Prema entha madhuram september 13th: ఈరోజు ఎపిసోడ్ లో జెండే ఛాయాదేవితో, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అనునే ఆర్య భార్య. నౌ గెట్ అవుట్ అని అరుస్తాడు.
ఛాయాదేవి: ఫైన్ ఇప్పుడు గెస్ట్ గా వచ్చాను గెస్ట్ గానే వెళ్తాను. కానీ నెక్స్ట్ టైం కుటుంబ సభ్యురాలు లాగే ఇంట్లో అడుగు పెడతాను.
జెండే: పగటి కలలు కనడం ఆపు.
ఛాయాదేవి: ఇంటికి వచ్చిన ఆడపిల్లకి బొట్టు కూడా పెట్టలేదు మీరు పగటి కలలు గురించి మాట్లాడుతున్నారు. అని చెప్పి వెనక ఉన్న వాళ్ళతో, ఇది మన ఇల్లే వీళ్ళు మన కుటుంబం సభ్యులే తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టేయండి అని చెప్పి అమ్మవారి దగ్గర కుంకుమ పెట్టుకుంటుంది.
నీరజ్: తెచ్చినవి తెచ్చినట్టే తీసుకొని వెళ్ళు. అని ఫైర్ అవుతాడు.
ఛాయాదేవి: సరే ఈరోజు, నేను తెచ్చినవన్నీ తీసుకుని వెళ్తాను. కానీ ఏదో ఒక రోజు తిరిగి ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నీరజ్: వాట్ ఇస్ దిస్ జెండే. ఇలాంటి విషయం జరిగినప్పుడు మాకు చెప్పాలి కదా.
జెండే: ఇప్పుడేమనోద్దు అసలకే ఆర్య మూడ్ ఆఫ్ లో ఉన్నాడు. అని అనగా ఇంతలో ఆర్య కిందకి వస్తాడు. ఆర్యని చూసిన చైత్ర ఆర్యని వెళ్లి పలకరిస్తుంది.
ఆర్య: వాటే సప్రైజ్ చైత్ర ఎప్పుడు వచ్చావు?
చైత్ర: నేను వచ్చి చాలా సేపు అవుతుంది మీరే లేటుగా వచ్చారు. తిను నా ఫ్రెండ్ రాధ ఫ్రం బెంగళూరు అని అనుని పరిచయం చేయిస్తుంది. అప్పుడు ఆర్య అను ఒకరికొకరు హలో అని పరిచయం చేసుకుంటారు.
ఆర్య: సరే అందరూ భోజనం చేశారా?
అంజలి: చేయలేదు. నేను నీరజ్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అప్పుడు వస్తాను.
చైత్ర: అలాగే ఆర్య సార్ మాకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. మేము కూడా మీలాగే జీవితంలో మంచిదారిలో ఎదగాలి అలాగే మీ అంత సక్సెస్ రావాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. అని అనుని కూడా తీసుకొని వెళ్లి ఆర్య చేత ఆశీర్వాదాలు తీసుకొనేలా చేస్తుంది చైత్ర. అప్పుడు ఆర్య వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత సీన్లో చైత్రను తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు శారదమ్మ అక్కడికి వస్తుంది.
Also Read: ఆస్తి పేపర్లతో అడ్డంగా దొరికిపోయిన సుమన- నయనిని ఆపే ప్రయత్నంలో తిలోత్తమ!
శారదమ్మ: జీవితంలో సక్సెస్ అవ్వడమే కాదు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి కూడా చేసుకోవాలి.
నీరజ్: నీ పెళ్లి కోసం వెయిటింగ్ మేము.
చైత్ర: నేను కూడా తిరిగి వచ్చేసరికి నీ గుడ్ న్యూస్ కోసం కూడా ఎదురుచూస్తాను. అని నీరజ్ తో చెప్పి ఆర్య వైపు తిరుగుతుంది.
చైత్ర: ఆర్య సర్ మీరు బయటికి ప్రశాంతంగా ఉన్న లోపల దిగులుగా ఉన్నారని నాకు తెలుసు. త్వరలోనే అను, ఆనందం రెండు మీ జీవితంలోకి వస్తాయి. బాధపడొద్దు అని చెప్పి అనుని తీసుకొని కారు ఎక్కుతుంది.
ఆర్య: ఒక నిమిషం ఆగండి. అని అనేసరికి చైత్ర కి, అనుకి భయం మొదలవుతుంది.
ఆర్య: కార్ డోర్ దగ్గర తన చీర ఉండిపోయింది. అని చెప్పగా అను ఊపిరి పీల్చుకొని చీరని సరిచేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆర్య: చైత్ర ఎందుకలా మాట్లాడింది? తనకు అను గురించి ఎవరు చెప్పారు? ఏం జరిగింది జెండే?
జెండే: ఇందాక ఛాయదేవి వచ్చి వెళ్ళింది ఆర్య.
Also Read: వాటే సీన్ - మురారీ తన వాడేనని తెగేసి చెప్పిన కృష్ణ, ముకుందకి అదిరే ఝలక్!
ఆ తర్వాత సీన్లో అను, చైత్ర ఇద్దరు కార్ దిగి అను ఇంటికి వస్తారు. అప్పుడు అను ఛాయాదేవితో జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.
