ఈ వారం ‘బిగ్ బాస్’ (Bigg Boss Telugu 7) నామినేషన్స్ చాలా వాడీవేడిగా జరిగాయి. సింగర్ భోలే షావలితో శోభాశెట్టి, ప్రియాంక వీరోచితంగా పోరాడారు. భోలే కూల్‌గా మాట్లాడాలని ప్రయత్నించినా.. ఆయన్ని రెచ్చగొట్టి మరీ మాటలు అనిపించుకొన్నారేమో అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలగక మానదు. వీరి గొడవ ఎంతవరకు వెళ్లిందంటే.. ప్రియాంక జైన్ నామినేషన్ ప్రక్రియను ముందుకు సాగనివ్వను అని అడ్డుకొనేవరకు సాగింది. చివరికి బిగ్ బాస్ కూడా భోలే వ్యాఖ్యలపై స్పందించాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో బూతులు మాట్లాడటం సరికాదని బిగ్ బాస్ హెచ్చరించిన తర్వాత మళ్లీ నామినేషన్ ప్రక్రియ సాగింది. అయితే, ఆ తర్వాత కూడా పరిస్థితులు అలాగే కొనసాగాయి.
శోభాశెట్టి Vs భోలే.. (Bigg Boss Telugu Shobha Shetty vs Bhole Shavali)
శోభాశెట్టి.. భోలేను నామినేషన్ చేస్తూ.. ‘‘మీరు చాలా ప్రేమగా ఆడబిడ్డ, బుజ్జమ్మ అంటారు. టాస్క్ టైమ్‌లో ఆడబిడ్డవు కాబట్టి వదిలేశా అన్నారు. అది నాకు నచ్చలేదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే మధ్యలో అనవసరంగా కలుగజేసుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా’’ అని పేర్కొంది. ఇందుకు భోలే స్పందిస్తూ.. ‘‘నువ్వు బిగ్ బాస్ మోనితా కావద్దు’’ అని అన్నాడు. దీంతో శోభాశెట్టి మరింత ఆగ్రహంతో భోలేపై అరిచింది. ‘‘నువ్వు నిజంగానే బిగ్ బాస్‌లో మోనితావు’’ అని రెట్టించాడు. ఇక శోభాశెట్టి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘చచ్చిపోయే వరకు మోనితా పాత్రకు రుణపడి ఉంటా. ఆ పాత్ర వల్లే శోభాశెట్టి ఈ రోజు బిగ్ బాస్‌లో ఉంది’’ అని మోనితా అన్నది. దీంతో భోలే.. ‘‘ఆ సీరియల్‌లో మోనితాగా నటించావు. నిజ జీవితంలో కూడా మోనితాలాగే నటిస్తున్నావ్’’ అనడంతో మరింత రెచ్చిపోతూ ప్రశాంత్ తరహాలో బరాబర్ నేను ఇలాగే ఉంటా అని శోభాశెట్టి తెలిపింది.
ప్రశాంత్ బరాబర్ చేసిండు.. ప్రియాంక ఫైర్
దీంతో భోలే.. ‘‘మా రైతు బిడ్డ ప్రశాంత్ బరాబర్‌ను వాడుతున్నారు. అది చూసే వచ్చాను. ప్రశాంత్ మీకు బరాబర్ చేసిండు’’ అంటూ ఒక బీప్ మాట ఏదో వేసుకున్నాడు భోలే. అది విని ప్రియాంక.. మధ్యలోకి వచ్చింది. ‘‘భోలే బూతులు మాట్లాడుతున్నాడు బిగ్ బాస్.. నేను నామినేషన్ ప్రక్రియను ముందుకు సాగనివ్వను’’ అని అంది. భోలే మాట్లాడుతూ.. ‘‘నీలాంటివారిని చాలామందిని చూశా’’ అన్నాడు. దీంతో ప్రియాంక థూ అంటు ఊసింది. దీంతో భోలే.. ‘‘నేను థూ అంటే నీ బతుకు ఏం కావాలి?’’ అని అన్నాడు. దీంతో బిగ్ బాస్.. భోలేకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత శోభా.. టేస్టీ తేజాను నామినేట్ చేసింది. ఆమె చెప్పిన కారణం నామినేషన్‌కు సరైనదే. కానీ, ఆమెతో ఎప్పుడూ స్నేహంగా ఉండే తేజాను నామినేషన్‌కు ఎంపిక చేసుకోవడం హౌస్‌మేట్స్‌కు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత భోలేకు నామినేషన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా భోలే శోభాశెట్టిని నామినేట్ చేశాడు. తన రీజన్ వినకుండా శోభాశెట్టి వాదిస్తుంటే.. ‘‘నీకు ఎర్రగడ్డ హాస్పిటలే దిక్కు’’ అన్నాడు. దానికి అర్థం తెలుసుకున్న శోభా మరింత రెచ్చిపోయింది. ఆ తర్వాత ప్రియాంక కూడా భోలేపై అరుస్తూనే ఉంది. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ మొత్తం వారి ముగ్గురి మధ్యనే నడించింది.
