గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 26 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 26 Episode)
హాస్పిటల్ నుంచి డిశ్శార్జ్ అయిన తన తల్లి, కొడుకు చింటూ ఎక్కడికి వెళ్లారో ఏంటో ఫోన్ కూడా కలవడం లేదని కంగారుపడుతుంది రోహిణి. ఇంతలో వాళ్లని తీసుకుని ఇంటికి వస్తారు మీనా-బాలు. వాళ్లని చూసి రచ్చ చేసిన ప్రభావతి.. సత్యం వార్నింగ్ ఇవ్వడంతో ఆగిపోతుంది. ఆ తర్వాత... అందరూ భోజనానికి వెళ్లిరండి..నేను బాబుని చూసుకుంటాను అంటుంది రోహిణి. ఆమె ప్రవర్తన చూసి బాలు ఆశ్చర్యపోతాడు..పార్లలమ్మలో ఇంత దయాగుణం ఎప్పటినుంచి మొదలైంది అనుకుంటాడు. రవిశ్రుతి కూడా షాక్ అవుతారు. రూమ్ ఇవ్వను గాక ఇవ్వను అన్న రోహిణి.. కావాలంటే వాళ్లకి మా బెడ్ రూమ్ ఇస్తాం అంటుంది. ఏంటీ..మాట్లాడుతున్నది రోహిణియేనా అని అంతా అవాక్కవుతారు.
రూమ్ లో బెడ్ పై రెస్ట్ తీసుకుంటున్న చింటూని చూసి రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీకు తల్లిగా ఏమీ చేయలేకపోయాను, అన్యాయం చేశాను, ఆరోగ్యం బాలేకపోతే దగ్గరుండి చూసుకోలేకపోతున్నా అని బాధపడుతుంది. ఇంతలో అక్కడకు వస్తుంది ప్రభావతి. ఇక నోటికి పని చెప్పడం ప్రారంభిస్తుంది. వీడి అమ్మ ఎక్కడుందో? అసలు ఉందో? ఎవడితోనో లేచిపోయిందో అని మాట్లాడుతుంది. కూతురు చేసిన మోసాన్ని మోసుకుంటూ ఆ తల్లి తిరుగుతోంది? ఈ దరిద్రమూక మనింట్లో ఉండడానికి వీల్లేదు..వీళ్లను ఎలాగైనా తరిమేయాలి అంటుంది. మీనా పూలకొట్టు పీకించేసేందుకు నువ్వే కదా మున్సిపాలిటీ ఐడియా ఇచ్చావ్..ఇప్పుడు వీళ్లను తరిమేసేందుకు కూడా నువ్వే ఐడియా ఇవ్వు అంటుంది. నేనా అని అడుగుతుంది రోహిణి. నువ్వే అని గట్టిగానే చెబుతుంది ప్రభావతి. తప్పనిపరిస్థితుల్లో సరే అంటుంది రోహిణి.
రోజూ రూమ్ గురించి పెద్ద రచ్చ చేసే రోహణి..తన తల్లి, కొడుకు ఉండడంతో రూమ్ గురించే మాట్లాడదు. మనోజ్ ని కూడా రూమ్ గురించి మాట్లాడనివ్వదు..బాలు పెద్ద గోల చేస్తాడు, మీనాకు ఆరోగ్యం బాలేదుకదా వదిలెయ్ మనం సర్దుకుపోదాం అని చెబుతుంది. సరే అంటాడు మనోజ్. ఆ తర్వాత ఎవరికి వారు నిద్రపోతారు. నిద్ర మధ్యలో మెలుకువవచ్చిన చింటూ నిద్రలేచి అమ్మా అంటూ వెతుక్కుంటూ వస్తాడు. మెట్లు దిగి కిందకు వచ్చి..అమ్మా అమ్మా అని పిలుస్తాడు. హాల్లో కింద పడుకున్న రోహిణి ఠక్కున లేచి కూర్చుంటుంది. మా అమ్మవు నువ్వేకదా అని చింటూ అనగానే అవును నేనే బాబూ అని కన్నీళ్లతో చింటూని హగ్ చేసుకుంటుంది రోహిణి. అమ్మా అని చింటూ పిలవడం రోహిణి స్పందించడం చూసి మనోజ్ షాక్ అవుతాడు. వాడికి నువ్వు అమ్మవా అని నిలదీస్తాడు.. అప్పుడే హాల్లోకి వచ్చిన ప్రభావతి మీనా, బాలు కూడా షాక్ అవుతారు. ఎంత మోసం చేశావ్ పార్లలమ్మ వాడి తల్లివి నువ్వా అని అడుగుతారు. రోహిణి ఏమీ మాట్లాడలేకపోతుంది. నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంది రోహిణి... ఇదంతా రోహిణి కల
వెంటనే లేచి వెళ్లి చింటూని చూసేందుకు వెళుతుంది. నిన్ను కన్నాను కానీ తల్లిగా చూసుకోలేకపోయాను అని బాధపడుతుంది. అమ్మా అని నిద్రలేచిన చింటూ పిలుస్తూనే ఉంటాడు. మీనా బుజ్జగించి పడుకోబెడుతుంది. కనీసం మీనా ఉన్న స్థానంలోనూ నేను లేను అనుకుంటుంది.
