గుప్పెడంతమనసు ఫిబ్రవరి 22 ఎపిసోడ్ (Guppedanta Manasu February 22th Update)
సడెన్ గా మీటింగ్ పెట్టిన రిషి..మన ప్రాజెక్ట్ హెడ్ వసుధార గారు మాట్లాడతారు అంటాడు. అది విని జగతి-మహేంద్ర గుసగుసలాడుకుంటారు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారని జగతి అంటే..నాకు ఇలాంటి వేరియేషన్స్ చూడడం అలవాటే అంటాడు మహేంద్ర. వసు నిలబడి మాట్లాడుతుండగా..మీరు కూర్చుని మాట్లాడొచ్చు అంటాడు రిషి.
వసు: సడెన్ గా మీటింగ్ పెట్టారు..మాట్లాడేందుకు టెన్షన్ గా ఉందని తడబడుతూ ఉంటుంది. ఇంతలో రిషి లాప్టాప్ ఓపెన్ చేసి ఆల్ ద బెస్ట్ మిషన్ ప్రాజెక్టు హెడ్ గారు అని మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసిన తర్వాత ఆహా ల్యాప్ టాప్ లోంచి మెసేజ్ చేస్తున్నారు అనుకుంటుంది.
రిషి: వసు ఇబ్బంది గమనించిన రిషి.. మీటింగ్ లో ఏం మాట్లాడాలో వరుసగా మెసేజెస్ చేస్తూ ఉంటాడు..అవి చూసి మాట్లాడుతుంటుంది వసుధార.
మీటింగ్ అయిపోతుంది..
అప్పుడు వసుధార దగ్గరికి వచ్చిన రిషి..కంగ్రాట్స్ MH గారు చాలా బాగా మాట్లాడారు అని అంటాడు. ఎంహెచ్ అంటే ఏంటి రిషి అని మహేంద్ర అనడంతో మిషన్ ప్రాజెక్టు హెడ్ కదా డాడ్ అని అంటాడు.
వసు: థాంక్యూ ఎండి గారు
రిషి: థ్యాంక్స్ నాకెందుకు
వసు: ఐడియా ఇచ్చారు కదా అని
ఆ తర్వాత వసుధార నడుచుకుంటూ వెళుతుండగా జగతి ఎదురుపడి మీటింగ్లో మంచి మంచి విషయాలు చెప్పావు చాలా బాగా మాట్లాడావు అని అంటుంది. ఇందులో మీ అబ్బాయి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మేడం
జగతి: ఎమ్ హెచ్ అంటే ఏంటి
వసుధార చెప్పబోతుండగా ఇంతలో రిషి అక్కడికి రావడంతో జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Also Read: మీరు నా 'MD' (మై డార్లింగ్), నేను మీ MH అంటూ రిషికి మరో ఫజిల్ వదిలిన వసు
రిషి తన క్యాబిన్ లోకి వెళ్లి కార్ కి కనిపించడం లేదు అని వెతుకుతూ ఉంటాడు. మరోవైపు వసుధార కారులో హాయిగా కూర్చుని కార్ కీస్ తో ఆడుకుంటూ ఉండగా
రిషి:చెప్పకుండా కార్ కీస్ తీసుకుని వచ్చావేంటి
వసు:కారులో కూర్చోవాలంటే కార్ కీస్ కావాలి కదా
రిషి:కార్ దిగు
వసు:నేను దిగను సార్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి
రిషి:నేను డ్రాప్ చేయను
వసు: లిఫ్ట్ ఇవ్వకపోతే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు
రిషి:నువ్వేంటి బెదిరిస్తున్నావు
ఇద్దరూ కాసేపు ఫన్నీగా వాదించుకుంటారు...
