వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో నటి, ఎమ్మెల్యే రోజాకు స్థానం లభించడంతో... తొమ్మిదేళ్లుగా చేస్తున్న బుల్లితెర కామెడీ కార్యక్రమం 'జబర్దస్త్'లో జడ్జ్ సీటు నుంచి ఆమె తప్పుకొచ్చారు. రోజా తర్వాత ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... రోజాకు మంత్రిగా అవకాశం రాకూడదని భగవంతుడిని ఇంద్రజ కోరుకున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు.
రోజా వస్తే... 'జబర్దస్త్' జడ్జ్ సీటు నుంచి తాను లేచి వెళ్ళిపోతానని ఇంద్రజ స్పష్టంగా చెప్పారు. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గొడవలు ఏమీ లేవు. రోజాపై గౌరవమే ఉంది.
Also Read: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - పబ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్
''రోజా గారు తొమ్మిదేళ్లుగా ఒక లెగసీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో వెళ్లారు. ఇప్పుడు మాత్రమే కాదు... ఎప్పుడైనా, ఏ వేదిక మీదనైనా నేను ఇదే మాట చెబుతా. ఆవిడ ఎప్పుడు 'జబర్దస్త్'కు వచ్చినా... లేదంటే 'ఇంద్రజ, నేను వస్తున్నాను' అని ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు... లేచి వెళ్ళిపోవడానికి (జబర్దస్త్ జడ్జ్ సీటు నుంచి) నేను రెడీగా ఉంటాను'' అని 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలో ఇంద్రజ చెప్పారు. అదీ సంగతి!
Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?