Guppedantha Manasu Telugu Serial Today Episode:


ముకుల్ శైలేంద్రతో: ఆ వాయిస్ మీదేనా.. చెప్పండి సార్ మీదా కాదా.. శైలేంద్ర గారు మిమల్నే అడుగుతుంది. మీదా కాదా..చెప్పండి అని అడుగుతాడు. దీంతో దొరికిపోయాను అనుకున్న శైలేంద్ర తనదే అని చెప్తాడు. అప్పుడు శైలేంద్రను తన తండ్రి చెడపుట్టావ్‌రా అంటూ తిట్టి కొడతాడు. మహేంద్ర, దేవయాని అడ్డుకున్నా వదలడు. గట్టిగా కొడతాడు. 


ఫణేంద్ర: ఓరేయ్ దుర్మార్గుడా తల్లి లాంటి జగతిని ఎలా పొట్టనపెట్టుకున్నావ్‌రా.. నిన్ను.. ఛీ
ముకుల్: నేరం ఒప్పుకున్నారు కదా స్టేషన్‌కు వస్తారా.. లేదంటే తీసుకెళ్లమంటారా
శైలేంద్ర: వస్తాను సార్.. కానీ ఒక్క నిమిషం.. అమ్మా ఫోన్ ఛార్జింగ్‌లో ఉంది తీసుకొస్తావా.. 
ఫణేంద్ర: అరేయ్ ఇప్పుడు ఫోన్ ఏంటి.. నిన్ను
దేవయాని: ఉండండి ఏదో చెప్తున్నాడు కదా.. అంటూ ఫోన్ తీసుకొస్తుంది.
శైలేంద్ర: ఒక్క నిమిషం సార్. డిశ్చార్జి అయ్యే ముందు నాకు ఫోన్ వచ్చింది. నా ఫోన్‌లో ఆటోమెటిక్ కాల్ రికార్డ్ అయింది. ఒకసారి వినండి సార్.. 


కాల్ రికార్డ్
"హలో శైలేంద్ర గారు జగతి కేసులో మీరు ఇప్పుడు ప్రధాన నిందితుడు. మీరే జగతి మేడంను చంపమని చెప్పినట్లుగా వాయిస్ రికార్డ్ ఉంది.. ఏంటి సార్ మీరు అనేది.. అవును కానీ నేను నిన్ను తప్పిస్తాను నాకేం ఇస్తావు. నిన్ను తప్పిస్తే 50 లక్షలు నాకు ఇవ్వాలి. అసలు నేను ఎందుకు ఇవ్వాలి సార్ 50 లక్షలు. మాటలు వద్దు శైలేంద్రగారు మీరు ఓకే అనుకుంటే నేను పంపించిన అకౌంట్‌కి డబ్బులు పంపించండి. మీరు నిర్దోషి అని నిరూపిస్తాను. నిర్దోషి అని నిరూపించడం ఏంటి సార్ నేను ఏ తప్పూ చేయలేదు. నువ్వు తప్పు చేసినా చేయకపోయినా మా దగ్గర సాక్ష్యం ఉంది. అది చూపిస్తే నీకు శిక్ష పడటం ఖాయం. కాబట్టి డబ్బు రెడీ చేసుకో"


