రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కు మూగ జీవాలు అంటే ప్రాణం. కరోనా కాలంలో విశాఖలోని మూగ జీవాలకు చాలా రోజులు ఆమె ఆహరం అందించారు. ముఖ్యంగా వీధి శునకాల సంరక్షణ విషయంలో తన గళాన్ని వినిపిస్తూ ఉంటారు రష్మీ.
హైదరాబాదులో ఈ మధ్య వీధి శునకాల దాడిలో ఓ బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఘటనలు జరగకుండా ఉండటం కోసం వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా వసతి కల్పిస్తే బావుంటుందని సోషల్ మీడియాలో సలహా ఇచ్చారు. ట్వీట్ చేశారు. రష్మీ గౌతమ్ వ్యక్తం చేసిన అభిప్రాయం మీద మిశ్రమ స్పందన లభించింది. ఓ నెటిజన్ అయితే అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
రష్మీని కుక్కను కొట్టినట్లు కొట్టాలి...
ఓపెన్ ఛాలెంజ్, నేనే వస్తా - రష్మీ!
వీధి కుక్కల కోసం రష్మీ గౌతమ్ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆమెను కుక్కతో పోల్చాడు ఓ నెటిజన్. అక్కడితో ఆగలేదు. ''ఈ కుక్క రష్మీని కుక్కను కొట్టినట్లు కొట్టాలి'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడితో రష్మీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
Also Read : అక్షయ్ కుమార్ పరువు తీసిన 'సెల్ఫీ' - పదేళ్ళలో వరస్ట్ ఓపెనింగ్!
''తప్పకుండా కొట్టొచ్చు. నేను వ్యక్తిగతంగా వస్తాను, నీ అడ్రస్ చెప్పు... ప్లీజ్! అప్పుడు చూద్దాం నువ్వు సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తావో? ఇది ఓపెన్ ఛాలెంజ్'' అని రష్మీ ట్వీట్ చేశారు. ఆమె ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ట్వీట్ చేసిన నెటిజన్ డిలీట్ చేశాడు. రష్మీకి మద్దతుగా చాలా మంది ట్వీట్లు చేశారు.
Also Read : వచ్చే వారమే మంచు మనోజ్, మౌనిక పెళ్ళి - ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?
రష్మీ గౌతమ్ మూగ జీవాల కోసం గళం వినిపిస్తూ ఉండటం కారణంగా ఆమెపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంత మంది అయితే ఆమెను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పాల ఉత్పత్తులకు కోడె దూడలు పనికిరావు కనుక వాటిని చంపుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిన నెటిజన్, వీగన్‌గా మారమని కోరారు. డైరీ ఇండస్ట్రీ హ్యాష్ ట్యాగ్‌తో ఆ వీడియో కోట్ చేశారు రష్మీ. తనను తాను రాహుల్ గాంధీ అభిమానిగా పేర్కొన్న వరప్రసాద్ అనే నెటిజన్... వీధి శునకాలకు చిన్న దెబ్బ తగిలితే స్పందించే రష్మీ ఇప్పుడు ఎందుకు మూగబోయింది? అని ట్విట్టర్ రిప్లైలో ప్రశ్నించారు. ''నన్ను విమర్శించే బదులు మీ ప్రాంతంలో ఉన్న డైరీ ఫామ్స్ దగ్గరకు వెళ్లి వాళ్ళకు మానవత్వం గురించి వివరించవచ్చు కదా'' అని రష్మీ బదులు ఇచ్చారు.
Rashmi Gautam Vs Rahul Gandhi Fan : రష్మీ గౌతమ్ సమాధానంతో సదరు నెటిజన్ సంతృప్తి చెందలేదు. మిల్క్ డైరీ ఫామ్ పెద్ద వ్యాపారం అయినప్పుడు , లాభాలు వస్తున్నప్పుడు మానవత్వం ఎలా ఉంటుందని వరప్రసాద్ మళ్ళీ ఎదురు ప్రశ్నించాడు. సెలబ్రిటీలు పాల ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నాడు. నాగబాబు చేయడం లేదా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్స్ యుద్ధంలో రష్మీకి కొంత మంది నెటిజన్లు మద్దతుగా నిలిచారు.
మధ్యలో మోడీని తీసుకొచ్చిన నెటిజన్!
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో డైరీ సెక్టార్‌లో దేశం ఉన్నత శిఖరాలు చేరుకుంటోంది, ప్రగతి పథంలో వెళుతుందని భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన ట్వీట్‌ను రష్మీ ముందు ఉంచాడు. అందుకు ఆమె 'ఆవుల సంరక్షణ సంగతి ఏంటి? ఈ విషయంలో క్లారిఫికేషన్ కావాలి'' అని భారతీయ జనతా పార్టీని ట్యాగ్ చేశారు. అంతే కాదు... ఎవరూ పాల ఉత్పత్తులు వాడకపోతే ప్రొడక్షన్ ఉండదని బదులు ఇచ్చారు. తనకు అనుకూలంగా సమాధానం చెప్పారని నెటిజన్ మళ్ళీ కవ్వించాడు. అదొక్కటే పరిష్కారమని రష్మీ తెలిపారు. ఇంకా ఇంకా అతడు ప్రశ్నలు వేస్తూ ఉండటంతో సమాధానం ఇవ్వకూడదని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
బీజేపీని రష్మీ గౌతమ్ ప్రశ్నించడంతో సరైన ప్రశ్న అయినప్పటికీ... చాలా మంది తిట్టే అవకాశం ఉందని ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అయితే, ఈసారి అలా చేయరని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు రష్మీ గౌతమ్ ''నన్ను ఎందుకు ద్వేషిస్తారు? నేను నంది, గోమాతను పూజిస్తాను. నా ఉద్దేశం ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను'' అని రిప్లై ఇచ్చారు.