సార్ మీరు గొడవ చేయొద్దు ఆయన ఉంటే ఊరుకోరు. మేడం మీరు వెళ్లిపోండి అని బతిమాలుతుంది. ఇక ప్రేరణ చెల్లితో ఎలాగూ ఓనర్ వెళ్లిపోమన్నాడు కదా వెళ్లిపోదాం పద అంటుంది. గణ నవ్వి మీ గురించి తెలీకుండానే ఓనర్ వెళ్లిపోమని చెప్తాడా. వాడు ఎవడో కానీ చాలా టాలెంట్డె అని అంటాడు. ప్రేరణ వాళ్లు వెళ్తుంటే ఎదురుగా రంజిత్ ఉంటాడు.
గణ రంజిత్‌తో బాబు ఓనర్ ఒక సారి వెనక్కి తిరుగమ్మా అంటాడు. రంజిత్ తిరగగానే గణ షాక్ అయిపోతాడు. సీన్ చూస్తే గతంలో గణ, రంజిత్‌కి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లుంది. గణ రంజిత్‌కి గొడవ జరిగి రంజిత్ షూట్ వదిలేసి పెద్ద బంగ్లాను వదిలేసి వెళ్లినట్లు చూపిస్తారు. గణ రంజిత్‌ని చూసి వీడా అని షాక్ అయిపోతాడు. ప్రేరణ ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక ప్రేరణ వాళ్లు వెళ్లిపోతుంటే రంజిత్ ఆపి నేను మొత్తం విన్నాను. అతను చెప్పేది నిజమా అబద్ధమా అని అడుగుతాడు. బ్రోకర్ సారీ చెప్తే చెప్పావ్ కదా ఇక బయల్దేరు అని అరుస్తాడు. ఇక నిజం కాబట్టే అని గణ చెప్పబోతే రంజిత్ చేతి సైగతోనే ఆపేస్తాడు.
ప్రేరణ వెళ్లిపోతా అంటే అతను చెప్పింది నిజమా అబద్ధమా చెప్పేసి వెళ్లిపోఅంటాడు. అంతా అబద్ధం సార్ అని ప్రేరణ ఏడుస్తుంది. అతను చెప్పేదంతా అబద్ధం సార్ మానాన్న యాక్సిడెంట్ మా జీవితాన్ని కుదిపేసింది. మా నాన్న కోసం మేం మా అమ్మతో ఇక్కడికి వస్తే కనీసం మా నాన్నకి కలవకుండా చేశాడు. నాన్న ఇంట్లోనే ఉన్నా చూపించకుండా గెంటేశాడని ఏడుస్తూ చెప్తుంది. మేం రాజశేఖరం పిల్లలం సార్ అలాంటప్పుడు మమల్ని అవమానించే అధికారం ఇతనికి ఎవరు ఇచ్చారు సార్ అని ఏడుస్తుంది. మేం ఈ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదు అని మాకు తెలుసు సార్ మేం ఎవరికీ బాధ పెట్టాలి అనుకోం వెళ్లిపోతాం సార్ అని ప్రేరణ చెల్లిని తీసుకొని వెళ్లిపోతుంటే రంజిత్ ఆపి వాళ్లని లోపలికి వెళ్లమని చెప్తాడు. గణ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.