Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ప్రకాశ్ లక్ష్మీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి లక్ష్మీ జాబ్ రోల్.. శాలరీ అవి చూస్తారు. లక్ష్మీకి నెలకి దాదాపు రెండున్నర లక్షలు జీవితం రావడం చూసి షాక్ అయిపోతాడు. ఇంత జీతం ఇచ్చి అంత సింపుల్‌గా ఉంటుందేంటి అనుకుంటాడు. 

Continues below advertisement


లక్ష్మీ పేరు మీద పది కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం చూసి ప్రమాదవశాత్తు లక్ష్మీ చనిపోతే ఆ డబ్బు మొత్తం లక్ష్మీ అఫీషియల్ భర్త అయిన నాకు వస్తుందని కన్నేస్తాడు. ఇక నుంచి ఆ పది కోట్లు దక్కించుకోవాలని అనుకుంటాడు. మరోవైపు అంబిక సుభాష్‌కి కాల్ చేసి విహారి గ్రూఫ్‌ కంపెనీల్లో కొంత మంది చావాలని చెప్తుంది. సుభాష్ షాక్ అయిపోతాడు. విహారి కంపెనీల్లో ఫ్యాక్టరీల్లో కొంత మంది చావాలి అవన్నీ మ్యానేజ్ మెంట్‌ మీద నింద పడాలని అంటుంది. మనుషులతో మాట్లాడు ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తా అని అంటుంది. 


అంబిక సహస్రకు ఫోన్‌లో లొకేషన్లు చూపించి ఇక్కడికి వెళ్లండి అని అంటుంది. ఇక విహారి ఆఫీస్‌కి వెళ్తుంటే అంబిక ఆపి రేపు అమెరికా వెళ్తావ్ కదా ఈ రోజు ఆఫీస్‌కి వెళ్లడం ఎందుకు నేను చూసుకుంటా ఇంకా అవసరం అయితే లక్ష్మీ ఉంది కదా నీ రైట్ హ్యాండ్ నీ మామయ్య కూడా ఉన్నాడు కదా అని అంటుంది. అందరూ విహారిని సహస్రతో షాపింగ్‌కి వెళ్లమని అంటారు. విహారి ఒప్పుకుంటారు. యమున మనసులో నీ మౌనానికి అర్థం ఆ లక్ష్మీ అని తెలుసురా ఆ సమస్య నేను ఎలా అయినా పరిష్కరిస్తానని యమున అనుకుంటుంది. 


చారుకేశవ డాక్టర్‌ని కలిసి డబ్బు ఇచ్చి డీఎన్‌ఏ రిపోర్ట్స్ పాజిటివ్‌ రావాలి ఈ డబ్బు సరిపోదు అంటే ఇంకా ఇస్తా కానీ రిపోర్ట్స్‌ పాజిటివ్‌ రావాలి నువ్వు ఇచ్చే రిపోర్ట్స్‌తో ఒకమ్మాయి జీవితం కాపాడొచ్చు అని అంటాడు. యమున లక్ష్మీని పిలుస్తుంది. లక్ష్మీతో నీకు ఇచ్చిన విడాకుల పేపర్లు తీసుకురా అని అంటుంది. లక్ష్మీ తీసుకొని వస్తుంది. వాటిని చూసిన యమున విహారి ఇంకా సంతకం చేయకపోవడంతో వీటి మీద విహారి సంతకం ఏది అని అంటుంది. విహారితో సంతకం పెట్టించడానికి చాలా ప్రయత్నించా కానీ కుదరలేదు అని అంటుంది. 


