Trinayani September 12th Written Update: హాల్లో నయని ఆట గురించి అందరికీ వివరిస్తూ ఉంటుంది. ఇంతలో తిలోత్తమ సుమనని మెట్ల నుంచి కిందకి దిగమని సైగ చేస్తుంది. నయని వాళ్లు మాటల్లో ఉంటున్నప్పుడు సుమన వెనుక నుంచి వెళ్ళిపోతుండగా గాయత్రి అటువైపు చూస్తుంది. ఏమైందమ్మా అని నయని కూడా అటువైపు చూడగా సుమన కనిపిస్తుంది.
నయని: సుమన ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్?
సుమన: పాపకి జ్వరంగా ఉంటే హాస్పిటల్ కి వెళ్తున్నా.
విక్రాంత్: అయితే ఆగు నేను వస్తా.
సుమన: ఏం అవసరం లేదు నా పాప గురించి నేను చూసుకోగలను.
తిలోత్తమ: తను చూసుకుంటుంది అంటుంది కదా వదిలేయరా. అని విక్రాంత్ తో అంటుంది. సుమన అక్కడి నుంచి బయటికి వెళ్లే లోగా విశాల్ నయని దగ్గరికి వస్తాడు.
విశాల్: సుమనని ఆపు నయని.
నయని: బాబు గారు మీరేంటి ఇక్కడ ఉన్నారు? అని అంటుంది. దానికి మిగిలిన కుటుంబ సభ్యులందరూ విశాల్ ఎక్కడ ఉన్నాడా అని వెతికేసుకుంటూ ఉంటారు.
హాసిని: విశాల్ ఎక్కడున్నాడు? మా ఎవరికీ కనబడడం లేదు.
నయని: నా కళ్ళముందే ఉన్నారు.
విశాల్: విభూది పెట్టుకున్నాను కదా నాయని నీకు తప్ప ఇంకఎవరికీ కనబడను మర్చిపోయావా.
సుమన: కొంపతీసి బావ గారు పోయారేమో. అసలకే అక్కకి ఆత్మలు కనిపిస్తాయి కదా ఆత్మలా తిరిగి వచ్చారేమో. ఇంక నేను బయలుదేరుతాను.
విశాల్: నయని, సుమననీ వెంటనే ఆపు. తన చేతిలో ఆస్తి పేపర్లు ఉన్నాయి.
నయని: సుమన ఇక్కడి నుంచి కదిలితే కాళ్లు ఇరుగు కొడతాను. అక్క, సుమన చేతిలో ఉన్న పాపని తీసుకో. అని అనగా హాసిని వచ్చి సుమన కూతుర్ని తీసుకుంటుంది. అప్పుడు సుమన చేతిలో ఉన్న ఫైల్ ని నయని బలవంతంగా లాక్కుని తెరిచి చూడగా సంతకం పెట్టిన ఆస్తి పేపర్లు కనిపిస్తాయి.
నయని: ఏంటిది చెల్లి?
సుమన: ఆస్తి పేపర్లు.
నయని: అందులో బాబు గారి సంతకం, వేలిముద్ర ఎలా వచ్చాయి?
సుమన: నువ్వు ఎలాగ ఇవ్వడం లేదని జాలిపడి బావగారు నాకు ఆస్తిని ఇచ్చారు. దబాయిస్తున్నావేంటి?
హాసిని: విషాల్ ఏమీ నా మొగుడు లాగా అమ్మాయిల వీక్నెస్ ఉన్నోడు కాదు, జాలి పడే ఆస్తిని ఇవ్వడానికి.
తిలోత్తమ: నువ్వు కొంచెం నీ నోరుని ఆపు. అని అంటుంది. ఇంతలో విశాల్ దగ్గర నిజం తెలుసుకుందాము అని నయని అటువైపు తిరిగి చూడగా విశాల్ కనబడడు.
నయని: ఎక్కడున్నారు బాబు గారు? నాకు మీరు కనిపించడం లేదు.
విశాల్: ఇచ్చిన మూడు నిమిషాల గడువు అయిపోయినట్టు ఉన్నది నయని. మా అమ్మ, సుమన కలిసి కుట్ర పన్ని, ఆస్తిని తీశారు అని నీకు చెప్పాలనుకున్నా నీకు వినబడదు. అని అనుకుంటాడు.
