Intinti Gruhalakshmi Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆ ఫైల్ లో ఏముందో చెప్పండి లేకపోతే ఆ ఫైల్ నాకు ఇవ్వండి నేనే చూసుకుంటాను అంటాడు పరంధామయ్య.


తులసి: మీకు ఏమీ అవలేదు మావయ్య.


పరంధామయ్య : ఆ ముక్క నేను ముందే చెప్పాను కానీ మీరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నాకు ఏమీ జరగలేదని నాకు తెలుసు నేను రేపటి నుంచి వాకింగ్ కూడా వెళ్తాను.


తులసి: వద్దు మామయ్య ఒక మనిషి తోడు లేకుండా మీరు ఇంటి బయటకి వెళ్ళొద్దు అంటూ రాములమ్మకి పరంధామయ్య బాధ్యత అప్పగిస్తుంది.


పరంధామయ్య: అదేంటమ్మా నేను ఏదో ఇంట్లో నుంచి పారిపోతున్నట్లు.


తులసి: అది కాదు మావయ్య మీరు కొంచెం నీరసంగా ఉన్నారు మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్లు చెప్పారు.


అనసూయ: కార్తీక పౌర్ణమి పూజ చేస్తావా ఉపవాసం ఉంటావా అని కోడల్ని అడుగుతుంది. ఉంటాను అంటుంది తులసి. నేను కూడా ఉంటాను తర్వాత భారం అంతా ఆ దేవుడిదే అని కన్నీరు పెట్టుకుంటుంది.


పరంధామయ్య : మీ ఇద్దరు కలిసి చేసుకోవడం కాదు ఒంటరిగా మీ అమ్మగారు ఉంటారు కదా ఆవిడని కూడా పూజకు పిలవండి అని తులసితో అంటాడు.


తులసి: మా అమ్మ చనిపోయి చాలా రోజులైంది మావయ్య.


పరంధామయ్య: అదేంటమ్మా మరి నాకెందుకు చెప్పలేదు, కనీసం ఆఖరి చూపు చూసి రుణం తీర్చుకునే వాడిని కదా ఇంకెప్పుడూ, ఏ విషయం నా దగ్గర దాచొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


పరంధామయ్య పరిస్థితికి కన్నీళ్లు పెట్టుకుంటారు అత్త కోడళ్ళు.


మరోవైపు రాజ్యలక్ష్మి వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి విక్రమ్ వస్తాడు.


బసవయ్య: మీ అమ్మ ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేయాలనుకుంటుంది కోడలికి గ్రాండ్ గా సీమంతం చేయాలనుకుంటుంది.


ప్రియ: అప్పుడే కాఫీలు తీసుకువచ్చి అందరికీ ఇస్తూ ఇప్పుడు అక్క పరిస్థితి ఏమీ బాగోలేదు నీరసంగా ఉంది ఇప్పుడు ఈ ఫంక్షన్ లేకపోతేనే మంచిది బావగారు.


నిర్ణయం అమ్మదైతే సలహా బావకిస్తావేంటి అంటుంది బసవయ్య కూతురు.


విక్రమ్ : తను ఏదో చెప్పాలనుకుంది చెప్పింది ఎందుకు దానిని ఇష్యూ చేస్తావు అని మరదల్ని మందలిస్తాడు. ఆపై తల్లితో మాట్లాడుతూ కొద్ది రోజులు దివ్య పుట్టింటి దగ్గర ఉంటాను అంటుంది.


విక్రం తాత : దానికి అమ్మ పర్మిషన్ ఎందుకు, పంపించు అంటాడు.


దివ్య: నాకు ఈ ఫంక్షన్ చేయటం ఇష్టం లేదు.


రాజేశ్వరి: నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు ఉంది అని మనసులో అనుకొని తను నాకు ఎదురుగా మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, పుట్టింటికి పంపించాలి అంటే మనసులో బాధగా ఉంది. దానికోసం నేను కార్తీకమాసం ఉపవాసం కూడా చేస్తాను అని బాధపడుతున్నట్లు నటిస్తుంది.


విక్రమ్: పంపించనమ్మ, నీకు ఎలా నచ్చితే అలాగే చేద్దాం.


దివ్య: నేను కూడా ఉపవాసం ఉంటాను.


రాజ్యలక్ష్మి: నువ్వు కడుపుతో ఉన్నావు, ఉపవాసం ఉండకూడదు.


ఉంటాను అని మొండిగా మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దివ్య.తనకి నచ్చినట్లే చేయనీయమ్మ అని విక్రమ్ కూడా వెళ్ళిపోతాడు 


అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత రాజ్యలక్ష్మి వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటారు.


మరోవైపు తాగి ఇంటికి వచ్చిన నందు ఏడుస్తున్న తులసి, అనసూయని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. 


తులసి వాళ్ళు ఏమి మాట్లాడరు.


నందు: ఎవరూ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నేను వెళ్లి నాన్నని అడుగుతాను.


తులసి: మేము బాధపడుతున్నదే ఆయన కోసం.


నందు: ఆయనకి ఏం జరిగింది.


తులసి: ఏం జరిగితే మీకెందుకు, మీకు కూతురు బాధ్యత అక్కర్లేదు, తండ్రికి ఏం జరుగుతుందో అక్కర్లేదు మీకు తెలిసిందల్లా తప్పు చేశాను అనే నెపంతో తాగి తూలుతున్నారు. మీ నాన్నగారి విషయం మీ అమ్మగారు మీకు చెప్పాలని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దొరగారు తాగడంలో బిజీగా ఉన్నట్లున్నారు అని నందుని కడిగిపారేస్తుంది తులసి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.