Prema entha madhuram september 14th: ఈరోజు ఎపిసోడ్ లో అను అభయ్ తో ,సారీ చెప్పమన్నప్పుడు చెప్పొచ్చు కదా నాన్న అని అంటుంది.


అభయ్: నేనేమీ తప్పు చేయలేదు అమ్మ. వాడు అక్కి ని ఏడిపించాడు కాబట్టే నేను పనిష్మెంట్ ఇచ్చాను. నేనెందుకు సారీ చెప్పాలి?


అను: నేను కూడా నీ మీద చేయి చేసుకున్నాను కదా నా మీద కూడా కోపం వచ్చిందా? నాకు కూడా పనిష్మెంట్ ఇస్తావా?


అభయ్: నీ మీద నాకు కోపం లేదమ్మా. మాకు ప్రేమైనా కోపం అయినా నువ్వు తప్ప ఇంక ఎవరున్నారు చెప్పు. అని అనగా అను వెంటనే ఎమోషనల్ అయ్యి పిల్లలు ఇద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది. 


ఆ తర్వాత సీన్లో ఆర్య, జెండే, నీరజ్, అంజలి లు తమ ఇంటి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు.


నీరజ్: ఏంటి దాదా ఇది మిమ్మల్ని నాశనం చేస్తానని నడుమకట్టు కట్టుకున్న ఛాయాదేవి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనడం ఏమిటి? 


అంజలి: అయినా సర్ ఈ విషయం మీకు తెలిసినప్పుడే ఆటో చెంప ఇటో చెంప వాయిస్తే సరిపోయేది కదా. మీరు ఎందుకిలా ఊరుకున్నారు? అయినా తనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?


ఆర్య: అది ధైర్యం కాదు చేతకానితనం. నన్ను పతనానికి గురి చేస్తాను అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేక పోయింది. ఆఖరికి నా పతనం కోసం రూట్ మార్చి ఇలాగా నన్ను నాశనం చేయాలనుకుంటుంది. అయితే దీని వెనక ఏదో పెద్ద కారణమే ఉంటుంది, అదేంటో తెలుసుకోవాలి. అప్పటివరకు ఓర్పు తో ఉండాలి


నీరజ్: నాకు చాలా భయంగా ఉంది దాదా ఆ ఛాయాదేవి మళ్లీ ఏం చేస్తుందో


ఆర్య: ఏం భయపడాల్సిన అవసరం లేదు. తను ఎత్తేస్తే నేను దానికి పై ఎత్తు వేస్తాను. మీరు దాని గురించి బాధపడొద్దు ఇంక వెళ్ళండి. అని నీరజ్ అంజలిలను అక్కడి నుంచి పంపించేస్తాడు.


జెండే: నువ్వు అన్నట్టు ఓర్పుగా ఉండడం కరెక్టే ఆర్య, కానీ ఎంతకాలం అని అలా ఉంటాము. ఆ ఛాయాదేవికి గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందే లేదంటే భయం ఉండదు. అని అంటాడు.


ఆ తర్వాత సీన్లో ఛాయాదేవి కార్ లో వెళ్తుండగా మాన్సికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. ఇంతలో తన చుట్టుపక్కల చాలా కారులు వచ్చి తనని అడ్డుకుంటాయి. భయపడిన ఛాయాదేవి ఏంటని బయటికి వెళ్లి చూసేసరికి అక్కడ జెండే ఉంటాడు.


జెండే: ఏంటి బాగా భయపడినట్టు ఉన్నావు?


ఛాయాదేవి: ఏంటి బెదిరిస్తున్నారా?


జెండే: బెదిరించడానికి రాలేదు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఆర్య నీ మీద ఒక్క క్షణం ఫోకస్ పెడితేనే సీన్ ఇలాగ మారింది అదే నీ లిమిట్స్ క్రాస్ చేసి ఒక్క అడుగు వేసిన సరే ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఏంటి ఆర్య ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆ ఆలోచనని కూడా రానివ్వొద్దు. ఆర్య ఎప్పుడు అనురాధ సొంతమే. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా ఒకటవుతారు. ఇప్పటికైనా నీ లిమిట్స్ లో నువ్వు ఉండు బి కేర్ఫుల్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


Also Read: ఒక్క సీన్ తో తల్లకిందులైన మూడు జీవితాలు- మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, ముకుంద


ఆ రోజు రాత్రి ఆర్య గార్డెన్ లో ఛాయాదేవితో జరిగిన సంఘటన అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కి ఆర్య కి ఫోన్ చేస్తుంది.


 అక్కి: హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు?


ఆర్య: నేను బాగున్నాను డియర్ నువ్వెలాగున్నావు?


