'హైపర్' ఆది గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగు టీవీ ఛానల్స్, టీవీల్లో కామెడీ రియాలిటీ షోలు, ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకు అతడు సుపరిచితుడు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అతడు చేసిన నేరం నేరం ఏంటో చెప్పారు. కానీ, ఎప్పుడు చేశాడు? ఎవరు కంప్లైంట్ చేశారు? అనే వివరాలు చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచారు.
 
అవును... 'హైపర్' ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌లోకి ప్రవేశించిన పోలీసులు... 'ఆది ఎవరు? ఆది ఎక్కడ?' అంటూ హంగామా చేశారు. 'కెమెరాలతో షూటింగ్ చేయడం ఆపండి' అంటూ ఆర్డర్స్ ఇచ్చారు. షూటింగుకు వచ్చే ముందు కారుతో ఆది యాక్సిడెంట్ చేయడం వల్ల ఒకరు చావు బతుకుల మధ్యలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. దాంతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' సెట్స్‌లో అందరూ షాక్ అయ్యారు.


ఆదిని వెళ్లి పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పారు. పోలీసులతో వెళ్ళడానికి ఆది రెడీ అయ్యారు. పోలీసులకు 'ఆటో' రామ్ ప్రసాద్, మిగతా వాళ్ళు మాట్లాడానికి ట్రై చేస్తుంటే... 'అతను వస్తానంటే మధ్యలో మీరు ఎవరు?' అంటూ ఫైర్ అయ్యారు. అక్కడితో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమోకి ఎండ్ కార్డు వేశారు.


Also Read: అలనాటి ఆణిముత్యం, ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన క్లాసిక్ సినిమా 'గుండమ్మ కథ'కు 60 ఏళ్ళు - ఈ విశేషాలు మీకు తెలుసా?


'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఈ మధ్య టీఆర్పీ స్కిట్స్ అని కొత్తగా ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేశారు. లాస్ట్ సండే ఎపిసోడ్ చూస్తే... రష్మీ గౌతమ్ స్పృహ తప్పి పడిపోయినట్టు నటించడం, ఇమ్మాన్యుయేల్ తన మీద చెయ్యి వేశాడని పూర్ణ ఫైర్ అవ్వడం వంటివి టీఆర్పీ స్కిట్ అన్నమాట. ఈ అరెస్ట్ కూడా టీఆర్పీ స్కిట్ అనేది కొంత మంది చెప్పే మాట. 


Also Read: విజయ్ దేవరకొండ 'ఖుషి' తర్వాత మరో తెలుగు సినిమా అంగీకరించిన మలయాళ 'హృదయం' సంగీత దర్శకుడు