Guppedantha Manasu February 23rd Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 23 ఎపిసోడ్)
శైలేంద్ర రెచ్చగొట్టడంతో వసుధారని ఎత్తుకెళ్లిపోయేందుకు వచ్చిన రాజీవ్ అక్కడ మనుని చూసి షాక్ అవుతాడు. మను గన్ చూపించి వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన రాజీవ్..నువ్వు DBST కాలేజీలో డైరెక్టర్ గా జాయిన్ అయ్యారని తెలిసింది అందుకే కంగ్రాట్స్ చెబుదామని అనుకుంటున్నా అంటాడు. వెళుతూ వెళుతూ...డార్లింగ్ వసూ..మళ్లీ కలుస్తా..ఇప్పుడు వీళ్లందర్నీ చూసుకుని ఎగిరిపడుతున్నావేమో వీళ్లంతా నీకు నిన్నగాక మొన్న వచ్చినవాళ్లు కానీ నేను నీ బావను, అక్క మొగుడిని..ఇప్పుడు నిన్ను తీసుకెళ్లడం కుదరడం లేదు కానీ మళ్లీ వస్తాను అప్పుడు మాత్రం వదిలిపెట్టను. ఎవరు అడ్డొచ్చిన నిన్ను తీసుకెళతానని వసుధారకు వార్నింగ్ ఇస్తాడు రాజీవ్. తన జేబులో నుంచి తాళి తీసి ఇది నీ మెడలో పడాల్సిందే అది నేను కట్టాల్సిందే అంటాడు. పెళ్లైన అమ్మాయితో పోరంబోకులా బిహేవ్ చేస్తున్నావ్ అని మహేంద్ర మండిపడితే...బయటకు పో అని మను గట్టిగా అరుస్తాడు. నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావ్...మొన్నంటే తగ్గాను కానీ ప్రతిసారీ తగ్గను ... నా టైమ్ వస్తుంది అప్పుడు ఈ రాజీవ్ అంటే ఏమిటో చూపిస్తా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటూ మనుకి రివర్స్ లో వార్నింగ్ ఇస్తాడు. నేనూ చూస్తా అని రివర్స్ లో వార్నింగ్ ఇస్తాడు మను...
Also Read: జగతి-రిషి ప్లేస్ లో అనుపమ-మను, అందర్నీ డామినేట్ చేసేసిన మను - గుప్పెడంత మనసు ఫిబ్రవరి 22 ఎపిసోడ్!
శైలేంద్ర-రాజీవ్
వసుధారను తీసుకొచ్చేస్తానని వెల్లిన రాజీవ్...పని సక్సెస్ అయ్యిందో లేదో అని శైలేంద్ర తెగ టెన్షన్ పడుతుంటాడు. అసలేం జరిగిందో అనుకుంటూ కాల్ చేసినా కానీ రాజీవ్ చికాకుగా ఉండడంతో కాల్ కట్ చేస్తాడు. మళ్లీమళ్లీ ఫోన్ చేస్తూనే ఉంటాడు శైలేంద్ర. కాల్ లిఫ్ట్ చేసిన రాజీవ్ పై ఫైర్ అవుతుంటే..రాజీవ్ రివర్స్ అవుతాడు. అవసరం నాది కాబట్టి తగ్గాల్సిందే అనుకున్న శైలేంద్ర...కూల్ గా మాట్లాడుతూ అక్కడేం జరిగిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
రాజీవ్: నీకు నాకు కామన్ శత్రువు ఒకడు ఉన్నాడు కదా. వాడే వసుధారను నేను తీసుకురాకుండా అడ్డుకున్నాడు. రిషి కంటే మను డేంజర్‌లా ఉన్నాడు. రిషి అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాడు. కానీ మనును చూస్తేనే భయమేస్తుంది. ఏం చేయాలో కూడా తెలియక వెనకడుగు వేసి వచ్చాను
శైలేంద్ర : వాడు అక్కడేం చేస్తున్నాడు..మనును ఏదో ఒకటి చేసి వసుధారను తీసుకురావాలి గదా. అసలు నీకు బుద్ది ఉందా
రాజీవ్ : అసలు నీ బుద్ధి ఏమైంది. నువ్వు ఎందుకు మనును ఏం చేయడం లేదు. వాడిని తప్పిస్తే నీకు నాకు టెన్షన్ ఉండదు. నువ్వు ఎందుకు మనుకు భయపడుతున్నావు
శైలేంద్ర: తడబడిన శైలేంద్ర...నువ్వు ఎందుకు అలా చేయకుండా ఆగిపోయావో నేను అందుకే ఆ పని చేయలేకపోయాను
రాజీవ్: వసును పెళ్లిచేసుకోవాలన్నదే నా ఆశయం..ఎలాగైనా ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోతాను. త్వరలోనే నీకు గుడ్ న్యూస్ చెబుతాను అంటూ కాల్ కట్ చేస్తాడు
అసలు మను ఎవరు? వసుధార ఫ్యామిలీతో తనకి ఉన్న సంబంధం ఏంటి? అతడికి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచించడం కూడా టైమ్ వేస్ట్... కేవలం ఎండీ సీట్ పై మాత్రమే ఫోకస్ చేయాలి అనుకుంటూ మరో ప్లాన్ వేస్తాడు...
