Guppedantha Manasu February 21st Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 21 ఎపిసోడ్)
దేవయానితో కొట్టించుకుంటున్న శైలేంద్రని చూసి ధరణి అవాక్కవుతుంది. వెళ్లి దేవయానిపై చేయెత్తుతుంది. నన్ను కొడదాం అనుకుంటున్నావా అని దేవయాని అడిగితే...భర్తని కొడుతుంటే అడ్డుకోకుంటే తనపై ప్రేమ లేదంటారని అందుకే అడ్డుకున్నానంటుంది. కాసేపు సరదాగా సమాధానాలిస్తూ దేవయాని-శైలేంద్రతో ఆడుకుంటుంది. ఆ తర్వాత కాఫీ తెస్తానంటూ ధరణి వెళ్లిపోతుంది. ఇంతకీ ఏం జరిగిందని దేవయాని అడిగితే కాలేజీలో మను ఎంట్రీ గురించి మొత్తం చెబుతాడు. నేనేంటో చూపిస్తా..వాళ్ల సంగతేంటో చూస్తా అనుకుంటాడు...
కాలేజీలో మను
కాలేజీలో మను పేపర్స్ చూస్తుంటాడు. ఇంతలో మహేంద్ర క్యాబిన్ కి వస్తాడు. చెప్పండి సార్ అని మను అంటే క్యాబిన్ కంఫర్ట్ గానే ఉందికదా అని మహేంద్ర అంటే బానే ఉంది అంటాడు...
మహేంద్ర: నీకు ఇంతకుముందే రిషి తెలుసా
మను: పరిచయం ఉంది సర్ కానీ చెప్పలేను అనుకుంటాడు..ఇంతకీ అనుపమ మేడం మీకేం అవుతారు
మహేంద్ర: నా ఫ్రెండ్ అనుపమ..నా భార్య జగతి...మేం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అనుపమ, జగతి గురించి మనుకి చెబుతాడు. అయినా నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా మాటల్లో పెడుతున్నావా... అనుపమ తో పరిచయం ఉందా?
మను: మీకెందుకు మా ఇద్దరి మధ్యా గతం ఉన్నట్టు అనిపించింది..
మహేంద్ర:మీ ఇద్దర్నీ చూస్తుంటే అలా అనిపించింది...
మను: అనుపమ మేడంని అడిగితే చెబుతారు కదా అని మాట దాటేస్తాడు
మహేంద్ర:మీ ఇద్దరి మధ్యా గతం ఉందని నాకు అనిపిస్తోంది కచ్చితంగా తెలుసుకుంటాను అనుకుంటాడు...డిన్నర్ కి రావాల్సిందే అని చెప్పేసి మహేంద్ర వెళ్లిపోతాడు...
Also Read: నేను బరిలోకి దిగితే నా ఎదురు నిలబడాలంటే వణుకు పుడుతుంది - మరో రిషిలా ఉన్న మను!
వసుధార
కాలేజీ బోర్డ్ మీటింగ్ లో జరిగిన డిస్కషన్ గుర్తుచేసుకుంటుంది వసుధార.. ఇతను ఎవరో కానీ తెలివిగా మాట్లాడుతున్నారు, గేమ్ ఆడుతున్నారు...మనుని మంచివాడు అని మావయ్య, ఫణీంద్ర సర్ నమ్మారు కానీ నేను నమ్మను. ఆ భద్ర కూడా అంతే మేం ప్రమాదంలో ఉన్నప్పుడు సేవ్ చేసినట్టు కలర్ ఇచ్చాడు ఆ తర్వాత తన నిజస్వరూపం బయపడింది..లేకపోతే ఎలాంటి సంబంధం లేకుండా డబ్బులు ఎందుకు ఇచ్చాడు? ఏ పదవిపై కాంక్షలేదని చెప్పి ఇప్పుడు బోర్డ్ డైరెక్టర్ గా ఉండాలని ఎందుకు అనుకుంటాడు...నేను అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పడం లేదు, రిషి సర్ మాట చెప్పి మాట దాటేస్తున్నాడు...నా వీక్ నెస్ తెలుసుకుని బిహేవ్ చేస్తున్నాడు...తన మనసులో ఏముంది? తన గురించి నిజం తెలిస్తే కానీ ఎలాంటి స్టెప్ తీసుకోలేం...అందుకే తనని ప్రతిక్షణం గమనించాలి అనుకుంటుంది...
ధరణి-శైలేంద్ర
శైలేంద్ర దెబ్బలకు ధరణి వెన్నపూస రాస్తుంటుంది..అయినా మిమ్మల్ని మీరు కొట్టుకోవడం ఎందుకని ధరణి అంటే అదంతే అంటాడు. ఆ తర్వాత మను గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తుంది ధరణి...కాలేజీలో ఇన్ని జరుగుతుంటే నాకు చెప్పరేంటి అంటుంది.
శైలేంద్ర: అయినా నీకు అన్నీ ముందే తెలిసి పోతుంటాయి కదా..ముందే గెస్ చేసి చెబుతావ్ కదా....నాకు ఎండీ సీట్ రాదని ముందే చెప్పావ్ కదా..నీకు జాతకాలు చెప్పడం తెలుసు అనుకుంటా..ఓసారి నా జాతకం చూసి కాలేజీకి ఎవరెవరు వస్తారో చెప్పు
ధరణి: అలా ఎలా చెబుదాం
శైలేంద్ర: నా చేయి చూసి చెప్పు...
