Guppedantha Manasu February 2nd Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 2 ఎపిసోడ్)


రిషి గురించి డిస్కస్ చేసుకుంటారు వసుధార, అనుపమ, మహేంద్ర. మొదట్నుంచీ రిషి పడిన కష్టాలు గుర్తుచేసుకుని మహేంద్ర బాధపడతాడు. ఆ తర్వాత వసుధారకి కాల్ వస్తుంది...రిషి సర్ దొరికారా ఇప్పుడే వస్తున్నా అంటూ కంగారుగా బయలుదేరుతుంది వసుధార. వెంటనే శైలేంద్రకి కాల్ చేసి చెప్పిన భద్ర...నేను వసుధారని లేపేస్తాను, రిషి కూడా అక్కడే ఉంటే వాడినీ చంపేస్తాను రెండు ఐస్ బాక్సులు రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పి కాల్ కట్ చేసి బండితో వసుధార కారుని ఫాలో అవుతాడు. ఇక ఈ రోజుతో మీ అడ్డు తొలిగిపోయినట్టే అని సంతోషంలో ఉంటాడు శైలేంద్ర. 


Also Read: మరో 12 ఎపిసోడ్స్ తో గుప్పెడంత మనసు కి శుభం కార్డ్ - కార్తీకదీపం లానే చేస్తారా!


వసుధార కారుని ఫాలో అవుతాడు భద్ర...ఓ దగ్గర కారు అపి దిగి వెళుతుంది..తనని ఫాలో అవుతాడు. వసు వెనక్కు తిరిగి చూడడంతో దాక్కుంటాడు...మళ్లీ ఫాలో అవుదాం అని చూసేసరికి వసుధార కనిపించదు..వెనక్కు తిరిగి చూస్తే లాగిపెట్టి కొడుతుంది. 
భద్ర: నన్నే కొడతావా
వసు: నువ్వు వెధవ్వి అని నాకు తెలుసు, నీ మాటలు చేష్టలు నాకు తెలుసు..
భద్ర: ఇప్పుడు నువ్వేం చేయగలవ్..
ఎందుకు అంటూ ముకుల్ మాట వినిపిస్తుంది...షాక్ అవుతాడు భద్ర...పోలీసులు చుట్టుముట్టి భద్రను అరెస్ట్ చేస్తారు. 
ముకుల్: నువ్వు ఏ సంబంధం లేకుండా వాళ్లింట్లో చేరావు అంటేనే నాకు అనుమానం వచ్చింది..
భద్ర: నేనేం చేశాను అనుమానం అంటారేంటి అంటూ మాట మారుస్తాడు...
ముకుల్: గతంలో నువ్వు ఏం చేశావో, ఇప్పుడు నిన్ను ఎవరు పంపించారో ఇప్పుడు మొత్తం తేలుతుంది...
భద్ర: ఏంటి సర్ తేలేది...
ముకుల్: వసుధార ఫోన్లో ఉన్న ప్రూఫ్ వీడియో డిలీట్ అయిన వెంటనే నువ్వే చేశావని డౌట్ వచ్చింది. నీకు ట్రీట్మెంట్ ఇస్తే అన్ని నిజాలూ బయటకు వస్తాయ్.. 
వసు: నువ్వు ఫ్రాడ్ వని నాకు తెలుసు..నువ్వెంత నటించినా ఇక్కడ నిన్ను నమ్మరు..ఆ రోజు నువ్వు రౌడీలను అరెంజ్ చేసి మాపై అటాక్ చేసి నువ్వు మమ్మల్ని కాపాడినట్టు నటించావని నాకు తర్వాత అర్థమైంది...ఆ తర్వాత మా మావయ్యకి పరిచయం అవడం, రిషి సర్ గురించి ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడే నాకు తెలుసు
భద్ర అప్పటికి కూడా తనకేం తెలియదని నటిస్తుంటాడు...పోలీసులు తీసుకెళతారు... జీవితంలో నిన్ను,రిషి గాడిని వదలను అని వార్నింగ్ ఇస్తాడు భద్ర...


Also Read: రొమాంటిక్ స్టోరీని క్రైమ్ స్టోరీ చేసిపడేశారు - రిషి ఇక రాడా!


భద్ర కాల్ చేసి ఇక్కడకు రమ్మన్నాడు కదా..మరి ఎవ్వరూ కనిపించడం లేదేంటి అనుకుంటాడు శైలేంద్ర... ఇంతలో అక్కడు ఎంట్రీ ఇచ్చిన వసుధార ఏం వెతుకుతున్నావ్ అని అడుగుతుంది...షాక్ అవుతాడు ...ఏం లేదు అనేస్తాడు
వసు: నువ్వు ఎంతో ఆత్రుతతో గాలింపు చర్యలు చేపట్టి ఏం లేదు అంటావేంటి...నాకోసం వెతుకున్నావా, భద్ర కోసం వెతుకుతున్నావా...
శైలేంద్ర: భద్ర ఎవడసలు
వసు: ఇంకా ఎంతకాలం నాటకాలు నీ వేషాలు, అబద్ధాలు మోసాలు చూసి చూసి విసిగెత్తి పోయింది..అందుకే నీ మనిషి భద్రని భద్రంగా సాగనంపా 
శైలేంద్ర: అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు..
వసు: భద్ర కోసం కాకపోతే మరి నాకోసం వచ్చావా..నాకోసం కాకుండా, భద్ర కోసం కాకుండా ఎవరికోసం వచ్చావ్...
శైలేంద్ర: ఎవరికోసం రాలేదు
వసు: మరి ఎందుకొచ్చావ్...
శైలేంద్ర: వాకింగ్ చేసుకుంటూ వచ్చాను..
వసు: మరిక్కడ ఏదో వెతుకుతున్నావేంటి...
ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు..
నీకో షాకింగ్ విషయం చెబుతాను విను...
వసు: భద్ర నీ మనిషి అని నాకు పక్కాగా తెలుసు అందుకే ప్లాన్ చేసి భద్రని ఇరికించా అని క్లారిటీ ఇస్తుంది
శైలేంద్ర షాక్ అవుతాడు...
వసు: రిషి సర్ ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకుతప్ప ఎవ్వరికీ లేదు..ఎక్కడున్నారో చెప్పు
శైలేంద్ర: నాకు తెలియదు
సరే నేను తెలుసుకుంటాను...రెడీగా ఉండు శైలేంద్ర అందరి ముందూ దోషిగా నిలబడేందుకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది వసుధార...