jagadhatri Serial August 18th to 22nd Weekly Episode కేథార్ వజ్రపాటి వారసుడు అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు కావాలని వైజయంతి చెప్పడం.. కౌషికి మీద రౌడీ అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి. వారం మొత్తం జరిగిన హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
కౌషికి జరిగిన విషయం తలచుకొని వణికిపోతూ తిండి కూడా తినకుండా ఏడుస్తూనే ఉంటుంది. కేథార్ జగద్ధాత్రితో నేను అక్క అనుకున్న మంచోడిని కాదు.. అక్క మీద చేయి వేసిన వాడిని ఇంకా ఏం చేయలేకపోతున్నా చూశావా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని ఆ రౌడీ అడ్రస్ కార్డు చూపించి మా అక్క మీద చేయి వేసిన వాడికి ఈ భూమ్మీద బతికే అర్హత లేదు వాడిని చంపేస్తా అని అంటాడు.జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ రౌడీ ఉన్న లొకేషన్‌కి బయల్దేరుతారు. యువరాజు కూడా ఆవేశంతో అక్క మీద చేయి వేసిన రౌడీని చంపేస్తా అనుకొని వెళ్లి రౌడీని చితక్కొడతాడు. జగద్ధాత్రి, కేథార్ కూడా అక్కడికి వచ్చేస్తారు. యువరాజ్ రౌడీకి గన్ గురి పెట్టి నువ్వు చేసిన తప్పునకు చంపేస్తానని అంటాడు. దాంతో రౌడీ తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించి పరుగెడుతూ మేడ మీదకు వెళ్లి కింద పడి చనిపోతాడు.
కేథార్, యువరాజ్‌లు మా చేతిలో చనిపోవాల్సిన వాడు చనిపోకుండా అయిపోయాడు అని డిసప్పాయింట్ అవుతారు. కేథార్ యువరాజ్‌తో నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా నేను చేయాలి అనుకున్న పని నువ్వు చేశావని అంటాడు. దాంతో యువరాజ్ నువ్వు చేయాలి అనుకున్న పని నేను చేయలేదు. నేను చేయాలి అనుకున్నా కాబట్టి చేశానని చెప్తాడు. జగద్ధాత్రి యువరాజ్‌తో వాడు ఇక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. ఎంక్వైరీ చేశానని అంటాడు. ఇంత త్వరగా నీకు ఎలా తెలిసింది అని అడిగితే మీ సర్కిల్ మీకు ఉంటే నా సర్కిల్ నాకు ఉంది అని అంటాడు. యువరాజ్ మంచోడు కానీ కొంచెం మార్చుకోవాలని అనుకుంటారు.
జగద్ధాత్రికి ఆదిత్యపురం నుంచి వాచ్‌మెన్ కాల్ చేస్తాడు. గుమస్తా వచ్చి మహాల్ అమ్మడానికి పార్టీని తీసుకొచ్చాడని త్వరగా వచ్చి మాట్లాడమని అంటాడు. జగద్ధాత్రి, కేథార్ బయల్దేరుతారు. యువరాజ్ మొత్తం విని సాక్ష్యాల కోసం వెళ్తున్నారా అనుకుంటాడు. ఇంతలో నిషిక కాల్ చేస్తే విషయం చెప్పి ఫాలో అవుతున్నానని అంటాడు. నిషికు యువరాజ్ రావొద్దని చెప్పడంతో నిషిక సీక్రెట్‌గా వెళ్తుంది. నిషిక తనలో తాను కేథార్ ఈ ఇంటి పెద్ద కొడుకు అయినా పర్లేదు కానీ జగద్ధాత్రి మాత్రం పెద్ద కోడలు కాకూడదు.. నాకు తోటి కోడలు అస్సలు కాకూడదు అనుకుంటుంది. సాక్ష్యాలు తారు మారు చేయడం యువరాజ్ ఒక్కడి వల్లే కాదని తన వల్ల అవుతుందని బయల్దేరుతుంది.
