Brahmamudi Serial Today Episode 


కవి కిచెన్‌లో పని చేస్తుంటే కల్యాణ్ తన దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తాడు. ఆ మొక్క నాటింది మీరు అని నాకు తెలుసు అని చెప్తాడు. మీకు ఎలా తెలుసు అని కావ్య అడిగితే.. కావ్య వాడిపోయిన మొక్క తీసి కొత్త మొక్క నాటడం కల్యాణ్ చూసేస్తాడు. అదే చెప్తాడు కావ్యతో. 


కల్యాణ్: థ్యాంక్యూ సో మచ్ వదిన.. నిజం చెప్పాలి అంటే మీ కంటే ముందే ఆ మొక్కను నేను నాటాలి అనుకున్నాను. కానీ ఇంట్లో వాళ్లకి ఏం జరుగుతుందా అని భయం వేసింది. మరి మీకు తప్పు చేస్తున్నా అని ఏం అనిపించలేదా వదిన?
కావ్య: అనిపించింది కానీ తప్పలేదు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. అలాగే సంప్రదాయాల మీద గౌరవం ఉంది. కానీ జాతకాలు కలవలేదు అని ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడం మాత్రం పాపం అనిపించింది. జాతకాలు చూడకుండా చేసుకున్నవాళ్లు బాగుండటం లేదా.. జాతకం చూసి చేసుకున్నవాళ్లు విడిపోవడం లేదా.. భార్యభర్తలు కలిసి ఉండాలి అంటే కావాల్సింది ప్రేమ, నమ్మకం. ఆ ప్రేమ ఉన్నంత కాలం భార్యభర్తలను ఏ శక్తి విడదీయలేదని నా నమ్మకం. ఏ ప్రేమ నిజం అయితే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. 
కల్యాణ్: మీతో మాట్లాడిని తర్వాత నా మనసులో ఉన్న బాధ మొత్తం పోయింది. మా పెళ్లి దేవుడు చేస్తున్న పెళ్లికాదు. మీరు చేస్తున్న పెళ్లి. నేనైతే చాలా హ్యాపీ వదిన


ఇక కల్యాణ్, కావ్యల మాటల్ని రాజ్ వినేస్తాడు. అక్కడి నుంచి కోపంగా తన గదిలోకి వెళ్లిపోతాడు. వెనకాలే కావ్య కూడా వెళ్తుంది. 
కావ్య: గదిలోకి వస్తారు అనుకోలేదు. ఇంట్లో వాళ్లందరికీ ఈ విషయం చెప్పి రచ్చ చేస్తారు అనుకున్నా.. కానీ ఇలా మామూలుగా గదిలోకి వచ్చారేంటి అని ఆశ్చర్యంగా ఉంది.
రాజ్: అంటే నేను ప్రతీ విషయంలో గొడవ పెడుతున్నాను అనా.. ఏ విషయంలో నేను గొడవ పెట్టాను. 
కావ్య: నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా అక్క కడుపు విషయం వరకు నేనే మీకు దొరుకుతున్నాను కదా. ఇప్పటి వరకు జరిగిన ఈ తప్పులోనూ నా ప్రమేయం లేదు. కానీ మీరు అరిచారు. ఇంట్లో అందరి చేత అనిపించారు. కానీ మొదటి సారి నేను నిజంగా తప్పు చేశాను. ఇంట్లో అందరి నమ్మకాన్ని పక్కన పెట్టి కవిగారికి నేను సపోర్ట్ చేశాను. అలాంటప్పుడు మీ అలవాటు ప్రాకారం చేసిన తప్పునకు శిక్ష వేయాలి కదా
రాజ్: నిన్ను నువ్వు సమర్థించుకున్నంత మాత్రానా.. గతంలో నువ్వు చేసిన తప్పులు ఒప్పు అయిపోవు. అలాఅని ఇప్పుడు నువ్వు చేసినది తప్పు అనిపిస్తే అలానే గొడవ చేసేదాన్ని నువ్వు చేసిన పనివల్ల మా తమ్ముడి ప్రేమ గెలుస్తుంది. వాడు కోరుకున్న అమ్మాయితో వాడి పెళ్లి జరుగుతుంది
కావ్య: ఇదే పని మా అక్క విషయంలో చేస్తే తప్పు అన్నారు. 
రాజ్: అక్కడ నువ్వు మోసం చేశావు. ఇక్కడ న్యాయం చేశావు
కావ్య: మీ తమ్ముడి విషయానికి వచ్చే సరికి న్యాయం అయిపోయిందా
రాజ్: కాదు మీ అక్క నాతో పెళ్లికి సిద్ధపడి రాహుల్‌తో వెళ్లిపోయింది. కానీ నా తమ్ముడు అనామికను ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నిజమైన ప్రేమను విడదీసే అంత అర్థం చేసుకోలేనంత మూర్ఖుడిని కాదు.
కావ్య: మనసులో.. అందరి ప్రేమను అర్థం చేసుకున్నారు ఒక్క నా ప్రేమ తప్ప. నాకు ఇష్టం లేకపోయినా మీరు అడిగారు అని అందరి ముందు నటిస్తున్నాను. అది మీతో కలిసి ఉండటానికి అది మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. 