యమున పేపర్లు విసిరేసి నీకు ఇచ్చిన గడువు అయిపోయింది అవ్వదు కుదరదు అంటే ఎలా.. నాకు కారణాలు వద్దు వాడు యూఎస్‌ వెళ్లే లోపు ఈ ప్రాబ్లమ్ క్లీయర్ అయిపోవాలి. నువ్వు సంతకం పెట్టించడం లేదు అంటే నీకు వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి లక్ష్మీ లేదమ్మా విహారి గారికి విడాకులు ఇవ్వడమే నా ఎజెండా అని చెప్తుంది. యమున లక్ష్మీతో విహారి యూఎస్‌ వెళ్లే లోపు నువ్వు చేయలేని పని నేను చేయిస్తానని అంటుంది. లక్ష్మీ ఆ పేపర్లు అన్నీ తీసి యమున చేతిలో పెట్టి మీరు చేయాలి అనుకున్నది చేయండి మీరు ఏం చెప్తే నేను అది చేయడానికి నేను సిద్ధం అని అంటుంది. 


లక్ష్మీ విడాకుల పేపర్లు అన్నీ తీసి ఒకటి వదిలేస్తుంది. సహస్ర, విహారిలు షాపింగ్ నుంచి వస్తారు. హనీమూన్ ఎగ్జైట్ మెంట్ విహారిలో లేదని అంబిక అంటే సహస్ర షాపింగ్‌లో బావ యాక్టివ్‌గా ఉన్నాడని అంటుంది. ఇక డీఎన్‌ఏ రిపోట్స్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. రేపు రిపోర్ట్స్ వస్తే లక్ష్మీ నాకు దగ్గరైపోతుందని అంటాడు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ నెగిటివ్ వస్తాయని ప్రకాశ్ అంటాడు. విహారి కోపంగా చూస్తాడు. ప్రకాశ్ సహస్రతో నువ్వు రేపు యూఎస్‌కి వెళ్లిపోగానే నేను లక్ష్మీకి భర్తని అయిపోతాడు అని అంటాడు. 


విహారి తన గదికి వెళ్తూ కింద పడిన విడాకుల పేపర్ చూస్తాడు. చూడగానే షాక్ అయిపోతాడు.  వెంటనే ఓ చోటుకి వెళ్లి లక్ష్మీకి కాల్ చేస్తాడు. లక్ష్మీ లిఫ్ట్ చేయకపోవడంతో చారుకేశవకి కాల్ చేసి లక్ష్మీని తీసుకొని రమ్మని అడ్రస్ చెప్తాడు. లక్ష్మీ నాకు విడాకులు ఇవ్వాలి అనుకోవడం ఏంటి అని విహారి అనుకుంటాడు. చారుకేశవ లక్ష్మీని విహారి దగ్గరకు తీసుకెళ్లడానికి పిలుస్తాడు. ప్రకాశ్ అడ్డుకోవడంతో ఒక్కటి పీకి లక్ష్మీని తీసుకెళ్తాడు. లక్ష్మీని చూసి విహారి కోపంగా చేయి పట్టుకొని లాక్కెళ్తాడు. దూరంగా వెళ్లి కనకం నువ్వు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నావా అని అడుగుతాడు. నేనేం దాయడం లేదని లక్ష్మీ అంటుంది. దాంతో విహారి విడాకుల పేపర్లు చూపించి మరి ఇదేంటి అని అడుగుతాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది. చారుకేశవ షాక్ అయి విడాకులు ఏంటి అని కంగారుగా అడుగుతాడు. 


విహారి లక్ష్మీతో విడాకులు కావాలా నీకు అసలేం చేస్తున్నావ్ లక్ష్మీ సమాధానం చెప్పు అని అడుగుతాడు. చారుకేశవ కూడా ఏంటి లక్ష్మీ నువ్వు మీరు విడిపోవాలి అనుకోవడం ఏంటి అని అడుగుతాడు. లక్ష్మీ చారుకేశవతో బాబాయ్ ఇది నాకు విహారి గారికి సంబంధించిన విషయం దయచేసి మీరు దీని గురించి మాట్లాడకండి అని చెప్తుంది. చారుకేశవ కన్నీరు పెట్టుకొని ఇది నువ్వు కాదు లక్ష్మీ నువ్వు అయితే ఇలా మాట్లాడవు అని అంటాడు. విహారి లక్ష్మీతో నాకు సమాధానం చెప్పు ఎందుకు విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావ్ అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.