దీపికా పదుకోన్‌కు ఏమైంది? రెండు రోజుల క్రితం ఆమె ఎందుకు హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లారు? హార్ట్ ఇష్యూనా? లేదంటే మరొకటా? హిందీ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రేక్షకుల మదిలో సవాలక్ష ప్రశ్నలు. హార్ట్ ఇష్యూతో దీపిక ఆసుపత్రికి వెళ్లారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే... అందులో నిజం లేదని, బీపీలో హెచ్చుతగ్గులు ఉండటంతో వెళ్లారని నిర్మాత అశ్వనీదత్ చెప్పారు.
Project K Moive Latest Update After Deepika Padukone's Health Scare: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బీ టౌన్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ జంటగా 'ప్రాజెక్ట్ కె' సినిమా తెరకెక్కుతోంది. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. దీపిక హెల్త్ బాగోలేని కారణంగా ప్రభాస్ షూటింగ్ వాయిదా వేయమని అన్నట్టు గుసగుసలు వినిపించాయి. అందులోనూ నిజం లేదని అశ్వనీదత్ చెప్పారు.
Also Read: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - పబ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్
C Ashwini Dutt On Deepika Padukone's Health Scare: ''సెట్స్‌లో దీపికా పదుకోన్‌కు కాస్త నలతగా అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లారంతే! అక్కడ నుంచి నేరుగా మళ్ళీ సెట్స్‌కు వచ్చారు. దీపికకు కోవిడ్ వచ్చింది. తగ్గిన తర్వాత యూరప్ వెళ్లారు. అక్కడ నుంచి హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చారు. బీపీలో హై అండ్ లోస్ ఉండటంతో ఆసుపత్రికి వెళ్లారు. గంటలో మళ్ళీ వచ్చారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, దీపికపై సీన్స్ తీస్తున్నాం. తన వల్ల అమితాబ్ గంట సేపు వెయిట్ చేయాల్సి రావడంతో దీపికా పదుకోన్ గిల్టీగా ఫీల్ అయ్యారు'' అని అశ్వనీదత్ పేర్కొన్నారు. అదీ సంగతి!
Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?