గుప్పెడంతమనసు ఫిబ్రవరి 21 ఎపిసోడ్ (Guppedanta Manasu February 21th Update)
నువ్వు ఫోన్ చేస్తావా నాకు తెలుసు వసుధార అని అనుకుంటాడు. అటు వసుధార మాత్రం నేను మీకు ఫోన్ చేస్తాను ఎందుకంటే మీరు నా మీద కోపంగా ఉన్నారు. మీ మీద నాకు ప్రేమ ఉంది అనుకుంటుంది. రిషి కావాలనే కట్ చేస్తే మళ్లీ కాల్ చేస్తుంది వసుధార. కాల్ లిఫ్ట్ చేసిన రిషి..నాకు నిద్ర వస్తోంది మిషన్ ఎడ్యుకేషన్ గురించి మార్నింగ్ మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేద్దాం అనుకుంటే..వసుధార ఆ ఛాన్స్ ఇవ్వదు. మళ్లీ కట్ చేసినా కాల్ చేస్తుంది. రిషి విసుక్కుంటాడు. అది కాదు ఎండి గారు అనగానే ఈ టైంలో ఎండి గారు అనడం అవసరమా అంటాడు రిషి. ఫోన్ కట్టవడంతో గుడ్ నైట్ చెబుతూ మెసేజ్ చేస్తుంది.
Also Read: 'ఆ తాళి తియ్యగలవా వసుధార'? ప్రశ్నల వర్షం కురిపించిన రిషి- కొడుకుని సమర్థించిన జగతి
మర్నాడు ఉదయం కాలేజీకి వెళ్లిన తర్వాత రెగ్యులర్ గా రిషి-వసు కూర్చునే చెట్టువైపు చూసి జగతి బాధపడుతుంది. మహేంద్రకి అదే చెబుతుంది.
జగతి: రిషి మన కంటే ముందుగా బయలుదేరాడు ఇంకా రాలేదు
మహేంద్ర: నువ్వేం టెన్షన్ పడకు ఎక్కడో పని ఉండి ఆగి ఉంటాడులే
ఆ తర్వాత రిషి కార్లో వెళ్తుండగా వసుధార కారుకి అడ్డంగా నిల్చుంటుంది. కారుకి అడ్డంగా నిల్చుంది ఎందుకో అని రిషి అనుకుంటే...తీసుకెళ్లకుండా తనదారిన తాను వెళ్తారని తెలిసే ఇలా అడ్డంగా నిల్చున్నా అనుకుంటుంది. ఇంతలో వెనుక నుంచి కారు వచ్చి హారన్ కొట్టడంతో చేసేది లేక..వచ్చి కూర్చోమన్నట్టు కారు డోర్ తీస్తాడు. వెళ్లి కూర్చుంటుంది వసుధార. కాలేజీకి స్టార్ట్ అవుతారు.. చేసిందంతా చేసి నన్ను ఇరకాటంలో పెట్టేసింది...రివర్స్ లో నాపై అలుగుతోంది ఏంటి అని రిషి అనుకుంటే..నేను కూడా మాట్లాడను అనుకుంటుంది వసుధార
రిషి: ఫోన్ చేసి ఎవరితోనో మాట్లాడున్నట్టు మాట్లాడుతూ..కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ ఉంది వసుధార గారు మాట్లాడతారు అని చెబుతాడు
వసు: ఏం మాట్లాడాలి సార్..
రిషి: ప్రాజెక్ట్ హెడ్ నువ్వే కాబట్టి నువ్వే ప్రిపేర్ అవు
కాలేజీ దగ్గర కారు ఆపిన తర్వాత సీట్ బెల్ట్ రావడం లేదని వసు చెబుతుంది.. గతంలో జరిగిన సంఘటన గుర్తుచేసుకుని నువ్వే తీసుకో అంటాడు.
వసు: సాధిస్తున్నారా
రిషి: ఇప్పుడు సాధించడం ఏంటి..నేను ఎప్పుడో చాలా విషయాల్లో చాలా సాధించాను
కావాలనే చేస్తున్నారు అనుకుంటూ సీట్ బెల్ట్ తీసుకుని కిందకు దిగుతుంది..
Also Read: ఫిబ్రవరి 21 రాశిఫలాలు, ఈ రాశులవారికి అదృష్టం, ఆ రాశులవారి జీవితంలో ఇబ్బందులు
తన క్యాబిన్లో కూర్చున్న రిషి..లవ్ సింబల్ చూసి ఇలా చేసావ్ ఏంటి వసుధార.. ప్రేమ అనే గాలానికి ప్రతిమనసు చిక్కుకుని విలవిల్లాడాల్సిందేనా అనుకుంటూ.. దానిపై ఎండీ అని రాస్తుండగా వసు వెనుక నుంచి చూస్తుంది. ఏం చూస్తున్నావ్ అనడంతో మీరు ఏం రాశారో నేను చూసాను లెండి సార్ అని అంటుంది. ఎండి అని రాసుకున్నారు ఏంటి సార్ అనగా నేను ఎండీ నే కదా అంటాడు రిషి. కానీ నువ్వు అనుకునే ఎండీ కాదులే అని కవర్ చేస్తాడు. వాళ్లిద్దరూ వాదించుకుంటూ ఉండగా.. జగతి, మహేంద్ర వస్తారు. హార్ట్ పైన ఏదో రాశారు అనడంతో నా ఇష్టం అంటాడు రిషి. అప్పుడు వాళ్లంతా ఎండీ విషయం గురించి సరదాగా మాట్లాడుకుంటారు.
దేవయాని జరిగిన విషయాలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి ప్రవర్తనలో మార్పు వచ్చింది అసలు ఏం జరుగుతోంది... వసుధార రిషి ని గుప్పెట్లో పెట్టుకుంది జగతి మహేంద్ర లు ఒకటవుతారు అనుకుంటూ ఉంటుంది. అలా ఎప్పటికీ జరగనివ్వను అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు రిషి మీటింగ్ కి వెళ్తాడు. ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. అప్పుడు మీటింగ్ లో రిషి ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి వసుధార గారు కొన్ని విషయాలు చెబుతారు అని అంటాడు.