Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంతమనసు అక్టోబరు 18 ఎపిసోడ్వసుధారకి ఎండీ సీటు అప్పగించేసి రిషి వెళ్లిపోతాడు.. ఆ తర్వాత అక్కడున్న హార్ట్ బొమ్మని తీసి ఎండీ సీట్లో పెట్టి ఆ పక్కనే మరో ఛైర్ వేసుకుని కూర్చుంటుంది. నేను మీ స్థానంలో కూర్చోలేను..మీ పక్కనే కూర్చుంటాను అనుకుంటుంది...

దేవయాని-శైలేంద్ర రగిలిపోతుంటారు. దేవయాని మరింత ఫైర్ అవుతుంటే..శైలేంద్ర మాత్రం ధీమాగా ఉంటాడు. కచ్చితంగా మనం అనుకున్నవి జరుగుతుందని చెబుతాడు.. దేవయాని: జగతిని చంపేసినా సీటు దక్కలేదు..నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్ లో వసుధార కూర్చుంటే కడుపు రగిలిపోతోందిశైలేంద్ర: నేను చేయాల్సింది చేస్తాను... తొందర్లోనే తాను ఎండీ సీటుకి అర్హురాలు కాదని తేలిపోతుందని అంటాడుఇంతలో అక్కడకు వచ్చిన రిషి..ఎవరు అన్నయ్యా అంటూ ఎంట్రీ ఇస్తాడు..నువ్వు వసుధార గురించే కదా మాట్లాడేది అని అంటాడు..శైలేంద్ర: వసుధారకి తెలివితేటలు ఉండొచ్చు కానీ సహనం ఉండాలి, కష్టాన్ని ఎదుర్కొనే తత్వం ఉండాలి..ఇప్పుడు వసుధార తట్టుకోగలదా. నీకు పిన్నికి ఉన్న సమర్థత తనకి ఎక్కడుంది..తను పొరపాటు చేస్తే కాలేజీ పతనం అవుతుందేమో అని..ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పతనం అవుతుందనే ఆలోచిస్తున్నాను కానీ ఇంకే ఉద్దేశం లేదురిషి:తను వయసులో చిన్నది కావొచ్చు కానీ ఇలాంటివి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది.. వయసుని బట్టి కెపాసిటీని అంచనా వేయలేం. నైనా జైశ్వాల్, కోనేరు హంపి..ఇలా ఎంతోమంది అమ్మాయిలు చిన్న వయసులోనే మంచి విజయాలు సాధించారు. ఓ టీచర్ కి తన స్టూడెంట్ కెపాసిటీ తెలుస్తుంది..ఓ లెక్చరర్ కి తన స్టూడెంట్ గురించి తెలుస్తుంది, తనతో కలసి పనిచేసిన లెక్చరర్ గా చెబుతున్నాను.. తను వందశాతం పర్ ఫెక్ట్ ఎండీ సీటుకి..దేవయాని: రిషికి అంత నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడతావు. కొన్నాళ్లు గడిస్తే తన గురించి తెలిసి పోతుంది కదా శైలేంద్ర: నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతానని తెలుసుకదా..రిషి: ఓపెన్ గా మాట్లాడుతానని ఇక్కడికి వచ్చి ఎందుకు అక్కడే మాట్లాడి ఉండాల్సింది. అయినా వసుధార నా భార్య, ఇంటి కోడలు అని అక్కడ కూర్చోబెట్టలేదు.. ఈ విషయం మినిస్టర్ గారికి చెప్పాను ఆయన కూడా వసుధారే సమర్థురాలని చెప్పారు అందుకే అక్కడ కూర్చోబెట్టాను.. తనని సపోర్ట్ చేద్దాంఅలాగే రిషి అంటారు శైలేంద్ర, దేవయాని... రిషి వెళ్లిపోతాడు...

Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!