Also Read: నిన్న కాలేజ్‌కి ఇప్పుడు ఇంటికి - దూసుకుపోతున్న మను - రాజీవ్ కి చెక్!
మహేంద్ర, మను, వసుధార, అనుపమ డిన్నర్ చేయడానికి రెడీ అవుతారు. మను తనకు తానే వడ్డించుకోవడానికి సిద్ధమవుతాడు. అనుపమను వడ్డించమని చెబుతాడు. ఇవన్నీ నీ ఫేవరేట్ కర్రీస్ కదా మొహమాటపడకుండా తినమని అంటాడు.
మహేంద్ర: నిన్ను చూడగానే రాజీవ్ ఎందుకు అలా వణికిపోయాడు
వసు: ఇంతకుముందు నన్ను రాజీవ్ ఏడిపించబోతే మను వార్నింగ్ ఇచ్చారు
మహేంద్ర: రాజీవ్ విషయంలో జాగ్రత్తగా ఉండమ్మా
మను: ఎవరికో భయపడి వసుధార మారాల్సిన అవసరం లేదని, తను ఎప్పటిలానే ఉండొచ్చు
మను మాట్లాడుతుండగా పొలమారుతుంది. దాంతో అనుపమ కంగారు పడుతుంది. ఛైర్‌లో నుంచి లేచి మను తలపై తట్టి వాటర్ తాగిస్తుంది. అన్నంతినేముందు మాట్లాడకూడదని తెలియదా. చూడు ఎంతలా పొలమారిందో అంటుంది. వారిద్దరిని చూసి మహేంద్ర, వసుధార షాకవుతారు. తనకు పొలమారితే నువ్వెందుకు కంగారు పడుతున్నావు. ఏదో సొంత మనిషికి ఇబ్బంది ఎదురైనట్లు అని అనుపమను అడుగుతాడు మహేంద్ర. అనుపమ సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. అంతలా పొలమారిందంటే నిన్ను ఎవరు తలచుకుని ఉంటారని మహేంద్ర అంటాడు
మను: నన్ను తలచుకునేవాళ్లు ఎవరు లేరు
ఆ మాటలు విని అనుపమ ఎమోషనల్ అవుతుంది. అన్నం కూడా తినకుండా ఆగిపోతుంది. ఇంకెప్పుడూ అలా అనకు మను. నీకు మేము ఉన్నామని మనుకు మాటిస్తాడు మహేంద్ర. ఇలా అందరితో కలిసి ఎప్పుడూ తినలేదని, రోజు ఒంటరిగానే భోజనం చేస్తుంటానని మహేంద్రతో చెబుతాడు మను.
Also Read: ఈ శనివారం మాఘ పౌర్ణమి - మీ రాశిప్రకారం ఇవి దానం చేస్తే మంచిది!
పెద్దమ్మ-అనుపమ
ఆ తర్వాత పెద్దమ్మ... అనుపమకి కాల్ చేస్తుంది. కొంప ముంచావ్ అంటూ అరుస్తుంది అనుపమ. మను డిన్నర్ కోసం ఇక్కడకు వస్తున్న విషయం ఎందుకు చెప్పలేదని ఫైర్ అవుతుంది. వాడు భోజనానికి ఒకరి ఇంటికి వెళుతున్నాడంటే నువ్వో మాటన్నావ్ గుర్తుందా అని అడుగుతుంది పెద్దమ్మ. భోజనానికి వెళితే వెళ్లమను అక్కడే ఉండిపోమను అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది అనుపమ ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది