Guppedantha Manasu February 24th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 24 ఎపిసోడ్)
మను ఇక్కడికి భోజనానికి వచ్చిన నీకు తెలుసుకదా పెద్దమ్మా అని నిలదీస్తుంది అనుపమ. వాడు భోజనానికి ఒకరి ఇంటికి వెళుతున్నాడంటే నువ్వో మాటన్నావ్ గుర్తుందా అని అడుగుతుంది పెద్దమ్మ. భోజనానికి వెళితే వెళ్లమను అక్కడే ఉండిపోమను అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది అనుపమ. నువ్వు ఎప్పుడూ ఇంతే పెద్దమ్మా నన్ను ఇరకాటంలో పెట్టాలని చూస్తావ్ అని కోపంగా కల్ కట్ చేస్తుంది. ఈ అనుపమ-మను ఇద్దరూ నాకు ఎప్పుడు అర్థం అవుతారో అనుకుంటుంది
మా ఇంటి భోజనం ఎలా ఉందని మహేంద్ర అడిగితే.. చాలా రోజుల తర్వాత కడుపునిండా సంతృప్తిగా తిన్నాసర్ అని రిప్లై ఇస్తాడు మను.
మహేంద్ర: నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఫీలవొద్దు..నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడకు రావొచ్చు..కాలేజీలో చేరి మాలో ఒకడివి అయిపోయావ్..కానీ నీ గురించి మాత్రం చెప్పలేదు. నేను నీ బ్యాంక్ అకౌంట్ అడగలేదు కదా...పోనీ నీకు చెప్పాలని లేకపోతే వద్దులే నాక్కూడా అంత కుతూహలం లేదు..మన మనసుకి దగ్గరైన వాళ్ల గురించి తెలుసుకోవాలి అనుకుంటాం కదా..అంతకుమించి ఇంకే లేదు నీకు చెప్పాలి అనిపిస్తే చెప్పు లేదంటే లేదు..నువ్వు కాలేజీకి చేసిన సాయం మాత్రం జీవితాంతం గుర్తుంటుంది..ఎందుకంటే ఆ కాలేజ్ మా రిషి ప్రాణం.. అది దూరమైపోతుందని మేం ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సమయంలో తిరిగి మా చేతిలో పెట్టావ్ అందుకే మీకు రుణపడి ఉంటాం...
మను: రిషినే తన కాలేజీని తను నిలబెట్టుకున్నాడు..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ద్వారా తను ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దాడు..తను చేసిన మంచే తనకు తిరిగొచ్చింది..మీరు ప్రతిసారీ ఈ విషయంలో పొగుడుతుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది...
సరే నేను వెళ్లొస్తాను అని మహేంద్రకి చెప్పేసి...అనుపమ వైపు చూసి వెళ్లిపోతాడు...అనుపమ ను గమనిస్తుంటారు మహేంద్ర, వసుధార....
వసుధార
మనుతో అనుపమ ప్రవర్తన చూసి వసుధార ఆలోచనలో పడుతుంది..అసలు ఈ మను ఎవరు? తనని చూడగానే ఎందుకు ఏదోలా అయిపోతున్నారు? మను ఉన్నంతసేపు సరిగా మాట్లాడడం లేదు..అసలు మేడంకి మనుకి సంబంధం ఏంటి? వాళ్లకు ఇంతకుముందే పరిచయం ఉందా? ఉంటే మాతో చెప్పేవారు కదా...వాళ్లమధ్య ఏదో బంధం ఉంది అనిపిస్తోంది..అదే నిజమైతే తను కచ్చితంగా మాకు మను గురించి చెబుతారు...ఓ వేళ ఏదైనా కారణం ఉందా? గతంలో నేను రిషి సర్ ఏంజెల్ వాళ్లింట్లో ఉన్నప్పుడు నేను-రిషి సర్ పరిచయం లేనట్టే ఉన్నాం కదా ఇప్పుడు వీళ్లు కూడా ఇలానే ఉన్నారేమో...మేడం కళ్లలో మనుపై అమ్మప్రేమ కనిపిస్తోంది...మను తన కొడుకు అనుకుందాం అనుకుంటే ఆమె పెళ్లిచేసుకోలేదని అన్నారు..అంటే వాళ్లమధ్య బంధం ఇలా ఉండదు...ఇద్దరికీ ఏంటి సంబంధమో అర్థం కావడం లేదు...ఇద్దరికీ ఏదో గతం మాత్రం ఉంది..అదేంటో తెలుసుకోవాలి..అప్పుడే అన్ని విషయాలకు క్లారిటీ వస్తుంది...
