Guppedantha Manasu February 20th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 20 ఎపిసోడ్)


శైలేంద్ర కుట్రలకు చెక్ పెట్టేందుకు కాలేజీలో అడుగుపెడతాడు మను. అందుకే బోర్డ్ మెంబర్ గా ఉండాలని అనుకుంటాడు. మహేంద్ర కరెక్ట్ గానే గెస్ చేస్తాడు కానీ వసుధార మాత్రం మనుని నమ్మదు. తను మనసులో ఏదో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని అనుకుంటుంది. శైలేంద్ర కూడా తట్టుకోలేక మరింత రచ్చ చేస్తుంటాడు. మినిస్టర్ కూడా మనుని నమ్మొచ్చని చెప్పి మీరంతా కలసి ఓ నిర్ణయం తీసుకోండి..మీరంతా తీసుకున్న నిర్ణయమే ఫైనల్..మనుని బోర్డ్ లో చేర్చుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం అంటాడు. 
బోర్డ్ మెంబర్స్: మను డైరెక్టర్ గా ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ సంబంధం లేకుండా చేజారిపోతున్న కాలేజీని కాపాడారు..ఇకపై మంచి చేస్తారనే నమ్మకం ఉంది
శైలేంద్ర: 50 కోట్లు ఇస్తే అర్హత ఉన్నట్టేనా..ఇప్పుడు బోర్డ్ మెంబర్ కావాలి అనుకుంటున్నాడు రేపు ఎండీ సీట్ అడిగితే ఇచ్చేస్తారా?
మినిస్టర్: మను డైరెక్టర్ గా ఉండడం నీకు ఇష్టం లేదా
శైలేంద్ర: అవసరం లేదు
మను: మీకు అవసరం లేకపోతే నాక్కూడా లేదు..ఇప్పుడున్న పరిస్థితి కన్నా కాలేజీ మరింత పతనం అయితే నా 50 కోట్లు ఎవరిస్తారు? మీరు ఇస్తానంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను
ఫణీంద్ర: వాడి దగ్గర 50 రూపాయలు కూడా ఉండవు..అయినా మను నీకు మాకు ఎలాంటి పరిచయం లేదు అయినా 50 కోట్లు ఇచ్చి కాలేజీ కాపాడావు..నువ్వు చెప్పింది నిజమే మను..ఎవరో తెలియదు కానీ డీబీఎస్టీ కాలేజీని పతనం చేయాలని చూస్తున్నారు..రిషి ఉన్నప్పుడు ఎవ్వరూ కాలేజ్ గేట్ దాటి వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఓ సమస్య సాల్వ్ చేస్తే మరో సమస్య సృష్టిస్తున్నారు నువ్వు మాకు సపోర్ట్ గా ఉండి కాలేజీ సమస్యను సాల్వ్ చేయాలి..మను డైరెక్టర్ గా ఉండడం నాకు ఇష్టమే...
మహేంద్ర: నాక్కూడా ఇష్టమే అన్నయ్యా..కానీ వసుధార ఏమంటుందో...
మినిస్టర్: వసుధారా నీ అభిప్రాయం ఏంటి
వసుధార: మనసులో వంద సందేహాలతో...మీ ఇష్టం సార్ అనేస్తుంది...
శైలేంద్రలో కంగారు పెరిగిపోతుంది..ఇష్టం అంటే ఏంటి కొంత అర్థమయ్యేలా చెప్పు వసుధారా అంటాడు..మను డైరెక్టర్ గా ఉండడం నాకు సమ్మతమే అంటుంది...
అనుపమ మాత్రం రకరకలా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంటుంది...ఏమీ మాట్లాడదు...
నాకు వర్క్ ఉంది నేను వెళతాను అనేసి వసుధార మీటింగ్ నుంచి లేచి వెళ్లిపోతుంది...
శైలేంద్ర రగిలిపోతుంటాడు....


Also Read: శైలేంద్ర కుట్రను ఆధారాలతో బయటపెట్టిన మను - వసుధార ప్రశ్నలకు అనుపమ ఉక్కిరిబిక్కిరి!


బోర్డ్ మీటింగ్ నుంచి లేచి బయటకు వెళుతుండగా మనుని పిలుస్తాడు శైలేంద్ర...
శైలేంద్ర: నువ్విచ్చే షాకులకు బీపీ పెరిగిపోతోంది..ఎవడ్రా నువ్వు..ఎందుకు మా కాలేజీకి వచ్చావ్
మను: కాలేజీని కాపాడేందుకు అని చెప్పాను కదా
శైలేంద్ర: ఇదేమైనా సంతలో దొరికే వస్తువా..ఇది నా కలల సామ్రాజ్యం..నేనేదో చిన్న చిన్న ప్లాన్స్ వేసి కాలేజీని నా సొంతం చేసుకోవాలని చూస్తుంటే నువ్వు అన్నీ ఫెయిల్ చేస్తున్నావ్. ఆ ఎండీ సీట్ కోసం నేను ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు చేశానో తెలుసా నీకు నా గురించి తెలీదు.. నేను సైలెంట్ గా ఉన్నానని నువ్వు రెచ్చిపోతే నాలో రాక్షసుడు బయటకు వస్తాడు..నువ్వు ఈ శైలేంద్ర ని ఓవైపే చూశావ్.. మరోవైపు చూస్తావా..
మను: అవసరం అయితే అది కూడా చేస్తాను
శైలేంద్ర: ముందు చెక్ ఇచ్చావ్..ఆ తర్వాత చింపేశావ్..ఇప్పుడు డైరెక్టర్ గా తిష్టవేశావ్..నీక్కూడా ఎండీ సీట్ కావాలా - వసుధార కావాలా?
లాగిపెట్టి కొడతాడు మను...
శైలేంద్ర: నన్నే కొడతావా..నాతో పెట్టుకున్న వారు ఎవ్వరూ భూమ్మీద లేరు..చూస్తుండు నీ అంతు తేలుస్తా...
మను: నీ కల కలగానే మిగిలిపోతుంది..నీకు ఆ ఎండీ సీట్ దక్కకుండా చేస్తాను
ఆవేశంతో శైలేంద్ర..మనుని కొట్టబోతాడు...అడ్డుకున్న మను...నేను బరిలోకి దిగితే నా ఎదురు నిలబడాలంటే వణుకు పుడుతుందంటాడు. నీ అంతు చూస్తానని శైలేంద్ర అంటే...అంతవరకూ వస్తే నువ్వు కాలేజీ పరిసరాల్లో కనిపించకుండా చేస్తానంటాడు... అక్కడి నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర....
అక్కడున్న అనుపమను చూసి ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు.. కొన్ని తెలుసుకోవాలని అన్న అనుపమ..ఎందుకిలా చేస్తున్నావని అడుగుతుంది. నావల్ల మీకు ఎలాంటి సమస్యా ఉండదు..తొందర్లో అన్నీ తెలుస్తాయనేసి వెళ్లిపోతాడు మను....