ధరణి: మీకు ఆయుష్షు గట్టిగానే ఉంది కానీ లైఫే దరిద్రంగా ఉంది
శైలేంద్ర: నువ్వు ఇంకా నన్ను ఎన్నిరోజులు టార్చర్ చేస్తావ్...అయినా నా లైఫ్ లో రిషి ఉన్నాడా లేడా చెప్పు?
ధరణి: రిషి బ్రతికే ఉన్నాడండీ
శైలేంద్ర: పోలీసులు వాడు చచ్చిపోయాడని చెబుతుంటే బతికే ఉన్నాడని అంటావేంటి
ధరణి: మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది రిషి అని రాసుంది...గీతల్లో కనిపిస్తోంది..
శైలేంద్ర: అసలు నేను ఎండీ అవుతానా లేదా?
ధరణి: మీ ఆ యోగమే లేదండీ...మీకు ఈ జన్మలో ఎండీ పదవి దక్కే భాగ్యమే లేదు..
శైలేంద్ర: నా పరిస్థితి చూసి అయినా జాలిపడి చెప్పొచ్చుగా..చేతుల్లో వెన్నపూస ఉంది కానీ మాటల్లో కారం ఉందంటాడు..
ఇంతలో ఓ మెసేజ్ వచ్చింది..చూడు అంటాడు..నమస్తే భయ్యా అని ఉంది..ఎవరీ భయ్యా అంటుంది ధరణి... నాక్కూడా ఈ మధ్యే పరిచయం అయ్యాడులే అనేసి ఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు శైలేంద్ర...
Also Read: నాలుగు రోజుల జాతరలో ఏ రోజు ఏం చేస్తారు - మూడోరోజు ఎందుకు ప్రత్యేకం!
అనుపమ-పెద్దమ్మ
పెద్దమ్మకి కాల్ చేసిన అనుపమ ఫైర్ అవుతుంది. అసలు నువ్వు వాడిని కాలేజీకి ఎందుకు పంపించావ్..నువ్వు చెప్పడం వల్లే కదా వాడు ఇక్కడికి వచ్చాడని అనుపమ అంటే..నేను సమస్య చెప్పాను కానీ కాలేజీకి వెళ్లమని చెప్పలేదు..అలా అంటే నువ్వే కారణం నువ్వు సమస్య చెప్పడం వల్లే అక్కడకు వచ్చాడంటుంది. అసలు వాడు ఎందుకొచ్చాడంటూ ఫైర్ అవుతుంది. మను రావడం వల్ల సమస్యలు సాల్వ్ కావడం లేదు కానీ కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయి... వాడు ఇరిటేట్ చేస్తాడా- మీరు ఇరిటేట్ అవుతున్నారా? క్లారిటీ ఉందా అంటుంది. వాడు ఇంట్లో ఉన్నాడా అని అనుపమ అడుగుతుంది...ఎవరో భోజనానికి పిలిచారంట బయలుదేరుతున్నాడు అని చెబుతుంది పెద్దమ్మ. ఇక్కడి వాడికి తెలిసిన వాళ్లు ఎవరున్నారంటుంది...ఎవరో మరి అని పెద్దమ్మ అంటే వెళితే వెళ్లనీ అక్కడే ఉండమను అని కోపంగా కాల్ కట్ చేస్తుంది...
శైలేంద్ర-రాజీవ్
ఏంటి రమ్మని మెసేచ్ చేశావ్ అని శైలేంద్ర అంటే...నువ్వేంటి తేడాగా ఉన్నావ్ అని రాజీవ్ అడుగుతాడు. కొంపతీసి మనుగాడు కొట్టాడా అని అడిగితే కొట్టాడు అంటాడు. నిన్నుకూడా కొట్టాడా అంటే ఏం నిన్ను కొట్టాడా అంటే గన్ తో బెదిరించాడని చెబుతాడు. కాలేజీలో బోర్డ్ మెంబర్ గా జాయిన్ అయిన విషయం చెబుతాడు. అయితే నీకు రోజూ చుక్కలే అన్నమాట అని ఎగతాళి చేస్తాడు రాజీవ్. మొన్న లాస్ట్ మినిట్లో వాడు రాకపోతే ఎండీ సీట్ నాచేతిలో, వసుధార నీ చేతిలో ఉండేదన్న శైలేంద్ర...ముందు మనుగాడిని అడ్డు తప్పించాలని అంటాడు. వసుధారని నువ్వు దక్కించుకోలేవా నువ్వేదో పోటుగాడివి అని మమ్మీ చెప్పింది అదంతా ఉట్టిదేనా - వసుధారని తీసుకెళ్లడం నీకు చేతనవుతుందా లేదా అని రెచ్చగొడతాడు. ఇప్పుడే వెళ్లి నా వసుని నేను తెచ్చుకుంటాను అని ఛాలెంజ్ చేస్తాడు రాజీవ్....
Also Read: ఈ రాశులవారు కార్యాలయ ఒత్తిడిని ఇంటికి మోసుకురావొద్దు - ఫిబ్రవరి 21 రాశిఫలాలు