Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున తనని చాలా మార్చేసిందని దేవా చెప్తాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పోల్చినే నేను ఓ శూన్యం అయినా అన్నీ వదిలేసి నా కోసం వచ్చేసింది. నేను ఎంత అసహ్యంగా మాట్లాడినా ప్రాణం పోయే చివరి నిమిషం వరకు నాతో ఉంటాను అన్నది. నా కోసం ఇంత పోరాడి ఇంత చేసిన మిథునకు అందరి సమక్షంలో ఓ మాట చెప్పాలి అనుకుంటున్నా. మిథునా ఇలా రా అని స్టేజ్ మీదకు పిలుస్తాడు.  

మిథున లేడి పిల్లలా చెంగు చెంగున పరుగులు పెట్టుకొని చాలా సంతోషంగా దేవా దగ్గరకు వెళ్తుంది. దేవా మిథునతో మనసులో ఏం నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ అయితే ప్రేమ ద్వేషం అయితే ద్వేషం.. అది నువ్వే నాకు అర్థమయ్యేలా చేశావ్.. రాయి లాంటి నన్ను శిల్పంగా మనిషిలా మార్చావ్. మిథున ఏ బంధం అయినా ఉండాల్సింది గుప్పెట్లో కాదు గుండెల్లో అందుకే నా గుండెల్లో నీ మీద ఉన్న అభిప్రాయాన్ని నీ ముందు ఉంచుతున్నా.. మిథున నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి దేవా ఒంగుతాడు. ఇంతలో షూటర్ కాల్చేయడంతో దేవా ప్రపోజ్‌ చేయడానికి కింద కూర్చొవడంతో బులెట్ మిథునకు తగిలిపోతుంది. 

మిథునకి బుటెల్ తగిలి కింద పడిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. హుటాహుటిన హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అందరూ ఏడుస్తుంటారు. మిథునకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇలా జరిగింది ఏంటి అని లలిత ఏడుస్తుంది. డాక్టర్ వస్తే దేవా ఏడుస్తూ ఎలా ఉంది మిథునకు ఏం కాదు కదా అంటాడు. కండీషన్ సీరియస్ అని డాక్టర్ చెప్పడంతో హరివర్ధన్ కూలబడిపోతాడు. దేవా ఏడుస్తాడు. మిథునకు ఏం కాదని దేవా అంటాడు. మిథున మిథున అని జడ్జి ఏడుస్తాడు. 

ఆదిత్య షూట్‌ చేసిన వ్యక్తిని పట్టుకొని  చితక్కొట్టి దేవాని కాల్చమని చెప్తే నా ప్రాణాన్ని నా భార్యని షూట్ చేస్తావా.. నాకు నా భార్యని దూరం చేయాలని చూస్తావా.. మిథున నా ప్రాణంరా తను లేకపోతే నేను ఎలా బతకగలను.. అని తిడతాడు. నీ వల్ల మిథున హాస్పిటల్‌లో పడటమే కాదురా.. నేను జైలుపాలవుతాను. జడ్జి ఇంట్లో కాల్పులు అంటే పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తారో తెలుసా. పైగా దేవా డేగలా వదలడు. వాడికి నేను దొరికితే పరుగెత్తించి పరుగెత్తించి నన్ను చంపేస్తాడు. నువ్వు అర్జెంటుగా ఫోన్ ఆపేసి పారిపో అని అంటాడు. దేవా నుంచి నాకు ఎప్పుడు ప్రళయం ముంచుకొస్తుందో అని ఆదిత్య టెన్షన్ పడతాడు. 

దేవా వాళ్ల దగ్గరకు మరో డాక్టర్ వచ్చి ఫార్మాలిటీ కోసం పేషెంట్ భర్త సంతకం పెట్టమని అంటాడు. అవసరం లేదు తన తండ్రి సంతకం పెడతాడని త్రిపుర, రాహుల్ అంటారు. మీ పర్సనల్ ఇష్యూలు తర్వాత చూసుకోండి ముందు భర్త సంతకం పెట్టాలని అంటాడు. దేవా వచ్చి సంతకం ఎందుకు అని అడుగుతాడు. దానికి డాక్టర్ ఇది ఫార్మాలిటీ అని పేషెంట్ కండీషన్ క్రిటికల్‌గా ఉంది ఏమైనా కావొచ్చు ఒక వేళ ప్రాణంపోతే అని డాక్టర్ చెప్పబోతే దేవా డాక్టర్ కాలర్ పట్టుకొని చంపేస్తా మిథున ప్రాణాలు పోతాయి అంటే ఊరుకోను.. నువ్వు డాక్టర్ కదా అంటే దేవుడే కదా అంటాడు. ఇక తర్వాత ఆయనకు సారీ చెప్పి మిథునని కాపాడమని బతిమాలుతాడు. తర్వాత సంతకం పెడతాడు. 

దేవా మనసులో నీకేం అయితే నేను తట్టుకోలేను మిథున నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను అని అనుకుంటాడు. హరివర్ధన్, దేవా చాలా ఏడుస్తారు. కాంతం గజగజా వణికిపోతుంది. రంగం వచ్చి పిలిస్తే నాకేం తెలీదు నేనేం చూడలేదు అని వణికి పోతుంది. రంగం తర్వాత అడిగితే షూటర్‌ని చూశానని ఆదిత్యకు విషయం చెప్పానని అంటుంది. ఆదిత్యకు విషయం చెప్తే సెక్యూరిటీ అని చెప్పాడని విషయం ఇంకెవరికీ చెప్పొద్దని అనడంతో సైలెంట్‌గా ఉండిపోయానని కాంతం అంటుంది. దాంతో రంగం గన్ తీసుకొని అలా ఎవరూ రారే.. పైగా ఆదిత్య విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నాడంటే దీని వెనక ఏదో ఉంది. ఆ కిల్లర్ గురించి అతనికి ముందు తెలుసుంటుంది. అందుకే నీకు మాయ చేశాడని అంటాడు. దాంతో కాంతం చూడ్డానికి హీరోలా ఉన్న అతనిలో విలన్ ఉన్నాడా. అయితే అసలు క్రిమినల్ ఆదిత్య అన్నమాట అని తిట్టుకుంటుంది. సత్యమూర్తి హరివర్థన్ దగ్గరకు వెళ్లి ఓదార్చుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.