Krishna Mukunda Murari September 12th: మురారీ గదిలో చేసిన డెకరేషన్ తీసేసింది మధుకర్ అనే విషయం అలేఖ్య ముకుందకి చెప్తుంది. ఇంట్లో వాళ్ళ గురించి నెగటివ్ గా చెప్పేందుకు ట్రై చేస్తుంది. దీంతో తనతో జాగ్రత్తగా ఉండాలని ముకుంద మనసులో అనుకుంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉంటారు కానీ ముకుంద, కృష్ణ ఉండరు. ఎందుకో ముకుంద ఈ మధ్య డల్ గా ఉంటుందని భవానీ అంటుంది.


అలేఖ్య: ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఇంట్లో ఎవరూ తనతో సరిగా మాట్లాడటం లేదు. మొన్న రెస్టారెంట్ లో ఎవరో తనని మురారీ భార్య అనుకున్నారని చెప్తే మీరు కొప్పడ్డారు కదా అప్పటి నుంచి అని చెప్పబోతుంటే రేవతి కోపంగా చూసేసరికి మౌనంగా ఉంటుంది


మధుకర్: పెద్దమ్మ సోరి. మీరు ఎప్పుడు ఎవరినీ ఏమి అనరు ఆ క్లారిటీ మాకు ఉంది. తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్పాయితే ఇక పెద్దరికానికి విలువ ఏముంది


ప్రసాద్: మంచి మాట చెప్పావు రా.. ఆ విషయానికి అలిగానని నీకు ముకుంద చెప్పిందా


అలేఖ్య: చెప్పలేదు అనిపించింది


మధుకర్: మాకేవారికీ అనిపించనది కనిపించనిది నీకే కనిపించిందా? మాకేవారికీ ఫీలింగ్స్ లేవా?


Also Read: కావ్య వెనుక కుక్కపిల్లలా తిరుగుతున్న రాజ్- కళ్యాణ్ తో ప్రేమలో అప్పు!


కృష్ణ: నీ ఫీలింగ్స్ అన్నీ ఒక బుక్ లో రాసుకో మధు. ఇలా అందరి ముందు ఎక్కడి పడితే అలా మాట్లాడకూడదు


మురారీ: అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా


కృష్ణ: అందరూ టిఫిన్ కోసం కూర్చున్నారు. అంతే కదా.. ముకుంద ఏది


భవానీ: ముకుంద నాకు ఏదో నిజం చెప్పాలని అనుకుంది. అది ఏంటో అడగాలని అనుకుంటూ మర్చిపోతున్నా. ముకుంద ఏదో చూపిస్తానని చెప్పి చూపించలేదు. తింగరి పిల్ల నువ్వేమో నేను చెప్పిన విషయమే మర్చిపోయావ్. అసలు ఏమనుకుంటున్నారు మీరు


కృష్ణ: నేనేం మర్చిపోలేదు అత్తయ్య. క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత సర్ ప్రైజ్ ఉంటుందని అన్నారు. ఇంతకీ ఏంటి అది అత్తయ్య అనగానే డాక్యుమెంట్స్ భవానీ కృష్ణ చేతిలో పెడుతుంది


భవానీ: మీ అమ్మ కోరిక మేరకు పేదలకి ఉచిత వైద్యం చేస్తానని మాట ఇచ్చావ్ కదా అందుకే హాస్పిటల్ కట్టించాను


అవి చూసి కృష్ణ ఎమోషనల్ గా భవానీని కౌగలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన కోడలు కోసం ఆ మాత్రం కూడా చేయలేనా అని మంచి మనసు చాటుకుంటుంది భవానీ. ఇక ముకుందని ఏదో చూపిస్తాను అన్నావ్ ఏంటది అని భవానీ అడుగుతుంది. ఇప్పుడు నిజం చెప్తే మురారీని ఇరికించినట్టు అవుతుంది, తర్వాత మురారీని ఒప్పించి చెప్పాలని అనుకుంటుంది. తన గది వాస్తు బాగోలేదని అందుకే కలిసి రావడం లేదని ఏదో అబద్ధం చెప్పి అసలు విషయం చెప్పకుండా దాచేస్తుంది. తను అబద్ధం చెప్తున్నట్టు భవానీ పసిగట్టి మళ్ళీ నిలదీస్తుంది. అదేం లేదని చెప్పి కవర్ చేస్తుంది.


Also Read: నిజం చెప్పేయమన్న జగతి- ఏంజెల్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ రిషి


కృష్ణ గదిలో స్టెతస్కోప్ కనిపించలేదని హడావుడిగా వెతుక్కుంటూ ఉంటడగా ముకుంద వస్తుంది. హాస్పిటల్ కి తను కూడా వస్తానని ముకుంద అంటుంది. ఏం చెప్పాలి అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా అని కృష్ణ ఆత్రంగా అడుగుతుంది. ఎక్కడో ఎందుకు ఇక్కడే చెప్పు అంటుంది. కానీ ముకుంద మాత్రం బయట చెప్తాను పద అంటుంది. ఏసీపీ సర్ కి మెసేజ్ చేస్తానని అంటే తను విషయం చెప్పే వరకు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయాలని కృష్ణ ఫోన్ ఆఫ్ చేసేస్తుంది. ఇక ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. ఆదర్శ్ ని ఎలా కన్వీన్స్ చేయాలని భవానీ ఆలోచిస్తూ ఉండగా మురారీ వచ్చి ఎందుకు పిలిచారని అడుగుతాడు.


భవానీ: బోర్డర్ లో యుద్దం ముగిసింది. ఆదర్శ్ ని మనతో మాట్లాడించాలని కల్నల్ ఎంత ట్రై చేసినా వినిపించుకోవడం లేదు. మళ్ళీ అండర్ గ్రౌండ్ కి వెళ్తానని అంటున్నాడు. అసలు మనం దూరంగా ఉండటానికి కారణం ఎవరో నువ్వే కనిపెట్టాలి


నాకారణంగానే ఆదర్శ్ మన కుటుంబానికి దూరమయ్యాడు. ఇప్పుడు వాడిని నేనే రప్పిస్తాను అని మనసులో అనుకుంటాడు. కల్నల్ తో మాట్లాడి ఆదర్శ్ ని ఇంటికి రప్పిస్తానని మాట ఇస్తాడు.


తరువాయి భాగంలో..


ముకుంద దగ్గరకి మురారీ వస్తాడు. కృష్ణకి మన ప్రేమ గురించి మొత్తం చెప్పానని అంటుంది. దీంతో మురారీ షాక్ అవుతాడు. ముకుంద వెంటనే ఏడుస్తూ తన ప్రేమని రిజెక్ట్ చేయవద్దని తనని అంగీకరించమని కౌగలించుకుని ఏడుస్తుంది. అది కృష్ణ కంట పడుతుంది. వాళ్ళని అలా చూసి కృష్ణ షాక్ అవుతుంది.