Trinayani Today Episode: ఆంజనేయుడి పూజలో తిలోత్తమ మనసులో ఒకటి కోరుకొని బయటకు ఇంకొకటి చెప్తుంది. దీంతో శ్రీరామ అని రాసిఉన్న తమలాపాకులు తిలోత్తమ ముఖానికి గట్టిగా అతుక్కుంటాయి. ఎంత తీయాలి అని ట్రై చేసినా రావు. దీంతో గురువుగారు కాల్చాలి అంటారు. అందరూ తిలోత్తమ ముఖాన్ని కాల్చాలేమో అని షాక్ అవుతారు. 


పావనా: గురువుగారు మీరు వివరంగా చెప్పండి..
గురువుగారు: నేను చెప్పకముందు తిలోత్తమ చెప్పాలి. మారుతిని ఏమని కోరుకుందో అని..
తిలోత్తమ: చెప్పాను కదా గురువుగారు స్వామి దర్శనం కావాలి అని..
గురువుగారు: అబద్ధం.
విశాల్: అబద్ధం ఎందుకు అవుతుంది స్వామి అమ్మ బయటకే కోరుకుంది కదా. 
గురువుగారు: మనసులో ఒకటి కోరుకొని బయటకు ఇంకొకటి చెప్తే ఇలాగే జరుగుతుంది.
నయని: ఇందాక అత్తయ్యతో అదే చెప్పాను స్వామి. ముందు ఒప్పుకోలేదు తర్వాత చెప్పక తప్పలేదు.. అది నా నోటితో నేను చెప్పలేను.
తిలోత్తమ: నేను అస్సలు చెప్పను..
వల్లభ: అంత భయంకరమైన కోరిక ఏం కోరుకున్నావో నాతో చెప్పమ్మ..
తిలోత్తమ: అది అందరి ముందు చెప్పేది కాదురా.. అది వదిలి ముందు ఈ ఆకులు ఎలా వస్తాయో చెప్పండిరా... 
డమ్మక్క: ఇంకేంటి కాల్చడమే..
గురువుగారు: గాయత్రీ దేవికి సంబంధించిన కోరికే కోరుకొని ఉంటుంది తిలోత్తమ అవునా.. 
తిలోత్తమ:  అవును గురువుగారు..
గురువుగారు: అయితే గాయత్రీ దేవి గారు వాడిన లాంతరుని తీసుకొని రండి.. ఆమె పేరు పెట్టుకున్న ఈ గాయత్రీ పాప చేత లాంతరు పట్టించి ఆ లాంతరు సెగతో అతుక్కుపోయిన ఆ నాగవల్లి పత్రాలను వదిలించాలి. నయని లాంతరు తెస్తుంది. గాయత్రి పాప ఆకులను ముట్టుకోగా ఆకులు ఊడిపోతాయి. తిలోత్తమ ముఖం నల్లగా మాడిపోతుంది. 
విక్రాంత్: చూశారా చిన్న పిల్లని అనాథ అని పేద పిల్ల అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు కానీ ఈ పాప ఇప్పుడు మీకే సాయం చేసింది.
వల్లభ: మమ్మీ నీ ఫేస్ ఏంటి మమ్మీ నల్లగా మసిలా తయారైంది. 


