Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ విరూపాక్షిని తనలో పాటు కారులో అసెంబ్లీకి తీసుకెళ్తాడు. రాజు, రూప, చంద్ర, సుమలు చాలా సంతోషపడతారు. విజయాంబిక కుళ్లుకుంటుంది. ఫొటో పగిలితే ఏం అనలేదు.. ఇప్పుడు కారులో తీసుకెళ్తున్నాడు నా తమ్ముడితో మార్పు వస్తుందా అని విజయాంబిక అనుకుంటుంది. 

కారులో విరూపాక్షి వెనక సీట్‌లో కూర్చొని ముందు ఉన్న సూర్యప్రతాప్‌ని అద్దంలో చూసి నవ్వుతూ ఉంటుంది. సూర్యప్రతాప్‌ చూస్తాడు. గతం గుర్తు చేసుకుంటాడు. విరూపాక్షి కన్ను ఆర్పకుండా చూస్తుంటుంది. మరోవైపు అశోక్‌ సూర్యప్రతాప్‌ ఇంటికి పోస్ట్‌ మెన్‌లా గెటప్ వేసుకొని మాస్క్ పెట్టుకొని రూపకి పోస్ట్ వచ్చిందని చెప్పి వాచ్‌మెన్‌కి ఇస్తాడు. వాచెమెన్ అది తీసుకెళ్లి చంద్రకి ఇచ్చి రూప మేడంకి పోస్ట్ వచ్చిందని చెప్తాడు. నేను ఇస్తానని చంద్ర తీసుకుంటాడు. రాజు, రూపలు మేడ మీద నుంచి చూసి నాకు లెటర్ రాసే వారు ఎవరు ఉంటారు రాజు అని రూప అంటుంది. ఆ లెటర్ మీకు కాదు అమ్మాయిగారు కోమలికి అని రాజు అంటాడు. 

చంద్ర కోమలి దగ్గరకు వెళ్లి రూప నీకు లెటర్ వచ్చిందని చెప్పి ఇస్తాడు. రాజు, రూపలు చాటుగా చూస్తారు. ఆ లెటర్‌తో అశోక్ కోమలి గురించి రాసుంటాడు. ప్రియమైన కోమలికి ప్రేమగా నీ ప్రియుడు రాయు లేటర్.. నేను నిన్ను కలవకుండా.. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను.. అందుకే ఇంటికి వచ్చి లోపలికి రాకుండా ఈ లెటర్ ఇచ్చి పోతున్నాను.. మనం ఎప్పుడూ కలుసుకునే చోటుకి రా నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.. త్వరగా రా నీతో చాలా మాట్లాడాలి అని రాసుంటాడు. అది చదివి కోమలి షాక్ అయిపోతుంది. ఇంటికి వచ్చి లెటర్ ఇచ్చి వెళ్తాడా.. ఎందుకు అశోక్ నన్ను అర్థం చేసుకోవడం.. ఎప్పుడు పడితే అప్పుడు కలవడం నాకు కుదరదు అని ఈ సారి అశోక్‌కి గట్టిగా చెప్పాలి అని లెటర్ అక్కడే పడేసి వెళ్తుంది. 

రాజు, రూపలు కోమలి వెళ్లిపోయిన తర్వాత గదిలోకి వెళ్లి ఆ లెటర్ తీసి చూస్తారు. మొత్తం చదివి కోమలిని ఫాలో అవుతారు. అశోక్ ఓ గుడి దగ్గర ఉంటే కోమలి వెళ్తుంది.  మనం ఇలా కలుసుకోవడం వల్ల చాలా ప్రమాదం అని రాజు మామూలోడు కాదు.. ఈ సారి రాజు చేతికి దొరికితే నిన్ను ఏదో ఒకటి చేయకుమానడు అని అంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అశోక్ తనని జీవన్‌ కలవమని అన్నాడని నువ్వు వెళ్లిన పనికి ఇంకెంత కాలం పడుతుందని సీరియస్ అయ్యాడు. త్వరగా పని పూర్తి చేయమని చెప్పాడని అంటాడు. నువ్వు రూప కాదు అని రాజు వాళ్లకి తెలుసు కాబట్టి నిన్ను ఇరికిస్తారని అంటాడు. త్వరలోనే మన పని పూర్తి చేస్తానని కోమలి అంటుంది. 

కోమలి, ఆశోక్ మాట్లాడుతుంటే రాజు, రూపలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇద్దరూ రూప, రాజులని చూసి షాక్ అయిపోతారు. ఎవరి కోసం వచ్చావ్‌రా అని అశోక్‌ని రాజు చితక్కొడతాడు. రాజు అశోక్ జోలికి వెళ్లొద్దని కోమలి అరిస్తే వాడిని కొడితే నీకు నొప్పి పుడుతుందేంటే అని రూప కోమలిని కొడుతుంది. రూప కోమలిని కొడితే బాగోదు చెప్తున్నా అని అశోక్ అంటాడు. అమ్మాయి గారు మళ్లీ కొట్టండి అని రాజు అంటాడు. ఈరోజుతో ఈ కోమలి డబుల్ యాక్షన్‌కి వీడి దొంగ యాక్షన్‌కి స్వస్తి పలుకుదాం అని రాజు అంటాడు.

సూర్యప్రతాప్‌, విరూపాక్షి ఇంటికి వస్తారు. రాజు కాల్ చేసి సూర్యప్రతాప్తో ఎక్కడున్నారని అంటాడు. ఇంటికి వచ్చాన్ అని సూర్యప్రతాప్‌ అంటే మీకు ఒక విషయం చెప్పాలని అంటాడు. రూప, రాజులు కోమలి, అశోక్‌లను ఈడ్చుకొని వస్తుంటారు. సూర్యప్రతాప్‌, విరూపాక్షి ఇంటి లోపలికి వెళ్తూ గుమ్మం దగ్గర ఒకరికి ఒకరు ఢీ కొని ఆగుతారు. ఇంతలో గుమ్మానికి ఉన్న దండ ఇద్దరి మెడలో స్వాగతం పలికినట్లు పడుతుంది. ఇద్దరూ ఒకరు చూసుకుంటారు. సూర్యప్రతాప్‌ దండ తీస్తుంటే బంటి ఆపి ఇద్దరికీ ఫొటోలు తీస్తాడు. విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. ఏదో ఒకటి చేయాలని విజయాంబిక అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ దండ తీసుకొని పక్కన పెట్టి లోపలికి వస్తాడు. సూర్యప్రతాప్‌లో ఈ మార్పునకు విరూపాక్షి చాలా షాక్ అయిపోతుంది. సూర్యలో మార్పు మొదలైనట్లు అనిపిస్తుందని అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ రూప గురించి అడుగుతాడు. ఇంతలో రాజు అశోక్‌ని కోమలిని రూప తీసుకొని వస్తారు. విజయాంబిక, దీపక్ చూసి షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.