గుమస్తా వచ్చిన పార్టీతో మహాల్ తనది అని చెప్పి అమ్మడానికి ప్రయత్నిస్తాడు. జేడీ, కేడీలు మహాల్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే ఓ పిచ్చివాడు కారు ఆపి కేథార్ చూసి వెళ్లు నీకు కావాల్సింది ఇక్కడే ఉంది. ఈ సంస్థానం నీ కోసం ఎదురు చూస్తుంది అని అంటాడు. జగద్ధాత్రి, కేథార్‌లు జేడీ, కేడీలుగా ఎంట్రీ ఇవ్వడం చూసిన యువరాజ్ ఈ కేథార్ ఏంటి జగద్ధాత్రితో బయల్దేరి జేడీతో వచ్చాడేంటి అనుకుంటారు. జేడీ, కేడీలు గుమస్తాకి గన్ గురి పెట్టి వచ్చిన ప్రతీ పోలీస్‌ని చంపేసి దెయ్యాలు అని భయపెడుతున్నారని ఎందుకు అని అడుగుతుంది. దాంతో గుమస్తా నిజం చెప్తేస్తా అని దీని వెనక ఉంది మీనన్ అని గుడిలో గుప్త నిధులు ఉన్నాయని తెలుసుకున్న మీనన్ ఊరిని సొంతం చేసుకోవడానికి ఊరిలో దెయ్యాలు అని భయపెట్టి ఊరి నుంచి అందర్నీ తరిమేశాడని ఆఫీసర్లను చంపేశాడని.. మీనన్ మహాల్‌ని మహాల్‌కి చెందిన ఆస్తులు తనకు ఇచ్చేస్తానని డీల్ కుదిరిందని అంటాడు.
కేడీ తన తల్లి ఫొటో చూపించి ఈవిడ గురించి నీకు ఏం తెలుసు.. అని అడిగితే గుమస్తా కేడీ వాళ్లతో ఈవిడ పేరు సుహాసిని దేవి.. ఈవిడ ఈ సంస్థానానికి వారసురాలు అని చెప్తాడు. కేడీ, జేడీలతో పాటు యువరాజ్, నిషిక బిత్తర పోతారు. కొన్నేళ్ల క్రితం వజ్రపాటి సుధాకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని అందుకే తనని పుట్టింటి వాళ్లు దూరం పెట్టారని గర్భవతిగా వచ్చినా కూడా చేరదీయలేదని ఆ మహాతల్లి చాలా అవస్థలు పడిందని చెప్తాడు. కేథార్ చాలా బాధ పడతాడు. ఈ ఊరిలోనే మంత్రసాని ఆవిడకు పురుడు పోసిందని మగ బిడ్డ పుట్టాడని గుమస్తా చెప్తాడు.
మంత్రసానిని కలిస్తే కేథార్‌కి తన పుట్టక గురించి తెలిసిపోతుందని మంత్రసానిని కలిసి సాక్ష్యాలు లేకుండా చేయాలని యువరాజ్ వెళ్తాడు. కేథార్, జగద్ధాత్రిలు మంత్రసాని దగ్గరకు బయల్దేరుతారు. నిషిక, యువరాజ్‌లు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇది ఎలాంటి ప్లేసో తెలుసా నీకు ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు త్వరగా వెళ్లిపో అని అంటే నిషిక మాత్రం వెళ్లినట్లే నటించి సీక్రెట్గా ఫాలో అవుతుంది. యువరాజ్ రౌడీలను పిలిపించి మంత్రసానిని పట్టుకొని గన్ గురి పెట్టి కేథార్ తల్లి డిటైల్స్ అడుగుతాడు. ఇంతలో కేడీ, జేడీలు అక్కడికి వస్తారు. వాళ్లని చూసిన కేథార్ మంత్రసానిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఏం చేయాలో అర్థం కాక జేడీ, కేడీలు యువరాజ్‌ని బతిమాలుతారు. నిషిక అక్కడే దాక్కోవడం చూసిన జేడీ నిషికకు గన్ గురి పెట్టి మంత్రసానిని వదలకపోతే చంపేస్తానని అంటుంది. దాంతో యువరాజ్ వదిలేస్తాడు.