ముకుల్: నో సార్ ఆ వాయిస్ నాది కాదు
శైలేంద్ర: ఏంటి సార్ అచ్చం మీ వాయిస్ లానే ఉంది కదా
ముకుల్: లేదు అది ఎవరో క్రియేట్ చేయించారు. నేను మాట్లాడింది కాదు. 
శైలేంద్ర: సార్ మీరు మాట్లాడినట్లే ఉంది కదా సార్. 50 లక్షలు కూడా అడిగారు కదా
ముకుల్: అదంతా ఫ్రాడ్.. నా సర్వీస్‌లో నేను ఎప్పుడూ ఇంత వరకు లంచం తీసుకోలేదు. తీసుకోను కూడా. ఎవరో కావాలని చేశారు. ఆ వాయిస్ మాత్రం నాది కాదు
శైలేంద్ర: అదేంటి సార్ మీరు వినిపించింది నా వాయిస్ అయినప్పుడు నేను వినిపించింది మీ వాయిస్ కాదా.. 
ముకుల్: సార్ నేను అసలు మీకు ఫోన్ చేయలేదు
శైలేంద్ర: సార్ నేను కూడా ఆ షూటర్‌కి కాల్ చేయలేదు. వాడు ఎవడో నాకు తెలీదు. అలాంటి వాడికి నేను ఎందుకు ఫోన్ చేస్తాను సార్. డీప్ ఫేక్ వీడియోలు ద్వారా లేని మనిషిని ఉన్నట్లు చేస్తున్నారు సార్. అలాంటిది ఒక వాయిస్ క్రీయేట్ చేయడం కష్టమా చెప్పండి. మీరు అంత పెద్ద ఆఫీసర్ ఎన్నో మంచి పనులు చేసుంటారు. ఇప్పుడున్న ఏఐ ద్వారా ఎన్నో క్రియేట్ చేయొచ్చు. దీంతో మంచి ఎంతో చెడు కూడా అంతే ఈ విషయం నేను మీకు చెప్పనక్కర్లేదు. ఏదో ఒక వాయిస్ పట్టుకొని వచ్చి పేషెంట్ అని కూడా చూడకుండా అనుమానిస్తున్నారు మీకు ఇది న్యాయమా. మా పిన్ని హత్య కేసులో నన్ను నిందితుడిని చేయాలి అనుకున్నారు నేను ఎంత బాధ పడతాను సార్. 
అనుపమ: తను నీ మీద వ్యక్తిగత కోపంతో అడగడం లేదు కదా శైలేంద్ర ఇన్వెస్టిగేషన్‌లో భాగంగానే అడిగారు కదా 
శైలేంద్ర: అడగడంలో లేదు తప్పు లేదు మేడం కానీ ఆయన అలా అడగగానే మా నాన్నే నన్ను అనుమానించారు. నేను తల్లిగా భావించే మా పిన్ని చావుకు నేనే కారణం అనుకొని నా మీద చేయి కూడా చేసుకున్నారు. అప్పుడే నా గుండె ముక్కలైపోయింది. ఏంటి మమ్మీ నా కొడుకు అలాంటి వాడు కాదు అని నువ్వు గట్టిగా చెప్పలేకపోయావా.. అసలు మా పిన్ని హత్య కేసులో మీరంతా నన్ను ఎప్పుడైతే అనుమానించారో అప్పుడే మీరు నన్ను చంపేసినట్లే. అసలు ఆ ఫోన్ నెంబరు, ఆ సిమ్ ఎవరి పేరుమీద ఉన్నదని మీరు కనుక్కున్నారా.. ముందు మీరు అది కనిపెట్టాలి సార్.


ఇక అన్‌ నౌన్ నెంబరు నుంచి రిషి చేసినట్లు ఫోన్ రికార్డ్ వినిపిస్తాడు శైలేంద్ర


"అన్నయ్య ఇక నీ చాప్టర్ క్లోజ్ అయినట్లే అన్నయ్య. నీ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఏంటి రిషి ఏం మాట్లాడుతున్నావ్. అవును అన్నయ్య వసుధారని ఎండీ సీటులో కూర్చొబెట్టాలి అన్నప్పుడు అమ్మ అడ్డుగా కనిపించింది. వెంటనే తన అడ్డు తొలగించి వసుధారని అందులో కూర్చొబెట్టాను. రేయ్ ఏం మాట్లాడుతున్నావ్.. కానీ భవిష్యత్‌లో ఎప్పుడైనా నీ నుంచి కూడా అడ్డు రావొచ్చు. అందుకే నీ అడ్డు కూడా తొలగించడానికి నీ మీద ఎటాక్ చేయించాను. మిస్ అయిపోయింది. త్వరలోనే నిన్ను కూడా అంతం చేస్తా"


