Brahmamudi September 13th: అనామిక కళ్యాణ్ గది మొత్తం గమనిస్తుంది. బెడ్ మీద ఉన్న తన ఫోటో చూసి అనామిక మురిసిపోతుంది. కావ్య కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటే రాజ్ వచ్చి ఏం చేస్తున్నావని అంటాడు. కిచెన్ లోకి ఎందుకు వచ్చారని అడుగుతుంది.


రాజ్: నేను చెప్పేది వినిపించుకో. నేను ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యానో నాకే తెలియదు.


కావ్య: నేను పనిలో ఉన్నాను. వినేంత టైమ్ నాకు లేదు


రాజ్: ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడో వినడం ధర్మం


కావ్య: ఇందాక ఈ ధర్మం ఏమైంది అనేసి రాజ్ చెప్పేది వినిపించుకోకుండా ఉంటుంది. పెళ్ళాన్ని కూల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. కావ్య స్వీట్ చేస్తుంటే రాజ్ వేలు పెట్టి అందులో తను పంచదార వేస్తానని వేసేస్తాడు. మీరు మారతారని ఆశ పడ్డాను కానీ ఎప్పటికీ మారరని అర్థం అయ్యింది. మీలోని ఒరిజినల్ రాజ్ బయటకి వస్తూనే ఉంటాడని తిడుతుంది. తిట్టడం బాగుంది కానీ తిట్టించుకోవడం కష్టమేనని మనసులో అనుకుంటాడు. స్వీట్ బౌల్స్ లో వేసుకుని కావ్య ఇంట్లో వాళ్ళకి పెట్టడానికి తీసుకెళ్తుంది. అప్పుడు రాజ్ తను వేసింది షుగర్ కాదు ఉప్పని తెలుసుకుంటాడు. అయ్యయ్యో ఇంటికి వచ్చిన గెస్ట్ కి ఉప్పు వేసిన స్వీట్ పెడుతున్నామా ఎలాగైనా ఆపాలని మళ్ళీ కావ్య వెంట పడతాడు.


ALso Read: ముకుంద, మురారీలని చూసి ముక్కలైన కృష్ణ మనసు- ఆదర్శ్ తిరిగి వస్తాడా!


కావ్య స్వీట్ తెచ్చి అనామికకి ఇస్తుంటే గిన్నె లాగేసుకుని వద్దని అంటాడు. రాజ్ వింత ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైందని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తారు. ఏం చెప్పాలో తెలియక రాజ్ బిక్క మొహం వేస్తాడు. కావ్య అనామికకి చీర పెడుతుంది. ఇక తను వెళ్లిపోగానే కళ్యాణ్ ని అందరూ రౌండప్ చేసేసి ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తాడు. ఏం లేదని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ధాన్యలక్ష్మి స్వీట్ అందరికీ ఇవ్వమని అంటే రాజ్ గట్టిగా వద్దని అరుస్తాడు. కానీ కావ్య వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి ఇస్తుంది. అందరూ అది తిని యాక్ అంటారు. ఉప్పు ఎక్కువైందని అంటారు. అది మీ మనవడి పని ఆయనే అందులో ఉప్పు వేశారని కావ్య రాజ్ ని ఇరికించేస్తుంది. కిచెన్ లో నీకేం పనని రుద్రాణి అంటే ఈ మధ్య వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంటే రాజ్ కూడా అక్కడే ఉంటున్నాడని సెటైర్ వేస్తుంది. ఏం చెప్పాలో తెలియక రాజ్ వెర్రి నవ్వు ఒకటి వేస్తాడు.


అప్పుకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి సినిమాకు వెళ్దాం రమ్మని అడుగుతాడు. కానీ అప్పు మాత్రం రానని అనేసరికి మారిపోయావని అంటాడు. ఎప్పుడు చూసినా ఆ కళ్యాణ్ తో తిరుగుతున్నావని అనేసరికి చిరాకుగా ఫోన్ పెట్టేస్తుంది. కనకం కూతుర్ని చూసి ఏంటి ఇంత సైలెంట్ గా ఉన్నావ్ మారిపోయావ్ అంటుంది. దీంతో అందరూ అలా అంటున్నారు ఏంటని బయటకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తుంటే అన్నపూర్ణ వెళ్ళి కదిలిస్తుంది.