తెల్లారేసరికి తన ఫ్రెండ్ కి కాల్ చేసి జరిగినదంతా చెబుతుంది రోహిణి. పిడుగుమీద పిడుగు పడిందేంటని అంటుంది..బాలు మీనా చేసిన పనికి నేను దొరికిపోయాను అంటుంది. చింటూ నీతో మాట్లాడాడా అని అడిగితే.. చింటూ కళ్లకు కట్టు కట్టారు కదా నన్ను చూడలేదు అంటుంది. నీ గొంతు విన్నాకానీ సమస్య అవుతుందని హెచ్చరిస్తుంది ఫ్రెండ్. వాళ్లని ఎలాగైనా బయటకు పంపించేయాలి అనుకుంటుంది రోహిణి. కొద్దిరోజులుగా మా నాన్న గురించి అత్తయ్య అడగడం లేదు ఇలాంటి టైమ్ లో ఆవిడకు డౌట్ వస్తే నా పరిస్థితి మరోలా ఉంటుంది అంటుంది. మీనాను బయటకు పంపించి..ఆమె వచ్చేలోగా మా అమ్మా, చింటూని పంపించేయాలి అనుకుంటుంది.
చింటూకి మీనా టిఫిన్ తినిపిస్తుంది . చూసి రోహిణి బాధపడుతుంది. ఈ రోజు ఎక్కడికీ వెళ్లవా అని అడుగుతుంది. పూలు మా అమ్మను ఇమ్మన్నా..చింటూకోసం ఇంట్లోనే ఉంటాను అంటుంది. రోహిణి తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మీనాను బయటకు పంపించేందుకు తన ఫ్రెండ్ విద్యతో కాల్ చేయిస్తుంది. మా అపార్ట్ మెంట్ లో పూలు కట్టే గేమ్ ఉంది. అందుకే నా పేరు ఇచ్చాను..నువ్వు నాకు నేర్పించు అంటుంది. అన్నీ ఫోన్లో చూసుకుని నేర్చుకుంటున్నారు అంటుంది మీనా. నువ్వు రా అని అంటే.. నేను రాను మీ అత్తయ్య ఒప్పుకోదు అంటుంది విద్య. నాకు కావాల్సిన వాళ్లు ఇంటికి వచ్చారు నేను రావడం బావోదు అంటుంది. ఎక్కువ టైమ్ లేదు ఈ రోజు సాయంత్రమే పోటీ అంటుంది విద్య. వస్తానులే అంటుంది మీనా.
నాకు పని ఉంది బయటకు వెళుతున్నా.. రోహిణి ఫ్రెండ్ విద్య కాల్ చేసింది పూల కట్టడం నేర్పించమని అడిగింది అంటుంది. పూలుకట్టే పోటీలా అని సందేహిస్తాడు బాలు. నేను వెళతాను అంటుంది మీనా. నాకు ఏదో తేడా కొడుతోంది.. ఎప్పుడూ నీతో టచ్ లో లేని అమ్మాయి సంబంధం లేని పని నేర్పించమని అంటోందంటే ఆలోచించాల్సిందే అంటాడు బాలు. అయినా మీనా వెళుతుంది.