మరోవైపు ఆ మొక్క చనిపోయి ఉంటుందని కనకం ఆలోచిస్తుంటుంది. ఇక కనకం పడుకోకుండా ఉంటే చంపేస్తుంది అనుకొని ఎలా అయినా పడుకోబెట్టాలి అని రుద్రాణి కనకానికి మందు తాగమని ఇస్తుంది. కనకం బాటిల్ మొత్తం తాగేస్తుంది. ఇక కనకం మైకంలో చంద్రముఖిలా మారి చంపేస్తా అంటూ రుద్రాణి మెడ పట్టుకుంటుంది. ఇక కనకం నుంచి తప్పించుకునేందుకు రుద్రాణి బాత్ రూమ్‌లో దూరిపోతుంది. మరోవైపు కనకం పడుకొనిపోతుంది. 


కావ్య కృష్ణుడి దగ్గరకు వెళ్లి తన మనసులో మాటలు చెప్పుకుంటుంది. తాను తప్పు చేయలేదు అని చెప్పుకుంటుంది. ఇక ఈ విషయం వల్ల తన కాపురంలో చిచ్చు పెట్టొద్దు అంటూ కృష్ణుడిని కోరుకుంటుంది. మరోవైపు రాత్రి పూట శ్వేత రాజ్‌కు కాల్ చేస్తుంది. ఈ టైంలో కాల్ ఎందుకు చేశావని రాజ్ కంగారు పడతాడు. నైట్ టైం కాల్ చేయొద్దు అని మెసేజ్ చేస్తే చూసి తాను ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తానని చెప్తాడు. ఇక మళ్లీ కాల్ చేస్తానని చెప్పే సరికి కావ్య వచ్చేస్తుంది. దీంతో రాజ్ తెగ కంగారు పడతాడు. ఇక శ్వేత రేపు రాజ్‌ని తమ ఫేవరేట్ ప్లేస్‌లో కలుద్దామని చెప్తుంది. సరే అని రాజ్ చెప్తాడు. 
 
కావ్య: మీరు చేసే పని నాకు నచ్చలేదు. మీరు కూడా ఇలా చేస్తారని నేను అనుకోలేదు. నేను ఏమైనా మీ కంపెనీ సీక్రెట్స్ పక్క కంపెనీకి అమ్మేస్తా అనుకున్నారా.. నా ముందు అంత సీక్రెట్‌గా మాట్లాడుతున్నారు. అంత అవసరం ఏముంది. నా మీద ఆ నమ్మకం కూడా లేదా అని అడుగుతుంది. ఇక రాజ్ ఎవో చెప్పి కవర్ చేస్తుంది


ఇక కల్యాణ్ అనామికతో మాట్లాడుతుంటే కనకం వెనక నుంచి వచ్చి వినడానికి ప్రయత్నిస్తుంది. దీంతో కల్యాణ్ అనామిక వాళ్లు మొదటి శుభలేక ఇవ్వడానికి ఇంటికి వస్తున్నారు అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.