Illu Illalu Pillalu Serial Today Episode విశ్వ రామరాజు కుటుంబం మీద రెట్టింపు బదులు తీర్చుకుంటా.. నా చెల్లిని తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు నిద్రపోను.. రామరాజు సంగతి నాకు వదిలేయ్ అని తండ్రి సేనకు భరోసా ఇస్తాడు. భద్రావతి తమ్ముడితో విశ్వ ఈ ఇంటికే వారసుడు కాదు.. ఆ ఇంటి మీద పగకి ప్రతీకారానికి కూడా వారసుడు. భవిష్యత్‌తో రామరాజు కుటుంబానికి ప్రతి రోజు కాలరాత్రి అయ్యేలా.. రామరాజు గుండె పగిలి చచ్చేలా చేస్తాడు. మన పగని వీడికి వదిలేయ్‌రా అని అంటుంది.
ప్రేమ ఆరుబయట కూర్చొని సంతోషంగా ఆలోచిస్తూ ఉంటే ఫీల్ మై లవ్ అని గులాబి పట్టుకొని నర్మద వస్తుంది. ఈ రోజ్ ఏంటి అక్క అని ప్రేమ అడిగితే ఇది నీకు ఇచ్చే ముందు నాకు నీ మీద కోపం ఉంది అది తీర్చుకుంటా అని అంటుంది. నేను నీతో చాలా సార్లు చెప్పా కష్టం, సుఖం ఏమైనా నేను నీకు అండగా ఉంటా.. మనం ఒకరితో ఒకరు మన విషయాలు పంచుకోవాలి అని చెప్పాను కానీ నువ్వు కల్యాణ్ గాడి విషయం నాకు ఎందుకు చెప్పలేదు.. అని అడుగుతుంది. నా డ్యాన్స్ క్లాస్ విషయంలో నీకు బావకి ఇబ్బంది అయింది అందుకే మరోసారి అలా అవ్వకూడదు అని చెప్పలేదు సారీ అక్క. నాకు నీ మీద చాలా కోపం వచ్చింది కానీ ధైర్యం కూడా వచ్చేసింది.. ఆ ధైర్యం పేరే ధీరజ్ అని అంటుంది. ప్రేమ చాలా బ్లష్ అవుతుంది.
కల్యాణ్ గురించి మామయ్యకి ఎలా చెప్పాలి.. అని నేను అత్తయ్య చాలా భయపడ్డాం కానీ ధీరజ్ మా భయాన్ని పటాపంచలు చేసేశాడు. నువ్వు ధీరజ్ ఎప్పుడు కలిసి ఉంటారా అని చాలా టెన్షన్ ఉండేది కానీ ధీరజ్ నీకు మనసు ఇచ్చేశాడు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ఇక నీ కోసం నేను అత్తయ్య కంగారు పడాల్సిన పని లేదు.. నీకు ఇప్పటికే ధీరజ్ మీద ప్రేమ ఉంది.. ధీరజ్‌కి కూడా నీ మీద ప్రేమ మొదలైంది.. ఈ గులాబీ తీసుకో మీ ప్రేమ ఇంకా బలపడాలి.. ప్రేమని వదలొద్దు.. మీ చేతుల్ని విడిచిపెట్టకండి అని చెప్తుంది. ప్రేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది.