మహేంద్ర: రేయ్.. శైలేంద్ర తప్పు చేస్తున్నావ్.. అది రిషి మాట్లాడిని వాయిస్ కాదు. రిషి అలాంటి వాడు కాదు. 
శైలేంద్ర: నాకు తెలుసు బాబాయ్ రిషి అలాంటి వాడు కాదని. నా తమ్ముడి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు కదా. ఎప్పుడైతే పిన్ని అడ్డు తొలగించాను అని చెప్పాడో అప్పుడే నేను నమ్మలేదు. ఇదంతా ఎవరో మన ఫ్యామిలీ మీద పగతో చేస్తున్నారు అని నాకు అర్థమైంది. కానీ మీరంతా నా వాయిస్ విని నా మీద నింద పెట్టారు. సొంత కొడుకు అయితే ఒక లెక్క. అన్న కొడుకు అయితే ఒక లెక్కా.. బాబాయ్. చెప్పు. నేను మిమల్ని ఎప్పుడూ మా నాన్న తర్వాత నాన్న లానే చూశాను. కానీ మీరు మాత్రం నన్ను పరాయివాడిలా శత్రువులా చూశారు. నాకు అర్థమవుతుంది. అయిన వాళ్లే అనుమానిస్తున్నారు
అనుపమ: మనసులో.. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు
శైలేంద్ర: ముకుల్ గారు అసలు ముందు రిషి కనిపించకుండా చాలా రోజులు అవుతుంది కదా అది ఆలోచించండి. ఆ పని మీద ఉండండి. నా తమ్ముడు నాకు కావాలి ముకుల్ గారు.. తను ఇంతకు ముందు కూడా ఇంటిని విడిచి వెళ్లి పోయాడు. మళ్లీ ఇప్పుడు అలా పోతే నేను తట్టుకోలేను. అసలు తను ఎక్కడున్నాడో.. అసలు బతికే ఉన్నాడో లేడో
వసుధార: ఆపుతారా.. ఏం మాట్లాడుతున్నారు మీరు.. బతికున్నాడా లేడా ఏంటి బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా. తనకి ఏమైనా అయితే నేను ఎవర్నీ వదిలిపెట్టను జాగ్రత్త
శైలేంద్ర: నేనేం అన్నాను వసుధార. నాకు వార్నింగ్ ఇచ్చిన వాళ్లు మన ఫ్యామిలీలో ఎవర్నీ వదిలి పెట్టను అన్నారు అందుకే అలా అంటున్నాను. ఏం ధరణి ఆరోజు రౌడీలు అదే కదా వార్నింగ్ ఇచ్చింది
ధరణి: అవును అలానే అన్నారు
శైలేంద్ర: అవును వసుధార. రిషి ఏ పని అయినా నీకు చెప్పే చేస్తాడు కదా. ఎక్కడికి వెళ్లినా నీకు చెప్పే వెళ్తాడు కదా. తను ఏం చేసినా నీకు తెలుస్తుంది. ఎప్పుడూ నీడలా ఉండే నువ్వు ఎందుకు రిషిని వదిలిపెట్టావ్.
వసు: అంటే ఏంటి మీ ఉద్దేశం
శైలేంద్ర: ఏం లేదు వసుధార. ఆ కోణంలో ఆలోచించి వాళ్లు ఎవరో కనిపెట్టమని చెప్తున్నా
ముకుల్: కనిపెడతాను. అసలు దీనంతటికి కారణం ఏంటో, ఎవరో కనిపెడతాను. దీన్ని అంత ఈజీగా వదలను. దీన్ని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది. కచ్చితంగా పట్టుకుంటాను. అలాగే మీకు ఆ ఫోన్ కాల్స్ వచ్చాయో అవి కూడా కనిపెడతాను. 


మహేంద్ర, వసుధార


శైలేంద్ర ఇంత మాయగాడు అని వాడు ఇంతలా చేస్తాడని ఇప్పుడే అర్థమైందమ్మా. అవును మామయ్య ఈ రోజుతో నిజాలు తెలుస్తాయి. వాడి చాప్టర్ క్లోజ్ అనుకున్నా కానీ చాలా తెలివిగా తన క్రిమినల్ మైండ్‌తో ముందే ప్రిపేర్ అయి చాలా జాగ్రత్త పడ్డాడు. తాను ఇలా తెలివిగా మాట్లాడుతుంటే జగతి మేడం చావుకు తానే కారణం అని ఎలా రుజువు చేయగలం మామయ్య. అసలు రిషి సార్ ఎక్కడికి వెళ్లుంటారు. సార్ మన ఇద్దరిలో ఒకరికి కచ్చితంగా చెప్పి వెళ్తారు. ఇలా జరగడం ఏంటి మామయ్య. నాకు భయంగా ఉంది. శైలేంద్ర వాడి మీద ఎటాక్ వాడే చేయించుంటాడు అని నాకు అనిపిస్తోంది అమ్మా. అమ్మా వసుధార నాకు తెలిసి రిషికి శైలేంద్ర మీద ఏదో ఒక అనుమానం కలిగి ఉంటుంది. ముందు మనం రిషిని వెతకాలి తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అమ్మా. వెళ్దాం పద


మరోవైపు దేవయాని, శైలేంద్ర మాట్లాడుకుంటారు. తన తల్లే తనకు గురువు అని నేరాలు చేయడం వాటి నుంచి బయటపడటం నీ దగ్గర నుంచి నేర్చుకున్నా అని శైలేంద్ర అంటాడు. ఇక దేవయాని శైలేంద్రని చాలా పొగిడేస్తుంది. ఇంతలో ధరణి డోర్ కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.