Guppedantha Manasu February 3rd Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 3 ఎపిసోడ్)


భద్ర పోలీసులకు దొరికిపోవడంతో శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో ధరణి నిద్రలేది..ఏంటండీ నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు, చలిజ్వరం వచ్చిందా అలా వణికిపోతున్నారు, ట్యాబ్లెట్లు, కషాయం తెమ్మంటారా అని అడుగుతుంది. ధరణిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు.
ధరణి: మీరు అలా ఉంటే నేను సైలెంట్ గా ఎలా ఉంటాను చెప్పండి..భర్త ఏదో దిగులుతో ఉంటే ఏ భార్య అయినా సైలెంట్ గా ఎలా ఉంటుంది. మీకు ఏదైనా అయితే చుట్టుపక్కల వాళ్లంతా నన్నే కదా ఆడిపోసుకునేది
శైలేంద్ర: వామ్మో..ఇది ఎంత ఎక్కువ మాట్లాడుతోంది ఏంటి...
ధరణి: పర్లేదు మీ బాధేంటో చెప్పండి...ఎందుకలా ఉన్నారు..ఏదైనా చెప్పుకోలేని ప్రాబ్లెమా...
శైలేంద్ర: అంతా బాగానే ఉంది..కావాలంటే ధర్మామీటర్, బీపీ మిషన్ తెచ్చి చెక్ చేసుకో
ధరణి: ఏమైనా మంచి వార్త విన్నారా..మంచి వాళ్లకి మంచి వార్త వింటే సంతోషం..కానీ మీలాంటి వాళ్లకి కాదు కదా...
శైలేంద్ర: నన్ను విసిగించకు పడుకో
ధరణి: మీరు కూడా పడుకోంది..తెల్లార్లూ జాగారం చేయమన్నానా...
కాసేపు ప్రశ్నలతో విసిగిస్తుంది ధరణి...శైలేంద్ర కోపంగా మాట్లాడుతుంటే..బ్యాడ్ నైట్ అని చెప్పేసి నిద్రపోతుంది


Also Read: భద్ర అరెస్ట్, శైలేంద్ర కి కౌంట్ డౌన్ - వసుధార స్కెచ్ మామూలుగా లేదు!


అనుపమ-మహేంద్ర కూర్చుని ఆలోచిస్తుంటారు..సడెన్ గా వసుధార ఎక్కడికి వెళ్లింది, కనీసం చెప్పను కూడా చెప్పలేదని టెన్షన్ పడుతుంటారు.. ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది. ఎక్కడికి వెళ్లావ్ అని కంగారుగా అడుగుతారు
వసుధార: ఓ చీడ పురుగుని ఏరిపారేయడానికి వెళ్లాను పారేశాను అంటూ భద్రని పోలీసులకు పట్టించిన విషయం,శైలేంద్రకి క్లాస్ ఇచ్చిన విషయం  చెబుతుంది.
మహేంద్ర: అసలు ఆ భద్ర ఎన్ని నాటకాలు ఆడాడు...ఎన్ని మాటలు చెప్పాడు..నీతులు మాట్లాడాడు..పాపం జీవితంలో దెబ్బతిని ఉంటాడులే అనుకున్నాను..రోజుకి 100 ఇస్తే చాలన్నప్పుడే వాడిని అనుమానించాల్సింది
అనుపమ: వాడు తెగ బిల్డప్ ఇచ్చేవాడు...పక్కా 420...
వసుధార: వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను అన్నారు..రిషి సర్ గురించి తెలిసే అవకాశం ఉంది...
మహేంద్ర: ఎక్కడున్నాడో..ఎలా ఉన్నాడో ్నే భయం వేస్తోంది...


Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!