అనుపమ - మను
ఇద్దరూ చెరో ప్లేస్ లో ఉండి ఎవరిలో వాళ్లే మాట్లాడుకుంటారు
ఎందుకొచ్చావ్ అని అనుపమ అంటే.. మీరే ఈ స్థితికి తీసుకొచ్చారని మను అనుకుంటాడు. బంధాలను దూరం చేసుకున్నది ఎవరు? అసలు మీరెందుకు నాపై ద్వేషం పెంచుకున్నారని మను అంటే... నీకు నిజాలు తెలిస్తే ఏమైపోతావో అని భయం అని అనుపమ అంటుంది...మీరు నన్ను ఎప్పుడూ దూరం పెడుతున్నారు ఎందుకో అర్థం కావడం లేదు అనుకుంటాడు. నా జీవితం అప్పటి జ్ఞాపకాల దగ్గరే ఆగిపోయిందని అనుపమ అనుకుంటుంది. నన్ను ఎవరు నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటని అడుగుతున్నారు ఏం చెప్పాలి? నా అనుకున్నవాళ్లు ఉన్నా ఎవ్వరూ లేరని చెప్పాలా? ఎన్నాళ్లు నాకీ మనోవేదన? నేను ఇంకొన్నాళ్లు మాత్రమే వెయిట్ చేస్తాను ఆ తర్వాత భారం దింపేసుకుంటాను అనుకుంటాడు...
Also Read: జగతి-రిషి ప్లేస్ లో అనుపమ-మను, అందర్నీ డామినేట్ చేసేసిన మను - గుప్పెడంత మనసు ఫిబ్రవరి 22 ఎపిసోడ్!
మహేంద్రకి ఫణీంద్ర కాల్ చేస్తాడు...పర్సనల్ గా కలసి మాట్లాడాలని అంటాడు.. మహేంద్ర ఎంత అడిగినా ముందు నువ్వు ఒక్కడివే రా అని కాల్ కట్ చేస్తాడు ఫణీంద్ర. మహేంద్ర ఆలోచనలో పడతాడు..
దేవయాని-శైలేంద్ర
నువ్వు సూపర్ నాన్నా...ఈ దెబ్బకి వసుధార గుండె ఆగిపోతుంది మనం ఇచ్చే షాక్ కి దిమ్మతిరిగిపోతుందని దేవయాని అంటే.. ఇప్పుడీ పరిస్థితి నుంచి తనని ఎవరు కాపాడుతారో చూద్దాం అంటాడు శైలేంద్ర. కచ్చితంగా మీ నాన్న చెప్పినదానికి బాబాయ్ ఒప్పుకుంటారు...మీ నాన్న ఒప్పుకోపోతే నేను కథలోకి ఎంటరవుతానంటుంది. వసుధార వస్తే పరిస్థితి ఏంటని శైలేంద్ర అంటే...మీ నాన్న ఆల్రెడీ చెప్పారులే బాబాయ్ ఒక్కరే వస్తారంటుంది. ఈ సారి మహేంద్ర-వసుధారకి వైరం పుట్టడం ఖాయం..ఇద్దరూ బద్దశత్రువులు అవుతారు..నువ్వు కాలేజీకి ఎండీ కావడం ఖాయం అంటుంది దేవయాని
మహేంద్ర-వసు-అనుపమ
కాలేజీకి అందరం కలసి వెళదాం అని వసుధార అంటే.. నేను అన్నయ్యని కలిసేందకు వెళుతున్నాను అంటాడు మహేంద్ర. ఎందుకు అని అడిగితే ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని రమ్మన్నారు. కాలేజీ గురించి కాదు డైరెక్ట్ గా కలసి మాట్లాడాలి అన్నారు నేను అక్కడకు వెళ్లి విషయం తెలుసుకుని కాలేజీకి వస్తానంటాడు. అన్నయ్య నన్ను ఒక్కడినే రమ్మని చెప్పాడని చెబుతాడు అదే నాక్కూడా అర్థం కావడం లేదు. అంటే ఇందులో ఏదైనా ప్రాబ్లెమ్ ఉండి ఉంటుందా అని అనుపమ అంటే...మా అన్నయ్య నాకు సమస్యలు తెచ్చిపెట్టడులే అని రిప్లై ఇస్తాడు. ఏదైనా విషయం ఉంటే ఫోన్లో చెప్పొచ్చు అలా చెప్పలేదంటే నాకేదో అనుమానంగా ఉంది మావయ్య అని వసుధార భయపడుతుంది. నేను చూసుకుంటాను మీరు కంగారు పడొద్దని ధైర్యం చెప్పి వెళతాడు మహేంద్ర...
Also Read: ఈ రోజు ఈ రాశులవారికి ఊహించనంత మంచి రోజు, ఫిబ్రవరి 24 రాశిఫలాలు
దేవయాని ఫ్యామిలీ అండ్ మహేంద్ర
ఎందుకు రమ్మన్నారు అన్నయ్యా అని మహేంద్ర అడుగుతాడు
ఫణీంద్ర: ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు..రిషి శాశ్వతంగా దూరమయ్యాడన్న నిజాన్ని నేను భరించలేకపోతున్నాను.. చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను.. రిషికి కర్మకాండలు జరిపిద్దాం మహేంద్ర...నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను నేను ఏమైనా నీ మనసు నొప్పించానా
దేవయాని-శైలేంద్ర ఆనందంగా చూస్తుంటారు మహేంద్రని...
మహేంద్ర: మీరైతే ఏ రోజూ నా మనసు నొప్పించలేదు...
రేపే రిషికి కర్మకాండలు జరిపిద్దాం అని ఫణీంద్ర అనగానే మహేంద్ర షాక్ అవుతాడు....
ఎపిసోడ్ ముగిసింది