నర్మద వెళ్తూ వెళ్తూ ఫొటోలో విషయం ఎదురింటి వాళ్లకి ఎలా తెలిసింది అని ఆలోచిస్తుంది. ఇదంతా వల్లీ పని అని వల్లీ అనుకుంటూ శ్రీవల్లి దగ్గరకు నర్మద వెళ్తుంది. వల్లి గొడవ జరగలేదని డిసస్పాయింట్‌గా ఉంటే వల్లితో ఏంటి ప్రేమ, ధీరజ్‌ల మధ్య గొడవ జరగలేదు.. ప్రేమ ఏడ్వటం లేదు అని ఫీలవుతున్నావా అని నర్మద అడగగానే ఊ అంటూ వల్లీ అంటుంది. నర్మద కోపంగా చూస్తుంది. మన ఇంట్లో అంటించిన అగ్గిపుల్లలు సరిపోవా ఎదురింటి వాళ్లకి అంటిస్తున్నావా అని అడుగుతుంది. నేనేం చేయలేదు అంటే నటించకు నువ్వే చెప్పావ్ అని నాకు తెలుసు అని నర్మద అంటుంది. నువ్వు చెప్పకపోతే క్షణాల్లో మన ఇంట్లో విషయం వాళ్లకి ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. ప్రామిస్ నర్మద నాకు తెలీదు.. అయినా అనుమానించడానికి అనడానికి చిన్న ఆదాయం ఉందా అని అడుగుతుంది. ఇప్పుడు నాకు అనుమానం మాత్రమే ఉంది.. అనుమానం నిజం అవ్వాలి అప్పుడు నీకు మామూలుగా ఉండదు.. నువ్వు ఆ ఎదురింటి వాళ్లతో మాట్లాడినట్లు చూశావే అనుకో నీకు మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది నర్మద.
వల్లీ ఈ గవర్నమెంట్ మామూలుగా కనిపెట్టలేదు కదా.. ఇది సరే కానీ విశ్వకి అమూల్యకి మధ్య రాయభారం చేసేది నేనే అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని వల్లీ తల పట్టుకుంటుంది. ప్రేమ బెడ్ షీట్లు పిండుతుంది. ధీరజ్ రావడంతో సాయం చేయమని అడుగుతుంది. ధీమ అంటే ఏంటే అని ధీరజ్ అడిగితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు అప్పుడు చెప్తా అని ప్రేమ అంటే నేను చెప్పలేను అని ధీరజ్ అంటాడు. అయితే నేను చెప్పలేను అని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ బట్టలు పిండటంతో ప్రేమకి సాయం చేస్తాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ సాంగ్ బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుంది.
వల్లీ రాయభారం మొదలవుతుంది. అమూల్య కాలేజ్‌కి వెళ్తుంటే కాఫీ ఇస్తుంది. వల్లీ ఆమూల్యతో మాట్లాడుతూ ఉంటే విశ్వ చూసి వల్లికి విష్ చేసి తన గురించి మాట్లాడమని అంటాడు. వల్లీ అమూల్యతో నీకు ఏమైనా లవ్‌స్టోరీలు ఉన్నాయా అని అడుగుతుంది. అమూల్య కోపంగా చూసి నేను రామరాజు కూతుర్ని వదిన కలలో కూడా అలాంటి పనులు చేయను అని అంటుంది. మీ బావ ఈ మధ్య నిన్ను తెగ చూసేస్తున్నాడు అని విశ్వని చూపిస్తుంది. ఆ బండోడికి కోతి కరిచినట్లుందని చెప్పి అమూల్య వెళ్లిపోతుంటే వల్లి వెంటపడి తనని చూస్తే నీకు ఏమనిపిస్తుందని అడుగుతుంది. దున్నపోతుని ఇంటిలో కట్టేసినట్లుందని అంటుంది. చూడు అమూల్య మనిషిలాగే మనసు కూడా విశాలంగా ఉందని అనిపిస్తుంది చూడు అని అంటుంది. అమూల్య పెద్దగా నవ్వుతూ ఎదురుగా నిల్చొన్న ప్రేమతో వదినా విన్నావా ఏం అంటుందో అని అంటుంది. వల్లి ప్రేమని చూసి షాక్ అయిపోతుంది. వల్లి వదినకు మీ అన్నయ్య మంచోడు, విశాల హృదయం ఉన్నోడిలా కనిపిస్తున్నాడంట అని చెప్తుంది. ప్రేమ తన అన్నయ్యని వల్లిని సీరియస్‌గా చూస్తుంది. ఇంకేం చెప్పింది అని అడుగుతుంది. చెప్పలేదు అడిగింది అని లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడిగిందని అంటుంది. ఇరికించేసిందిరా అని వల్లీ అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.