వల్లభ: ఇంకెక్కడుంటాడు తన గదిలో పడుకొని ఉంటాడు. ఇప్పుడే వెళ్లి చూసి వస్తాను. అని అందరికన్నా ముందే పైకి వెళ్తాడు.
దురంధర: పాపకు జ్వరం అన్నది కదా మరి హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి. అని అనగా హాసిని, చేతిలో ఉన్న పాపను తడిమి చూస్తుంది.
హాసిని: జ్వరం లేదు ఏమీ లేదు ఇదంతా చిట్టి ఆడుతున్న నాటకం.
విక్రాంత్: ఆఖరికి పసిబిడ్డని కూడా నీ నాటకంలో వాడుకున్నావు కదే. అని అంటాడు. ఇంతలో వల్లభ విశాల్ దగ్గరికి వెళ్లి తన చేతి మీద ఉన్న ఇంక్ ను చెరిపేస్తాడు. అదే సమయంలో అందరూ పైన గది దగ్గరకు వస్తారు.
Also Read: ముసలోడు రిజెక్ట్ చేసిన మళ్లీ పెళ్లి కావాలంటున్న ఛాయాదేవి!
హాసిని: నుదుటున విభూది రాసి ఉంది పడుకున్నారు. అని చెప్పి విభూది చెరగడానికి అని నీళ్లు తెస్తుంది. అవి జల్లగా విశాల్ పైకి లేస్తాడు.
నయని: బాబు గారు ఏమైంది?
విశాల్: ముందు సుమన ఎక్కడున్నాదో చెప్పు.
నయని: బయట ఉన్నది. అసలు విషయం ఏంటి? మీరు వేలిముద్రలు పెట్టడం ఏంటి?
విశాల్: బయటికి రా అందరికి కలిపి నిజం చెప్తాను. అని గది బయటికి వస్తాడు. సుమన కంగారు పడుతూ ఉండగా, మత్తులో ఉన్నప్పుడు జరిగిన వేవి విశాల్ కి గుర్తుండవు భయపడొద్దు అని తిలోత్తమా భరోసా ఇస్తుంది.
విశాల్: నేను కేవలం సంతకం మాత్రమే పెట్టాను. అందులో వేలిముద్రలు ఎలా వచ్చాయో నాకు తెలీదు. నయని ని అడిగి పెడతాను అని చెప్పాను కానీ వేలిముద్రలు పెట్టలేదు. ఇక్కడ ఏదో కుట్ర జరిగింది.
Also Read: జాహ్నవి మనసులో విష బీజం వేసిన రాజ్యలక్ష్మి- విక్రమ్ కి దివ్య దూరం కానుందా!
విక్రాంత్: అలా అయితే వేలిముద్రలు చూస్తే తేలిపోతాయి కదా. అని విశాల్ వేలిని చూసేసరికి అక్కడ ఇంక్ అంటుకొని ఉండదు.
దురంధర: అదేంటి వేలిముద్ర పడితే ఇంక్ అంటుకొని ఉండాలి కదా అక్కడ ఏమీ లేదు.
సుమన: చూశారా చూశారా మీరే అనవసరంగా నన్ను తప్పు పడుతున్నారు. బావగారు వేలిముద్రలు నాకు ఇచ్చారు కానీ ఇది ఇప్పుడు ఇచ్చినవి కాదు అప్పుడెప్పుడో ఇచ్చారు వాటిని తీసుకుని వెళ్తుంటే ఆపుతున్నారు
నయని: నాకు అర్థమైంది బాబు గారు. మీరు ఈ స్థితిలో ఉన్నారని వీళ్ళందరూ మిమ్మల్ని అయోమయం చేసి ఆడుకుంటున్నారు. నేను రేపే ప్రతిష్టానపురం వెళ్లి నవజీవన జలం తెచ్చి మిమ్మల్ని మామూలు స్థితికి తీసుకొని వచ్చి వీళ్ళకి సరైన గుణపాఠం చెప్తాను. అని ఆస్తి పేపర్లను కూడా తీసుకొని విశాల్ తో పాటు తన గదిలోకి వెళ్ళిపోతుంది నయని. ఆస్తి పేపర్లు తీసుకుని వెళ్లిపోవడంతో సుమన బాధపడుతుంది.
అదే రోజు రాత్రి గదిలో తిలోత్తమ ఆలోచనలలో పడుతూ ఉంటుంది. అదే సమయంలో వల్లభ అక్కడికి వస్తాడు.