కేథార్ వాళ్లు మంత్రసానిని పక్కకి తీసుకెళ్లి తన తల్లి సుహాసిని గురించి అడుగుతాడు. నేనే ఆమె కొడుకుని అని చెప్తాడు. మంత్రసాని అవునా అని అడిగి కేథార్ గుండె మీద స్వస్తిక్ గుర్తు చూస్తుంది. నువ్వు మా సుహాసిని అమ్మ కొడుకువే బాబు అందుకు ఈ గుర్తే సాక్ష్యం నీకు మూడేళ్లు వచ్చే వరకు నేనే పెంచాను బాబు అని అంటుంది. కేథార్ ఎమోషనల్ అయిపోతూ నేను సుహాసిని కొడుకు అని చెప్పుకోవడానికి ఈ గుర్తు కాకుండా ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా అమ్మ మీరు మాత్రమే నాకు దిక్కు అని అంటాడు. మహాల్‌లో సాక్ష్యాలు ఉన్నాయని మంత్రసాని కేథార్ వాళ్లని మహాల్కి తీసుకెళ్తుంది. యువరాజ్, నిషిక కూడా వెళ్తారు. కేడీ, జేడీలు మంత్రసాని మంచిది అని ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అనుకుంటారు. మంత్రసాని ఓ గదిలోకి వెళ్లి అక్కడున్న బాక్స్‌లు తీసి చూసి వాటిలో నగలు, వజ్రాలు, వైడ్యూర్యాలు అన్నీ చూసి ఇన్నేళ్లకి నా కల నెరవేరిందని వాటిని మీద వేసుకొని తెగ సంబర పడిపోతుంది.
యువరాజ్ అదంతా చూసేయడంతో యువరాజ్ కళ్లలో పౌడర్ కొట్టడంతో మత్తులోకి వెళ్లిపోతాడు. నిషికను కూడా కొట్టేస్తారు. జేడీ, కేడీలకు ఈ విషయం తెలీదు. ఇంట్లో వైజయంతి కొడుకు కోడలి కోసం చాలా కంగారు పడుతుంది. సుధాకర్, కౌషికలకు చెప్పి వెతకమని అంటుంది. మంత్రసాని నగలు, వజ్ర వైడ్యూర్యాలు, యువరాజ్, నిషికల్ని తీసుకొని తమ వ్యాన్‌లో పారిపోవడం అక్కడే ఉన్న వాచ్ మెన్ చూస్తాడు. జేడీ కేడీలు అన్ని గదులు వెతుకుతూ మంత్రసాని నగలు కొట్టేసిన గదికి వస్తారు. అక్కడ పొడి చూసి అది క్లోరో ఫాం అని గుర్తిస్తారు. ఇంతలో వాచ్‌మెన్ వచ్చి ఒకమ్మాయి అబ్బాయిని నలుగురు రౌడీలు తీసుకెళ్లారని చెప్తారు. వాళ్లు కొంప తీసి యువరాజ్, నిషిక అయ్యుంటారేమో అనుకుంటారు. మంత్రసాని మంగమ్మని వెతకడానికి వెళ్తారు. ఇంతలో కౌషికి జగద్ధాత్రికి కాల్ చేసి యువరాజ్, నిషిలు కనిపించడం లేదని చెప్తుంది. మేం చూసుకుంటామని జగద్ధాత్రి అంటుంది. జగద్ధాత్రి, కేథార్‌లు ఆ కిడ్నాప్ అయింది యువరాజ్, నిషికలేనా అనుకొని వెతకడం మొదలు పెడతారు.
యువరాజ్, నిషికల్ని మంత్రసాని కట్టేసుంటుంది. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేసి కిడ్నీలు అమ్మేయాలని అనుకుంటుంది. మీనన్‌తో మాట్లాడి డీల్ కుదుర్చుకుంటుంది. యువరాజ్, నిషికలు ఆ మాటలు విని భయపడతారు. మనం చనిపోతామా యువరాజ్ అని అంటే యువరాజ్ నా భార్యని వదిలేయ్ కావాలి అంటే నన్ను చంపేయ్ అంటాడు. నిషిక యువరాజ్‌ని వదిలేయమని అంటుంది. యువరాజ్ బ్లేడ్‌తో కట్లు తెంపి రౌడీలను కొట్టి భార్య కట్లు విప్పుతాడు. ఇంతలో రౌడీలు ఇద్దరి తలా పగలగొట్టేస్తారు. ఇద్దరూ చనిపోయాని వదిలేసి బయటకు వెళ్తారు. ఇంతలో నిషిక జగద్ధాత్రికి కాల్ చేసి తన కండీషన్ చెప్తుంది. జగద్ధాత్రి