రాజ్ మళ్ళీకావ్య కోసం ఇల్లంతా వెతకడం ధాన్యలక్ష్మి చూస్తుంది.


ధాన్యలక్ష్మి: ఎవరి కోసం చూస్తున్నావ్


రాజ్: వచ్చింది ఎవరో గమనించుకోకుండా ఇంకెవరూ కళావతి కోసం చూస్తున్నా. తనని ఇంప్రెస్ చేయాలి కదా


ధాన్యలక్ష్మి: ఇక్కడ ఎందుకు వెయిట్ చేయడం బెడ్ రూమ్ కి వస్తుంది కదా


రాజ్: అంత టైమ్ లేదు వెంటనే ఇంప్రెస్ చేయాలి


ధాన్యలక్ష్మి: ఎందుకు ఇంప్రెస్ చేయడం


కాసేపటికి తనని చూసి పిన్నీ నువ్వా అనేసి బిత్తరపోతాడు. దొరికిపోయానే అనుకుని ఏవేవో సమాధానాలు చెప్తాడు. కావ్య ఇక్కడ లేదని తాతయ్య దగ్గరకి వెళ్ళిందని చెప్పేసరికి రాజ్ కంగారుగా వెళతాడు. కావ్య ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి చూస్తుంటే రాజ్ కంగారుగా ఏం చెప్పాలని వచ్చావని అంటాడు. కాసేపు ఇద్దరూ పిల్లీ ఎలుకలా పోట్లాడుకుంటారు. అసలు ఏం జరిగిందని సీతారామయ్య అడుగుతాడు. ఏం లేదని కవర్ చేసుకోలేక తిప్పలు పడతాడు.


కావ్య: ట్యాబ్లెట్స్ చూసి మీరు వేసుకోవాల్సింది మూడే కదా ఇన్ని ఉన్నాయ్ ఏంటి


Also Read: కావ్య వెనుక కుక్కపిల్లలా తిరుగుతున్న రాజ్- కళ్యాణ్ తో ప్రేమలో అప్పు!


రాజ్: డాక్టర్స్ ని అనుమానిస్తున్నావా? అయినా నానమ్మ ఉండగా నువ్వు ఎందుకు వేస్తున్నావ్ అని కంగారుగా అడుగుతాడు


సీతారామయ్య: మొన్న హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు పెంచారు. మీరు వెళ్ళండి నేను వేసుకుంటాను అనేసరికి వెళ్లిపోతారు.


కావ్య గదిలోకి రాగానే రాజ్ థాంక్స్ చెప్తాడు. అది వినగానే షాక్ అవుతుంది.


తరువాయి భాగంలో..


ఇంట్లో పని చేసే పని మనిషి శాంత అపర్ణ దగ్గరకి వెళ్ళి డబ్బులు కావాలని అడుగుతుంది. కానీ ఇవ్వడం కుదరదని చెప్పడంతో రుద్రాణి వాళ్ళని గమనించి శాంతని పక్కకి పిలిచి కావ్యని వెళ్ళి అడిగితే డబ్బులు ఇస్తుందని పుల్ల పెడుతుంది. వెంటనే అపర్ణ దగ్గరకి వెళ్ళి ఇందాక నువ్వు శాంతకి డబ్బులు ఇవ్వనని చెప్పావ్ కదా ఇప్పుడు కావ్య ఇస్తుందని అనేసరికి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. కావ్య డబ్బులు ఇస్తుండగా ఆగు అని గట్టిగా అరుస్తుంది.


Also Read: DBST కాలేజీలోకి రిషి రీ ఎంట్రీ , శైలేంద్ర కుట్రకు జగతి చెప్పే సమాధానం ఇదేనా!