Samantha on MTV Hustle 3: ప్రముఖ రియాలిటీ షో ‘ఎంటీవీ హజిల్’ కొత్త సీజన్ ఇప్పుడు జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలో ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో నటి సమంత కనిపించారు. హైదరాబాదీ ర్యాపర్ కేడెన్ శర్మ ర్యాప్‌ను సమంత ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
దీనికి సంబంధించిన ప్రోమోను ఎంటీవీ హజిల్ సోషల్ మీడియా పేజీలో షేర్ చేశారు. ఈ ప్రోమోలో సమంత మాట్లాడుతూ... ‘హిప్‌హాప్‌ను ప్రమోట్ చేసే ఏకైక భారతీయ కార్యక్రమం ఇదే.’ అని కూడా అన్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బాద్‌షా వ్యవహరించారు. బాద్‌షా, సమంత ఇద్దరూ కంటెస్టెంట్స్‌ని ఎంకరేజ్ చేయడం కూడా ప్రోమోలో చూడవచ్చు. సమంత స్టేజ్ మీదకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో జాబ్ కూడా చేశారు.
సమంతకు సోషల్ మీడియా మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘నేను చూసిన అత్యంత అందమైన నవ్వు ఇదే.’ అని ఒక ఫ్యాన్ కామెంట్ చేశాడు. ‘హిప్‌హాప్‌ను సపోర్ట్ చేయడం ద్వారా సమంత కొత్త ట్రెండ్‌కు దారి తీసింది. నీ డ్యాన్స్ కూడా బాగుంది.’ అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.
ఇటీవలే ‘సెలబ్రిటీ స్ట్రీట్’ ఆడిషన్ ర్యాప్‌తో మంచి పేరు తెచ్చుకున్న కేడెన్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘చరిత్ర సృష్టించాం.’ అని దానికి క్యాప్షన్‌గా పెట్టారు. బాద్‌షా కూడా సమంతతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే... సమంత ఇటీవలే ‘ఖుషి’లో నటించారు. ఇందులో ఆమె విజయ్ దేవరకొండకు జోడిగా కనిపించారు. సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో కూడా నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.