ధైర్యం చెప్పి ఆ నెంబరు కేథార్‌కి చెప్పి లొకేషన్ ట్రేస్ చేయించమని అంటుంది. మీనన్ మంగమ్మకి కాల్ చేసి వాళ్లున్న ప్లేస్ మార్చేయండి అని అంటాడు. నిషిక యువరాజ్ లేవడం లేదు హాస్పిటల్‌కి తీసుకెళ్లమని అంటే యువరాజ్ చనిపోయాడని మంత్రసాని చెప్తుంది. నిషిక కోపంతో మంత్రసాని మీదకు వెళ్తే నిషికను కొట్టేసి ఇద్దరినీ కారులో ఎక్కించుకొని వెళ్తారు. మనీన్ లోకేషన్‌కి వచ్చేస్తారు. మీనన్ నిషిక వాళ్లని చూడటానికి వెళ్తే టైంకి జేడీ, కేడీలు అక్కడికి వచ్చేస్తారు. జేడీ, కేడీలను చూసి మీనన్ బిత్తర పోతాడు. మీనన్ తన రౌడీలను జేడీ, కేడీల మీదకు పంపుతాడు. ఇద్దరూ రౌడీలను చితక్కొడతారు. మంత్రసాని జేడీని కొడుతుంది. మమల్నే మోసం చేస్తావా అని జేడీ ఒక్క దెబ్బ కొట్టడంతో మంత్రసాని పడిపోతుంది. ఇక జేడీ, మీనన్‌లు ఫైట్ చేస్తారు. మీనన్ జేడీని కొట్టేస్తాడు. జేడీ, కేడీలు ఇద్దరూ మీనన్ మీదకు వెళ్లడంతో ఇద్దరినీ మీనన్ కొడతాడు. దాంతో కేడీ జేడీని పక్కన ఉండమని మీనన్‌తో గొడవ పడతాడు. మీనన్ కేడీని కొట్టేస్తాడు. కేడీ మీనన్ చేతిలో చాలా దెబ్బలు తింటాడు. మీనన్ తన మనిషిని కత్తి అడిగి కేడీని నరికే టైంకి జేడీ గన్‌తో కత్తి మీద పేల్చుతుంది. కేడీ దగ్గరకు జేడీ వెళ్లే లోపు మీనన్ తప్పించుకొని పారిపోతాడు.
జేడీ, కేడీలు నిషిక, యువరాజ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. నిషిక లేచే టైంకి జగద్ధాత్రిగా జేడీ అక్కడ ఉంటుంది నిషిక యువరాజ్ గురించి అడిగితే బాగానే ఉన్నాడు ఏం కాలేదని జగద్ధాత్రి చెప్తుంది. యువరాజ్ కండీషన్ చూసి కేథార్ ఏడుస్తాడు. నిషి జగద్ధాత్రికి సారీ చెప్తే జగద్ధాత్రి నిషితో క్షమిస్తున్నానని ప్రతీ సారి తప్పులు చేసి సారీ చెప్తే ఆ సారీకి విలువ ఉండదు అని అంటుంది. కేథార్ యువరాజ్ దగ్గర కూర్చొని నేను అంటే ఎందుకు యువరాజ్ నీకు అంత కోపం నేను వచ్చినప్పుడు నుంచి నన్ను అన్న అని ఎప్పుడు పిలుస్తావా అనుకుంటే నన్ను రోజు రోజుకూ ద్వేషిస్తున్నా నేనం ద్రోహం చేశానురా అని కేథార్ అడిగితే నువ్వ మా ఇంటికి రావడమే నువ్వు నాకు చేసిన ద్రోహం అని యువరాజ్ అంటాడు. నేను ఆస్తుల కోసం రాలేదురా కేథార్ అనాథ కాదు వాడికి నాన్న, పిన్ని, తమ్ముడు, అక్క అంటూ ఓ ఫ్యామిలీ ఉందని సమాజానికి చెప్పుకోవాలని అంతే కానీ వేరే ఏమీ ఆశించలేదని అంటాడు. కేథార్ వెళ్లిపోయిన తర్వాత యువరాజ్ కోపంగా నువ్వు ఎప్పటికీ వజ్రపాటి వారసుడివి కాదు.. నేను నిన్ను అన్న అని పిలవను.. అనుకుంటాడు. నిషిక కోపంగా జగద్ధాత్రితో కాపాడావని థ్యాంక్స్ చెప్తా అంతే కానీ నువ్వు నాకు ఎప్పటికీ అక్క కాదు కానివ్వను.. అని అంటుంది. కేథార్ ఏడుస్తుంటే జగద్ధాత్రి అక్కడికి వెళ్తుంది. విషయం తెలుసుకొని యువరాజ్ నిన్ను అన్నగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడని అంటుంది. ఇవీ ఈ వారం హైలెట్స్.