తిలోత్తమ: అఖండ స్వామితో.. గాయత్రీ అక్క చివరిగా కట్టుకున్న చీరతోనే నా గొంతు బిగించబోయారు స్వామి. 
వల్లభ: అప్పుడే హాసినికి అమ్మవారు పూనింది. పెద్దమ్మ చీరతోనే ఫ్యాన్‌కి ఉరి వేయాలనుకుంది. 
తిలోత్తమ: ఉదయం జరిగింది చెప్తామీకు అని తన తమలాపాకులు ముఖానికి అతుక్కోవడం గురించి చెప్తుంది. 
అఖండ: లాంతరు పెడితే గానీ నాగవల్లి పత్రాలను నీ నుంచి వేరు చేయలేకపోయారా..
వల్లభ: అది కూడా ఆ దత్త పుత్రిక చేయి పడగానే వచ్చేశాయి స్వామి.
అఖండ: నువ్వు కోరుకున్న కోరిక ఆచరణనీయం కాదు కాబట్టే అలా జరిగింది తిలోత్తమ.
తిలోత్తమ:  అలా కోరుకోకపోతే ఏదో ఒకరోజు గాయత్రీ అక్కయ్య ఇంటికి వచ్చేస్తుంది. నా ప్రాణాలు తీసేస్తుంది.
అఖండ: జరిగేది అదే.. దాన్ని మార్చడం ఈ జన్మలో జరగని పని..
వల్లభ: అంటే పునర్జన్మ ఎత్తిన మా పెద్దమ్మ మా అమ్మని పాడె ఎక్కించడం ఖాయమా స్వామి.
అఖండ: విధి రాతను తప్పించలేం.
తిలోత్తమ: అలా చెప్పి నా భవిష్యత్తుని నా మీరు కాల్చకండి స్వామి. ఒక్కసారి గాయత్రీ అక్కయ్య నీడ కనిపించినా చాలు. ఇంకో జన్మ లేకుండా చేస్తాను. 
అఖండ: అయితే మీరు ఓ ఉత్కృష్టమైన కార్యం చేయాలి.. ఈ విషయం ఎవరి దగ్గర ప్రస్తావించకుండా ప్రయత్నించండి. గాయత్రీ దేవి స్పష్టంగా కనిపిస్తుంది. అని అఖండ స్వామి ఏదో ఐడియా తిలోత్తమ వాళ్లకు చెప్తారు. 
తిలోత్తమ: ఇదెక్కడి విచిత్రం స్వామి.. అయినా చేస్తాం గాయత్రీ అక్కయ్యే తనకు తానుగా తన చావును తెచ్చుకునే సువర్ణ అవకాశం వచ్చినట్లే మాకు.
వల్లభ: పెద్దమ్మే తన పునర్జన్మను చూపిస్తుందా.. 


తిలోత్తమ హాల్‌లోకి వచ్చి గాయత్రీ దేవి ఫొటోకి నమస్కరిస్తుంది. అందరూ వింతగా చూస్తారు. నయని సెటైర్లు వేస్తుంది. కానీ విశాల్ తిలోత్తమకు సపోర్ట్ చేస్తాడు. రాత్రి మళ్లీ గాయత్రీ అక్కయ్య కలలోకి వచ్చిందని తిలోత్తమ ఇంట్లో వాళ్లకు చెప్తుంది. 


తిలోత్తమ:  అక్కయ్య ఏం చెప్పిందో వింటే విచిత్రం అనుకుంటారు. 
వల్లభ: పెద్దమ్మ కోరిక కోరింది.
తిలోత్తమ: మీరందరూ ఆంజనేయ స్వామివారి వాలానికి బొట్టుపెట్టి కోరిక కోరారు. నేను మాత్రం నీతో చెప్పుకుంటున్నాను అని రిక్వెస్ట్ చేసింది అక్క. గాయత్రీ అక్క చివరి సారిగా కట్టుకున్న చీరని ఒకసారి నన్ను కట్టుకోమని కోరింది. 
హాసిని: ఆ చీర వల్ల అత్తయ్య, చిట్టీ ఇద్దరూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు మర్చిపోయారా.
తిలోత్తమ: మనసులో.. ఆ చీర వల్ల ఈ సారి పునర్జన్మ ఎత్తిన గాయత్రీ అక్కయ్యని ముగించేస్తానే అని తిలోత్తమ అనుకుంటుంది. ఇక విశాల్‌కి ఆ చీర తీసుకొని రమ్మని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: సత్యభామ సీరియల్ ఫిబ్రవరి 1st: రేపే మాధవ్, సత్యల నిశ్చితార్థం.. రెస్టారెంట్‌లో క్రిష్‌ రివాల్వర్ పేల్చిన కాళీ!