మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయికగా పరిచయమైన సినిమా 'సామ్రాట్ పృథ్వీరాజ్'. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ చేశారు. హిందీలో రూపొందిన ఈ సినిమాను దక్షిణాది భాషల్లోనూ అనువదించి విడుదల చేశారు. సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో తెరకెక్కిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ప్లాప్ అయ్యింది.
 
'సామ్రాట్ పృథ్వీరాజ్'తో పాటు విడుదలైన కమల్ హాసన్ 'విక్రమ్', అడివి శేష్ 'మేజర్' సినిమాలు... అక్షయ్ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి. 'విక్రమ్' అయితే మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. సౌత్ సినిమాలు రెండూ భారీ విజయాలు సాధించడంతో అక్షయ్ సినిమా ప్లాప్ అయ్యిందని... ఆ హిట్స్ ఎఫెక్ట్ హిందీ సినిమాపై ఉందని కొంత మంది విశ్లేషించారు. ఈ నేపథ్యంలో కథానాయిక మానుషీ చిల్లర్ ఒక ఇంటర్వ్యూలో 'పృథ్వీరాజ్' ప్లాప్ మీద స్పందించారు.


Also Read: పాయల్ ఫుల్ గ్లామర్ షో, బీచ్‌లో ఆదితో రొమాన్స్ చూశారా?


''నిజం చెప్పాలంటే... నేను 'విక్రమ్', 'మేజర్' చూడలేదు. అయితే, మనం ఒక సినిమా పరాజయానికి మరొక సినిమాను నిందించలేం'' అని మానుషీ చిల్లర్ పేర్కొన్నారు. సినిమా ఫలితం దర్శక - నిర్మాతలు, యూనిట్ సభ్యుల చేతిలో ఉండదని ఆమె అన్నారు. ''సినిమా ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అనేది నిర్ణయించేది ప్రేక్షకులే. సినిమా అనేది సమష్టి కృషి. ఇదంతా నాకు కొత్త (ప్లాప్‌ని ఉద్దేశిస్తూ...). దీన్నుంచి చాలా నేర్చుకుంటా'' అని మానుషీ చిల్లర్ చెప్పుకొచ్చారు.


Also Read: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - ప‌బ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్