ఇన్వెస్టిగేషన్ ప్రారంభం
ముకుల్: నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా..అక్కడ సాల్వ్ చేయాల్సిన కేసులు వేరు. నువ్వు అసలు దోషివి కాదు..నీ వెనుకు వ్యక్తి బయటకు రావాలి..అందుకే నిన్ను ఇక్కడే డీల్ చేస్తాను..నేనిప్పుడు అడుగుతూ ఉంటాను...సమాధానాలు చెబుతూ ఉండు..నువ్వు మహేంద్ర సార్ ఇంట్లో ఎందుకు చేరావు
భద్ర: పనికోసమే అని స్ట్రాంగ్ గా చెబుతాడు
ముకుల్: మరి నిన్ను అక్కడ ఎవరు జాయిన్ అవమన్నారు
భద్ర: ఎవరూ చెప్పలేరు
ముకుల్: మరి వసుధార వాళ్లింటికి వెళ్లావ్ కదా..రిషి కోసమే కాదు..
అయినా నోరు తెరవడు.. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నానంటూ..రిషి మిస్సయ్యాడు నువ్వేనా కారణం..మీకు లీడర్ శైలేంద్రేనా?
భద్ర: అసలు రిషి అనే అతన్ని నేను చూడలేదు..వాళ్లు మాట్లాడుకుంటే వినడం తప్ప అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు...
ముకుల్: మరి వసుధార మీద అటాక్ చేయడానికి ఎందుకొచ్చావని గట్టిగా అడుగుతాడు. 
భద్ర: పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయాల్సి వచ్చిందంటాడు కానీ అసలు విషయంబయటపెట్టడు...
ముకుల్: నీకు కావాల్సిన డబ్బు నేనిస్తాను నిజం చెప్పు..
భద్ర: నాకు కొంచెం టైమ్ ఇవ్వండి...ఓ పూట కావాలి అని అడుగుతాడు
ముకుల్ సరే అంటాడు...రేపు ఉదయం నిజం చెబుతావ్ అనుకుంటున్నా నీనుంచి రెండో ఆన్సర్ రాకూడదు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు..
భద్రను విడిపిస్తే డబ్బులిస్తానని చెప్పి శైలేంద్ర నుంచి అక్కడున్న పోలీస్ కి మెసేజ్ వస్తుంది...కష్టం సార్ అని రిప్లై ఇస్తాడు ఆ పోలీస్..


Also Read: ఈ రాశులవారి వ్యక్తిగత, వృత్తి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది!


మహేంద్ర ఇంటికి ముకుల్


భద్ర ఇలా మోసం చేస్తాడు అనుకోలేదని మహేంద్ర బాధపడతాడు... భద్ర ఏమైనా చెప్పాడా అని వసుధార అడిగితే లేదని చెబుతాడు ముకుల్. 
ముకుల్: ఫోన్లో వీడియో డిలీట్ చేసింది వాడే
మహేంద్ర: మరి రిషిని కిడ్నాప్ చేసింది ఎవరు..నాకొడుకుని చూడాలి, నాకొడుకుతో మాట్లాడితే నా భారం మొత్తం దిగిపోతుంది..
చక్రపాణి: అల్లుడుగారు ఎక్కడున్నారో తెలిస్తే చెప్పండి మీ మేలు మర్చిపోలేను..అల్లుడిగారి ఆరోగ్యం బాలేదు, వైద్యం చేయించాలి వేళకి భోజనం ఇస్తేనే మామూలు స్థితికి వస్తారు..తొందరగా కోలుకోడానికి వీలుంటుంది...
ముకుల్ మాత్రం సైలెంట్ గా ఉండిపోతాడు...
నా బిడ్డ ప్రాణం రిషి సర్..ఆయన ఎక్కడున్నారో తెలిస్తే చాలు మేం కాపాడుకుంటాం అని చక్రపాణి కన్నీళ్లు పెట్టుకుంటాడు...
అనుపమ: ముకుల్ ఏమైంది..ఎందుకలా ఉన్నారు...ఏమీ మాట్లాడరేంటి... భద్ర ఏమీ చెప్పలేదా
ముకుల్: మా కష్టడీ నుంచి భద్ర తప్పించుకున్నాడు..


శైలేంద్ర ఆనందం


భద్ర తప్పించుకున్నాడనే విషయం శైలేంద్రకు కాల్ రావడంతో సంబరపడతాడు..మమ్మీ మమ్మీ అంటూ హడావుడి చేస్తాడు.. ఇదంతా చూసిన ధరణిలో ఏదో అనుమానం మొదలవుతుంది.
దేవయాని: భద్ర మన పేరు బయటపెడతాడని భయంగా ఉంది
శైలేంద్ర: వాడు చెప్పడు మమ్మీ, మన నిజస్వరూపం ఎప్పుడూ బయటపడదు.. ఏదైనా చెప్పాలంటే ఆ భద్ర గాడు ఉంటేనే కదా అని అసలు విషయం చెబుతాడు..
ఇదంతా విన్న ధరణి షాక్ అవుతుంది..