Also Read: ఫిబ్రవరి 22 రాశిఫలాలు, ఈ రాశివారు చుట్టూ రాజకీయాల జరుగుతున్నాయి జాగ్రత్త
చక్రపాణి ఇంటికి వెళుతుంది దేవయాని
దేవయాని: ముగ్గురు ఆడపిల్లల తండ్రివి నీకు కనీసం మర్యాద కూడా తెలియదా . నేను నువ్వు ఇచ్చే మర్యాదల కోసం రాలేదు మీ వసుధారని మా రిషి మీదకు ఎందుకు ఉసిగొల్పావు
చక్రపాణి: సీరియస్ అవుతూ ఏంటండీ ఏం మాట్లాడుతున్నారు ఉసిగొల్పాను అంటున్నారు.. అసలు నా నిజ స్వరూపం మీకు తెలియదు
దేవయాని: రిషిని పెంచి పెద్ద చేశాను
చక్రపాణి: అందుకే ఇంతవరకూ మౌనంగా ఉన్నాను
దేవయాని: డబ్బు కావాలంటే మొఖానవిసిరి కొడతాను తీసుకుని వెళ్లిపోండి
చక్రపాణి: నీ కళ్ళకు ఎలా కనిపిస్తున్నాను. మా పరువు గురించి నీకు తెలుసా
దేవయాని: అమ్మాయిని ఎరవేస్తున్నావ్ నీకు పరువు ఏంటి
చక్రపాణి: నోరు మూయండి...
దేవయాని: షాక్ అయిన దేవయాని..మర్యాదగా మాట్లాడు
చక్రపాణి: ఇంటికి వచ్చావని ఆగాను..నా ముందే నా కూతుర్ని అన్నేసి మాటలంటుంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంకోసారి ఈ ఇంటివైపు కన్నెత్తి చూస్తే ఈ చక్రపాణి విశ్వరూపం చూస్తావ్
దేవయాని: నా గురించి నీకు తెలియదు
ఇంతలో అక్కడకు వచ్చిన రిషి.. పెద్దమ్మా మీరేంటి ఇక్కడ..మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు. ఎవ్వరూ మాట్లాడకుండా ఉండడంతో పెద్దమ్మ మళ్లీ ఏదో గొడవ చేసే ఉంటారు అనుకుంటూ అక్కడి నుంచి దేవయానిని తీసుకెళ్లిపోతాడు. దేవయాని మేడం ఇక్కడకు ఎందుకొచ్చింది అనుకుంటుంది వసుధార
రిషి-దేవయాని కార్లో వెళుతుంటారు
దేవయాని: సరిగ్గా నేను వెళ్లినప్పుడు రిషి అక్కడకు రావాలా..దొరికిపోయాను..ఇప్పుడేం అంటాడో.. అయినా రిషి ఏమీ మాట్లాడడం లేదేంటి అనుకుంటుంది
ఇంతలో రిషికి వసుధార నుంచి థ్యాంక్యూ అని మెసేజ్ వస్తుంది.. దేనికి అని రిషి అడిగితే అన్నింటికీ అంటుంది. అంటే అని రిషి అడిగితే..కలిసినప్పుడు చెబుతానని రిప్లై ఇస్తుంది.. ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం చూసి.. ఎవరు రిషి అని అడుగుతుంది దేవయాని...వసుధార అని చెప్పడంతో షాక్ అవుతుంది
రిషి: వసుధారకు- నాకు మధ్య కాలేజీ పరంగా చాలా ఉన్నాయి పెద్దమ్మ మీరు ఇక్కడ వరకు రాకుండా ఉండాల్సింది
దేవయాని: నేను నీకోసమే వెళ్లాను
రిషి: మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి. నాకు వసుధారకు మధ్య ఎవరైనా ఉంటే నాకు నచ్చదు నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను
రిషి మాటలు విని దేవయాని షాక్ అవుతుంది
ఇంట్లో ధరణి వంట చేస్తుండగా..దేవయాని అక్కయ్య ఎక్కడికి వెళ్లారో తెలియదు అని జగతి అంటుంది. వదిన బయటకు వెళ్లిందంటే ఎవరికో మూడినట్టే అంటాడు మహేంద్ర...