చైత్ర: ఏంటి అను ఇంకా ఛాయాదేవి చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉన్నావా? ఆర్య సార్ మనసులో తనకి చోటు ఉండే అవకాశమే లేదు.
అను: ఆర్య సార్ మనసులోని, జీవితంలోని అన్నిట్లోని నేనే ఉంటానని నాకు తెలుసు. కానీ నా బాధ ఏంటంటే ఇప్పటివరకు సార్ ని పతనానికి గురి చేస్తానని చెప్పిన ఛాయాదేవి ఒకేసారి ప్రేమ పెళ్లి అంటుంది అంటే దీని వెనుక ఏదో ఒక కన్నింగ్ ప్లాన్ ఉండే ఉంటుంది కదా?
చైత్ర: ఏదేమైనా ఆర్య సార్ చూసుకుంటారు ఏం పర్వాలేదు. ఒకసారి సార్ రంగంలోకి దిగితే కాంపిటీషనే ఉండదు.
అను: ఎనీ వే థాంక్యూ చైత్ర ఈరోజు నీ వల్లే ఆ ఇంట్లో పూజ చేసి ఆర్య సార్ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోగలిగాను. అని అనగా ఇంతలో పిల్లలు ఇద్దరు అక్కడికి వస్తారు. అప్పుడు అను పిల్లలిద్దరిని చైత్రకి పరిచయం చేస్తుంది.
చైత్ర: హాయ్ అభయ్, హాయ్ ఆకాంక్ష నేను మీ అమ్మ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ని.
ఆకాంక్ష, అభయ్: అయితే మాకు కూడా ఫ్రెండే. అని అనగా కార్లో నుంచి స్వీట్లు తెచ్చి పిల్లలిద్దరికీ ఇస్తుంది చైత్ర.
అను: లోపలికి రా చైత్ర ఏమైనా తిందువుగానివి.
చైత్ర: అమ్మో నా కడుపు అస్సలు ఖాళీగా లేదు మరోసారి వచ్చినప్పుడు నాకు నచ్చినవన్నీ నీ చేత చేయించుకుంటాను. ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్తుంది. ఇంకోసారి ఆర్య సార్ గురించి ఆలోచించు అను, పిల్లల భవిష్యత్తు కోసం కూడా చూసుకో అని చెవిలో చెప్పి, ఇంక ఏ సహాయం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి, నేనెప్పుడూ నీకోసం ఉంటాను. అని చెప్పి వెళ్ళిపోతుంది చైత్ర.
ఆ తర్వాత అను పిల్లలు ఇద్దరినీ తీసుకొని ఇంటి లోపలికి వెళుతుంది. ఇంతలో సాత్విక్ వాళ్ళ అమ్మతోపాటు అను వాల్ల ఇంటికి వస్తాడు.
సాత్విక్ వాళ్ళ అమ్మ: చూసావా రాధమ్మ మీ అబ్బాయి మా సాత్విక్ ని ఎలా కొట్టాడో? ఆ చేయి చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో.
అను: లేదు మీరు ఏదో పొరబడుతున్నట్టున్నారు అభయ్ అలాంటి పనులు చేయడు.
సాత్విక్ వాళ్ళ అమ్మ: ఆ మాట మీ అబ్బాయి చేతే చెప్పించండి.
అను: చెప్పు అభయ్ ఇది నువ్వు చేసావా?
అక్కి: అమ్మ అన్నయ్య అది కావాలని చేయలేదు. అసలు ఆ సాత్విక్ అని చెప్పేలోగే సాత్విక్ వాళ్ళ అమ్మ ఆపి, ఆగమ్మా పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు మీ అన్నయ్యని బాగా వెనకేసుకొని వస్తున్నావు. అయినా తండ్రి లేని పెంపకం అలానే ఉంటుంది మరి అని అంటుంది.
Also Read: DBST కాలేజీలోకి రిషి రీ ఎంట్రీ , శైలేంద్ర కుట్రకు జగతి చెప్పే సమాధానం ఇదేనా!
అభయ్: కొట్టింది నేనైతే మా అమ్మని ఎందుకు అంటారు?
అను: అభయ్ వెళ్లి తనకి సారీ చెప్పు. అని ఎంత అడిగినా సరే అభయ్ నోట్లో నుంచి మాట బయటికి రాదు. ఎంత చెప్పినా వినకపోవడంతో అను అభయ్ ని కొడుతుంది. అప్పుడు అభయ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అభయ్ వెనకనే అక్కి కూడా వెళ్ళిపోతుంది.
అను: అభయ్ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి అని చెప్పగా సాత్విక్ తన తల్లి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అను పిల్లలిద్దరి దగ్గరికి వస్తుంది.
అక్కి: నువ్వు నిజం తెలుసుకోకుండా అన్నయ్యని అనవసరంగా కొట్టావు అమ్మ. అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తుంది.
అను: సారీ అభయ్ నిజం తెలుసుకోకుండా కొట్టాను. గట్టిగా కొట్టాను నొప్పి పుడుతుందా?. అయినా తనని కొట్టడం తప్పు అభయ్ సారి చెప్పేస్తే సరిపోయేది కదా.
అభయ్: నేనేమీ తప్పు చేయలేదు అమ్మ. అక్కి ని ఏడిపించాడు కాబట్టే కొట్టాను. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.