Bigg Boss 7 Nominations Telugu: పరస్పరం నామినేట్ చేసుకున్న గౌతమ్, శివాజీ
‘‘గౌతం నీ మీద నాకు తప్పుడు ఫీలింగ్ లేదు. కానీ నన్ను స్టేజ్ మీద ఫేక్ అన్నావు. దానికి హర్ట్ అయ్యాను’’ అన్నాడు. ‘‘ఆ రోజు నన్ను ఎలిమినేట్ చేసి పంపేశారు కాబట్టి ఆ మూమెంట్‌లో అలా అన్నాను’’ అని గౌతమ్ అన్నాడు. ‘‘నువ్వు నీ గేమ్ ఆడు. నువ్వు భయపడుతున్నావు. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది’’ అని శివాజీ అన్నాడు. ఆ తర్వాత గౌతమ్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. ‘‘మీరు ఆట ఆడలేకపోతున్నారు. నయని పావని వంటి యంగ్ స్టర్స్ ఆట ఆడి బిగ్ బాస్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా’’ అన్నాడు. దీనికి శివాజీ.. ‘‘నువ్వు సరిగ్గా ఆట ఆడితే కెప్టెన్ ఎందుకు కాలేకపోయావు? హౌస్ మేట్ ఎందుకు అవ్వలేదు? టాస్కులు ఎందుకు గెలవలేకపోయావు. జనాలు చూస్తున్నారు. ఇది వర్కవుట్ అవ్వదు’’ అని రెచ్చగొట్టాడు. ‘‘నేను ఆడలేకపోయినా.. నా ఆధ్వర్యంలోనే వారికి కెప్టెన్సీ వచ్చింది’’ అని శివాజీ అన్నాడు. దీంతో ‘‘మీరు కోచ్‌గా రాలేదు’’ అని పంచ్ వేశాడు. ‘‘నేను ఆడి ఉండకపోతే ఏడు వారాలు ఈ హౌస్‌లో ఉండేవాడినా? 96 సినిమాల అనుభవం ఇదేనా?’’ అని ప్రశ్నించాడు. శివాజీని నామినేట్ చేశాడనే కారణంతో యావర్.. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఆయన వల్లే తాము కెప్టెన్సీ గెలిచామని, ఆయన ఆడలేకపోయినా మాతో ఆడించాడని తెలిపాడు.
కప్పు కొట్టే వెళ్తా: అమర్ దీప్ - అశ్వినీ కన్‌ఫ్యూజ్
అశ్వినీ శ్రీ.. పూజా మూర్తిని నామినేట్ చేసింది. ఆ తర్వాత అమర్ దీప్‌ను నామినేట్ చేయాలని అనుకుంది. కానీ, అమర్ దీప్.. అశ్వినీ శ్రీని కన్‌ఫ్యూజ్ చేసి.. నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ‘‘నన్ను నామినేట్ చేయడం అనవసరం. నేను కప్పు కొట్టే వెళ్తాను’’ అని అనడంతో ఆమె.. అర్జున్‌ను నామినేట్ చేసింది. చివర్లో అమర్‌ను పోనీలే అని వదిలేశానంటూ అమాయకంగా చెప్పింది. చివరిగా, భోలే వాష్ రూమ్స్ వద్ద ఉన్న ప్రియాంక, శోభాలకు క్షమాపణలు చెప్పడానికి వెళ్లాడు. అయితే, శోభా అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత భోలే రాత్రి.. మరోసారి ప్రియాంక, శోభాలను కలిసి సారీ చెప్పాడు. అయితే, ప్రియాంక.. కెప్టెన్ యావర్ దగ్గరకు వెళ్లి.. భోలే ఏం బూతు అన్నాడో చెప్పింది. ‘‘ప్రశాంత్ మీకు బరాబర్ బజాయా’’ అనే అర్థం వచ్చేలా బూతులు మాట్లాడడని పేర్కొంది.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే.. (Bigg Boss 7 Telugu Nominations This Week)
⦿ శోభాశెట్టి - టేస్టీ తేజా, భోలేను నామినేట్ చేసింది.
⦿ శివాజీ - అమర్‌దీప్, గౌతమ్‌లను నామినేట్ చేశాడు.
⦿ అశ్వినీ శ్రీ - పూజా, అర్జున్‌ను నామినేట్ చేసింది.
⦿ గౌతమ్ - భోలే, శివాజీలను నామినేట్ చేశాడు.
⦿ భోలే - శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేశాడు.
⦿ యావర్ - గౌతమ్, అమర్‌దీప్‌లను నామినేట్ చేశాడు.
ఈ వారం నామినేషన్లో ఉన్నది వీరే: భోలే, అశ్విని, తేజ, ప్రశాంత్, పూజా, అమర్ దీప్, గౌతమ్