జెస్సి అఖిల్ దగ్గరకి వచ్చి హాస్పిటల్ కి తీసుకువెళ్ళమని అడుగుతుంది. ఆఫీసులో పని ఉంది మీ అక్క ఉందిగా వెళ్ళు అని అంటాడు. ఎప్పుడు తనే ఖర్చు పెడుతుంది, ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావ్ కదా నీ భార్య కోసం ఖర్చుపెట్టలేవా నాకు ఏం కావాలన్నా నువ్వే ఖర్చుపెట్టాలని జెస్సి కోపంగా చెప్తుంది. దీంతో అఖిల్ సరే అని వెళ్ళిపోతాడు. జానకి డాక్టర్ తో మాట్లాడుతుంటే రామ వస్తాడు.


రామ: నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా, ఏదైనా విషయం దాచి పెట్టానా


జానకి: లేదు ఎందుకు అలా అంటున్నారు


రామ: నిజం చెప్పండి, మీరు దాస్తున్నారు నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది అది మీరు చెప్పడం లేదు


జానకి: అలాంటిది ఏమి లేదు


రామ: మీరు క్యారేజ్ మర్చిపోయి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడే అనుమానం వచ్చింది కానీ నాకు నేనే సర్దిచెప్పుకున్నా. ఏదో ఉంది అది ఈరోజు నాకు తెలియాలి


Also Read: దివ్యని చూసి ప్రేమలో పడిపోయిన విక్రమ్- పెళ్లి సంబంధం ఖాయం చేసిన లాస్య


జానకి: ఏమి దాచడం లేదని అనేసరికి రామ జానకి చేతిని తన తల మీద పెట్టుకుని ఏమి లేదని ఇప్పుడు చెప్పమని అంటాడు. చేసేదేమి లేక జానకి జ్ఞానంబ ఆరోగ్య పరిస్థితి మొత్తం చెప్తుంది. అది విని రామ షాక్ అవుతాడు. తను ఎక్కువ రోజులు బతకదని చెప్పేసరికి రామ కూలబడిపోతాడు.


రామ: అమ్మ ఇంత ప్రమాదంలో ఉంటే నా దగ్గర దాచిపెడతారా? మా అమ్మ చనిపోవడం ఏంటి తనని ఎలాగైనా కాపాడుకోవాలి, తను లేకపోతే నేను ఎలా ఉంటాను


జానకి: అత్తయ్యని కాపాడుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నా అందుకే టెస్ట్ లు చేయిస్తున్నా. మనలో ఎవరి కిడ్నీ సరిపోతుందో తెలుసుకుని అది అత్తయ్యకి ఇచ్చి కాపాడుకోవచ్చు. ఇంట్లో ఎవరికి తెలియనివ్వొద్దు అని అడుగుతుంది.


తల్లితో గడిపిన క్షణాలు తలుచుకుని రామ చాలా ఎమోషనల్ అవుతాడు. జ్ఞానంబ నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడబోతుంటే గోవిందరాజులు కంగారుగా వస్తాడు. ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు. జానకి ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోవడం లేదని రామ బాధగా ఏడుస్తాడు. రామ అలా మాట్లాడటం విని గోవిందరాజులు ఏమైంది ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావ్ మా దగ్గర ఏమైనా దాస్తున్నవా అని అడుగుతాడు. అమ్మకి జ్వరం వస్తేనే తట్టుకోలేను అలాంటిది కళ్ళు తిరిగి పడిపోతుందంటే భయంగా ఉండదా అని రామ ఏదో చెప్పి కవర్ చేస్తాడు. మీరు ఇలా బాధపడతారనే విషయం చెప్పలేదని జానకి భర్తకి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది.


Also Read: 'బ్రహ్మ' ఆట మొదలైంది- స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ కావ్యకి, మరో అమ్మాయితో రాహుల్


ఇద్దరూ కలిసి డాక్టర్ ని కలుస్తారు. జానకి కిడ్నీ జ్ఞానంబకి సరిగా సరిపోతుందని డాక్టర్ చెప్తుంది. ఆ మాట విని జానకి సంతోషపడితే రామ మాత్రం చాలా బాధపడతాడు. అత్తయ్యని కాపాడుకోవడానికి ఒంట్లో ఒక భాగం ఉపయోగపడుతుందంటే చాలా ఆనందంగా ఉందని అంటుంది. జానకి కిడ్నీ ఇవ్వడానికి రామ ఒప్పుకోడు.