వసుధార రూమ్ లోకి వస్తాడు శైలేంద్ర, దేవయాని... వాళ్లని పట్టించుకోకుండా ఫైల్ చూసుకుంటూ ఉంటుంది..దేవయాని: కూర్చోమని కూడా అనవా..మేం నీ క్యాబిన్లోకి రాకూడదావసు: ఏం పనిమీద వచ్చారు..దేవయాని: చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు శైలేంద్ర: ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాలేజీని చూసుకోగలవా, చాలా బాధ్యతలు ఉంటాయి.నీకు కష్టంగా అనిపించినప్పుడు కచ్చితంగా నా హెల్ప్ అడగొచ్చుదేవయాని: నువ్వు ఒక్కదానివే చూసుకుంటావా మా హెల్ప్ కావాలావసు: రిషి సార్ దీన్ని యజ్ఞం అన్నారు.యజ్ఞం అనేది దుష్ట శక్తులను దూరం చేయడానికి చేస్తారు..అలాంటి దుష్ట శక్తుల హెల్ప్ ఎలా తీసుకుంటాందేవయాని: నువ్వు ప్రతీది రెండు రకాలుగా మాట్లాడుతున్నావ్వసు: మీరు రెండో రకంగా కనిపిస్తోంది...అయినా మీరు ఎందుకు వచ్చావ్...నేను ఎండీ బాధ్యతలు చేపడుతున్నానని వచ్చారు సైన్ చేశారు.. ఆ పని అయింది కదా వెళ్లండి...వెళ్లి ఇల్లు చూసుకోండి... రిలాక్స్ అవండి..మీకు ఏజ్ కూడా అయిపోతోంది కదా..మీరిక్కడకు రావాల్సిన అవసరం లేదు.. సార్ మేడంగారు ఇల్లు చూసుకుంటారు..మీరేమో మేడంగారిని చూసుకోండి..మీరిక్కడ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదుశైలేంద్ర: తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావావసు: మీ అంతరంగం తెలిసి మాట్లాడుతున్నాను..రిషి సార్ నాపై ఉంచిన నమ్మకమే ఈ సీట్లో కూర్చోబెట్టింది..శైలేంద్ర: నిన్ను ఆపడం కష్టం కాదు..వసు: ఏం చేస్తారో చేసుకోండి..రోడ్డు మీద జులాయిగా తిరిగే పోకిరీలు కూడా మీలాగే వార్నింగ్ లు ఇస్తుంటారు..వాళ్లకి ఎలా బుధ్ది చెప్పాలో నాకు తెలుసుశైలేంద్ర: జింక కథ చెప్పి వసుధారని బెదిరించాలి చూస్తాడు...జింక ఏ కొమ్ములు చూసుకుని మురిసిపోయిందో ఆ కొమ్ములే ప్రాణాలు తీసేందుకు కారణం అయ్యాయి.. నీ పరిస్థితి  కూడా అంతే..వసు: కొమ్ములు చూసుకుని మురిసిపోయే జింకకి..పంజా పవర్ చూసుకునే పులికి తేడా ఉంది అది తెలసుకోండిఎండీగారూ అని శైలేంద్ర అనడంతో..మీరు అలా పిలవకండి కంపరంగా ఉంది అంటుంది.. ఇక్కడి నుంచి వెళ్లండని చెప్పేస్తుంది..

Also Read: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషి కుటుంబం - దేవయాని మీద శైలేంద్ర ఫైర్

వసుధార ఇంట్లో సోఫాలో నిద్రపోతుంది..చలికి వణుకుతుంటుంది. నిద్రలేపేందుకు వెళతాడు రిషి. చేయి పట్టుకుని నిద్రపోతుంటుంది. అప్పుడు రిషి ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెడతాడు...(బ్యాంగ్రౌండ్లో ఉప్పెనలో జలజలపాతం నువ్వు సాంగ్)... బెడ్ పై పడుకోగానే ఠక్కున లేచి కూర్చుంటుంది...ఇక్కడికి వచ్చానేంటని అడుగుతుంది. సోఫాలో నిద్రపోయావు చలిగా ఉందని ఇక్కడికి తీసుకొచ్చానని చెబుతాడువసు: మీరు నాకు సేవ చేయడం నచ్చదురిషి: అనాధిగా భార్యలే సేవలు చేస్తున్నారు.. ఇప్పుడు భర్తలకు ఆ అవకాశం ఇవ్వండివసు: మీరిలా చేస్తే నాకు కోపంగా ఉంటుందిరిషి: కోప్పడు..కోపంలో కూడా అందంగానే ఉంటారుఇద్దరూ అందంగా పోట్లాడుకుంటూ ఉంటారు.. ఇంతలో మహేంద్ర గట్టిగా అరుస్తాడు.. వెళ్లి చూస్తే మంచంపైనుంచి పడిపోయి ఉంటాడు..