అక్కి: నేను బాగున్నాను ఫ్రెండ్ మీరు గుర్తొచ్చారు అందుకే మాట్లాడాలనిపించింది.


ఆర్య: రాత్రి అయింది కదా ఇంకా పడుకోలేదా? ఇంతకీ మీ అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు?


అక్కి: మా అన్నయ్యకి తెలియకుండా ఫోన్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్ లేకపోతే వచ్చి తిడతాడు. ఇప్పుడే హోంవర్క్ రాసుకొని పడుకోడానికి వెళ్ళాడు. 


ఆర్య: ఓ అందుకేనా నెమ్మదిగా మాట్లాడుతున్నావు. ఇంతకీ మీ మమ్మీకి నువ్వెక్కువ ఇష్టమా? మీ అన్నయ్య ఎక్కువ ఇష్టమా?


అక్కి: మా అమ్మకి ఇద్దరూ బోల్డంత ఇష్టం ఫ్రెండ్. కాకపోతే నేను అల్లరి చేస్తాను కదా అందుకే కొంచెం కోపం. అవునూ ఇంతకీ మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తారా? వాళ్ళు ఎప్పుడు వస్తారు ఫ్రెండ్ నాకు కూడా వాళ్ళతో ఆడుకోవాలని ఉంది. అని అక్కి అనగా ఆ మాటలకి ఆర్య బాధపడతాడు.


ఆర్య: వాళ్ళు ఎప్పుడు వస్తారో నాకు తెలీదు నేను కూడా వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నాను. అని అనగా ఇంతలో అను అక్కి గదిలోకి వస్తుంది.


అక్కి: సరే ఫ్రెండ్ మా అమ్మ వస్తున్నట్లుంది నేను తర్వాత చేస్తాను బాయ్ గుడ్ నైట్. అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత పడుకున్నట్టు నటిస్తుంది. ఇంతలో అను అక్కడికి వస్తుంది.


అను: ఏం చేస్తున్నావు?


అక్కి: ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అని అనగా ఇంతలో అభయ్ కూడా అక్కడికి వస్తాడు.


అభయ్: ఏ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావ్?


అక్కి: పెద్ద ఫ్రెండ్. ఆర్య వర్ధన్ సార్ తో మాట్లాడుతున్నాను అని అనగా దానికి అను షాక్ అవుతుంది.


అభయ్: ఎన్నిసార్లు చెప్పాను అక్కి నిన్ను తనతో మాట్లాడొద్దు అని కనీసం నువ్వైనా చెప్పమ్మా అని అనుతో అంటాడు అభయ్.


అను: అంత పెద్ద వాళ్ళు చనువుగా ఉన్నారని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకూడదు అక్కి. వాళ్ళు బిజీగా ఉంటారు.


అక్కి: ఎందుకో తెలీదు అమ్మ సార్ ని చూడగానే నాకు ఫ్రెండ్ లా అనిపించారు. మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను ఇంకెప్పుడు అలా చేయను. ఇంక నాకు నిద్ర వస్తుంది నాకు జోకొట్టు అని పడుకుండిపోతుంది అక్కి.


అను: అయ్యో దేవుడా ఈమధ్య అక్కి సార్ కి బాగా దగ్గరవుతుంది. నేను ఎంత దూరంగా ఉండాలనుకున్నా వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి కాపాడు అని మనసులో బాధపడుతుంది.


Also Read: ఛాయా రాక గురించి తెలుసుకున్న ఆర్య - అను మీద గొడవకు దిగిన సాత్విక తల్లి!


ఆ తర్వాత సీన్లో ఉదయాన్నే పూజ గది దగ్గరికి వెళ్లి అను అక్కి కి కుంకుమ ఇచ్చి అన్నయ్యకి రాఖీ కట్టు అని అంటుంది.


అక్కి: నాకేం గిఫ్ట్ ఇస్తాడో చెప్పమనమ్మ అప్పుడే నేను రాఖీ కడతాను అమ్మ. కిందటిసారి కూడా రాఖీ కడితే చిన్న చాక్లెట్ ఇచ్చాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య తనకి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా.


అను: అలా పక్క వాళ్ళతో కంపేర్ చేయొద్దు అక్కి. నువ్వు ముందు రాఖీ కట్టు తర్వాత అన్నయ్య గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పగా అక్కి అభయ్ కి రాఖీ కడుతుంది. అప్పుడు అభయ్ లోపలికెళ్ళి అక్కికి గిఫ్ట్ తెస్తాడు. అది ఓపెన్ చేయగా అందులో పట్టీలు ఉంటాయి. అప్పుడు అభయ్ అక్కికి పట్టిలు పెట్టగా చాలా బాగున్నాయి అని అక్కి అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.