Also Read: జయ ఏకాదశి - ఈ రోజు ఇలాచేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి!


అసలు మనుని డైరెక్టర్ గా ఉండేందుకు ఎందుకు ఒప్పుకున్నాను అనుకుంటూ కోపంగా పేపర్లు విసిరేస్తుంది...అప్పుడే అక్కడకు వస్తాడు మను.  ఎందుకొచ్చారని ఫైర్ అవుతుంది...మీరు రమ్మన్నారు కదా మాట్లాడాలి అన్నారు కదా అని గుర్తుచేస్తాడు.. వసుధార మాత్రం కోపంగానే మాట్లాడుతుంది.  ఉదయం నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ తీరిపోయాయ్..నాకొక క్లారిటీ వచ్చేసింది..సో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటుంది.
మను: ఉదయం అనుమానం ఉండి ఇప్పుడు క్లారిటీ రావడం ఏంటి
వసు: మనుషుల ప్రవర్తన ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది కదా..అందుకే క్లారిటీ వచ్చింది అంటున్నా
మను: నా గురించి మీరు తప్పుగా అనుకోవడం సరికాదేమో..మీరు చూసింది, విన్నది అబద్ధం అయి ఉండొచ్చు...అదేదో మాట్లాడి క్లియర్ చేసుుంటే మంచింది...
వసు: నాకు మాట్లాడే అవసరం లేదు
మను: కానీ నాకు ఉందంటూ కూర్చుంటాడు... ఎదురుగా ఉన్న ఎండీ సీట్ ఖాళీగా కనిపించడం చూసి అదెప్పుడూ ఖాళీగా ఉంచుతారంట..ఎందుకలా ఉంచుతారు?
వసు: అది రిషి సర్ ది..శ్రీరాముడి పాదుకలు సింహాసనంపై పెట్టి భరతుడు పాలించినట్టు నేను కాలేజీని చూసుకుంటున్నాను. అవకాశాలు చూసుకుని పదవులు పొందే వ్యక్తి కాదు, కొంతమందిలా ఎదుటివారి బలహీనతలు ఆసరా చేసుకుని పైకి ఎదిగేవారు కాదు, రిషి సర్ తన కష్టాన్ని, తెలివితేటల్ని, ప్రతిభను నమ్ముకుని ఈ కాలేజీని ఈ స్థాయికి తీసుకొచ్చారు...అదీ రిషి సర్ గొప్పతనం..అలాంటి ఆయన పక్కన ఉండడం కాదు నా గుండెల్లో ఉంటారు..ఇప్పుడు నేను చేసే ప్రతి పని రిషి సర్ ఆశయం కోసం చేసేదే...
మను: అంటే మీరు నన్ను డైరెక్టర్ గా అంగీకరించారు కదా అది కూడా రిషి సర్ మాటే కదా..థ్యాంక్యూ మేడం వెళ్లొస్తాను...


Also Read: ఈ రాశులవారు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి 


దేవయాని-శైలేంద్ర
శైలేంద్ర రెండు బెల్టులు పట్టుకుని ఒకటి సెలెక్ట్ చేసుకుని కొట్టుకుంటూ ఉంటాడు... దేవయాని వచ్చి ఆపుతుంది. నువ్వు కొడతావా కొట్టుకోమంటావా అంటే..నువ్వు గట్టిగా కొట్టుకుంటావ్ అని దేవయాని కొడుతుంది. ఇంతలో ధరణి వచ్చి అత్తయ్యగారూ అని గట్టిగా అరుస్తుంది...
మా ఆయన్నే కొడతారా అని బెల్ట్ తీసుకుంటుంది...
దేవయాని: నేను వాడిని కొట్టడం ఏంటే వాడే నన్ను కొట్టమన్నాడు... నా చేతులు రాకపోయినా వాడి బాగుకోసం కొట్టాల్సి వచ్చింది
ధరణి: మీకు ఒళ్లు తిమ్మిరెక్కిందా...
శైలేంద్ర: ఫ్రష్ట్రేషన్లో ఉన్నాను
ధరణి: ఇదే ఫ్రస్ట్రేషన్ పోయేకాలం కాకుండా.. అయినా మీరేంటి ఆయన కొట్టమంటే కొట్టేయడమేనా
దేవయాని: అయినా నువ్వేంటే...నన్ను కొట్టేందుకు చేయెత్తావ్...
ధరణి: మీరు ఆయన్ని కొడుతున్నారనే అలా చేశాను...లేదంటే భర్తపై ప్రేమ లేదంటారు కదా...