వల్లభ: ఏంటి మమ్మీ అంత దీర్ఘ ఆలోచనలలో ఉన్నావు? ఎంత ఆలోచించినా నీ ఆయుషు తక్కువే.
తిలోత్తమ: ఇంత దృఢంగా ఉంటే ఆయుష్షు తక్కువ అంటావేంటి?
Also Read: ఏంజెల్ కి షాక్ ఇచ్చిన రిషి, టెన్షన్లో వసు - కొడుకు నిజస్వరూపం తెలుసుకున్న ఫణీంద్ర!
వల్లభ: ఎంత దృఢంగా ఉంటే మాత్రం ఆయుష్షు లేకుండా ఏం బ్రతుకుతావు మమ్మీ మొన్న పాము నిన్ను కాటేయ బోతుంటే నయని ఆపి నీ చావు గాయత్రి పెద్దమ్మ దగ్గర ఉన్నది అంది అంటే నీ చావు దగ్గరికి వస్తున్నట్టే కదా?
తిలోత్తమ: ఇంకెక్కడ గాయత్రి అక్క. సంవత్సరం నుంచి తన్ని వెతకడానికి నయని ఎన్నో కష్టాలు పడుతుంది అయినా దొరకలేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోబోయే నయనకి గతంలో ఏం జరిగిందో తెలిసే అవకాశం లేదు. ఇంక నా చావు వచ్చినట్టే.
వల్లభ: రేపు నయని ప్రతిష్టాపురం వెళ్లి విశాల్ నీ మామూలు స్థితికి తెస్తుంది.
తిలోత్తమ: అది జరగకుండా ఆపాలి. విశాల్ తిరిగి యవ్వనానికి వస్తే ప్రమాదం జరుగుతుంది.
వల్లభ: ఇద్దరు పిల్లలకు తండ్రి ఇప్పుడు యవ్వనం ఏంటి మమ్మీ?
తిలోత్తమ: యవ్వనం అంటే నువ్వు అంతవరకే ఆలోచించగలవు అదే విశాల్ అయితే కష్టపడి పని చేసి ఇంకా పై స్థాయికి ఎదుగుతాడు.
వల్లభ: దానివల్ల మనకి నష్టమేముంది మమ్మీ.
తిలోత్తమ: తిరిగి వాడు యవ్వనానికి వస్తే వాడిని ఆ చెరువుల తోసింది మనమే అని తెలిసి నీకు నాకు ఇంక ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడు. అందుకే ఎలాగైనా రేపు నయని ని అక్కడికి వెళ్లకుండా ఆపాలి.
వల్లభ: మొన్న కూడా వరలక్ష్మీ వ్రతం రోజు అదే చేద్దాం అనుకున్నాము కానీ పాము, పిల్ల అందరూ వచ్చి నయని కి సపోర్ట్ చేశారు. తనకే అన్ని చెల్లుతున్నాయి మమ్మీ.
తిలోత్తమా: ఏది జరిగినా మన ప్రయత్నం మనం చేయాలి. దొరకకుండా నయని నీ అడ్డుకోవాలి. అని అంటుంది ఆ తర్వాత రోజు ఉదయం వల్లభ తిలోత్తమలు గడప బయట చేతిలో పువ్వులు పట్టుకొని నయని కోసం ఎదురు చూస్తారు. దాంతోపాటు కుటుంబ సభ్యులందరూ మెట్లవైపు చూస్తారు.
హాసిని: అతిధులు వస్తారేమో అని గడప వైపు చూడాలి కాని మీరేంటి మెట్ల వైపు చూస్తున్నారు?
విక్రాంత్: అందరూ నయని వదిన కోసం ఎదురుచూస్తున్నారు.
సుమన: ఆవిడ ఒక మహారాణి ఆవిడ కోసం ఎదురుచూపులు.
విక్రాంత్: ఈరోజు నయని వదిన ఇష్టనాపురానికి వెళ్లి నవజీవన జలం తెస్తుంది. అని అనగా మరోవైపు గడప వెనుక వల్లభ, తిలోత్తమలు దాక్కుంటారు.
వల్లభ: ఆ పూలను నయిని గదిలోనే పెట్టుంటే సరిపోయేది కదా మమ్మీ.
తిలోత్తమ: అప్పుడే డౌట్ వచ్చేసేది రా. అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.