వసుధార మెడలో తాళి వేసుకోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రిషి జగతి వాళ్ళని అడుగుతాడు. 'తన మెడలో తనే తాళి వేసుకుందని మీరు నేను నమ్ముతాము మరి ప్రపంచం సంగతి ఏంటి? రిషి, వసు కలిసిపోయారు అని సంతోషంగా ఉన్నారు కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. కొన్నింటిని వెనక్కి తీసుకోలేము. మెడలో తాళి వేసుకోవడం అంత ఈజీనా వసుధార. ఆ తాళి ఇప్పుడు నువ్వు తియ్యగలవా? చెప్పు వసుధార దాన్ని వేసుకున్నంత ఈజీగా తియ్యగలవా? తియ్యి చూద్దాం. మరి భవిష్యత్ లో పెళ్లి సంగతి ఏంటి? అప్పుడు పెళ్లి ఎలా అప్పుడు తాళి ఎలా ఇవన్నీ ఆలోచించావా'?


వసు: అంటే ఏంటి సర్ పొరపాటు చేశానా


రిషి: పొరపాటు కాదు చారిత్రక తప్పు గొప్ప తప్పుని క్షమించలేము వెనక్కి తీసుకోలేము. ఇది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు నీ వైపు నుంచి ఆలోచించి నన్ను ఒక చేతకాని వాడిలా నిరూపించాలని అనుకున్నావ్ ఫూల్ గా మిగిలిపోయాను. నువ్వు చేసిన దాన్ని సమాజంలో ఒక్కరైనా సమర్థిస్తారా?


వసు: మన బంధం, ప్రేమ ముఖ్యం. ఇక సొసైటీతో పనేముంది సర్. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు


రిషి: అసలు సొసైటీ గురించి పట్టించుకొకపోతే అందరికీ కనిపించేలా తాళి ఎందుకు వేసుకున్నావ్


Also Read: గాయత్రి ప్లాన్ ఫెయిల్, కేఫ్ సేఫ్- కొత్త మలుపు తీసుకున్న 'గృహలక్ష్మి'


వసు: అప్పుడున్న పరిస్థితుల్లో వేరే దారి కనిపించలేదు. మిమ్మల్ని రక్షించుకోవడానికి ఇలా చేశాను


రిషి: అప్పుడే విషయం చెప్తే అయిపోయేది కదా ఎంత బాధ చిత్రావధ అనుభవించానో తెలుసా


వసు: నిజం చెప్పాలని చాలా బాధపడ్డాను చెప్పాలని వస్తే మీరు కసురుకున్నారు, విసుక్కున్నారు


రిషి: నువ్వు చేసిన దానికి ఎవరైనా అలాగే చేస్తారు, ఇప్పుడు నీ పెళ్లి ఒక టాపిక్ అయ్యింది ఇప్పుడు అందరికీ ఏం సమాధానం చెప్తావ్ చెప్పుకోండి చూద్దాం అంటావా?


వసు: ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీరు నమ్మితే చాలు


రిషి: మన మధ్య దాపరికాలు ఉండకూడదని ఎప్పుడో చెప్పాను కానీ నిజాన్ని దాచిపెట్టావ్


వసు: చెప్పడానికి టైమ్, ధైర్యం చాలలేదు సర్


రిషి; నాకు పరీక్షలు పెట్టె టైమ్ లో ఈ తాళి ఎవరు కట్టలేదు నేనే వేసుకున్న అని చెప్పొచ్చు కదా ఒక వాయిస్ మెసేజ్ పంపవచ్చు కదా ఏంటి వసుధార ఈ ఆటలు. పోలీస్ స్టేషన్ చుట్టూ పిచ్చోడిలా తిరిగాను. ఏమైందని అంటే రికార్డింగ్ మెసేజ్ లా ఒకటి చెప్పేస్తావ్. నా కోసమే ఇదంతా చేశానని చెప్పకు


Also Read: విన్నీకి పెళ్లిచూపులు ఏర్పాటు చేసిన యష్- విషమంగా వేద ఆరోగ్యం


వసు: ఆ టైమ్ లో నాకు వేరే మార్గం కనిపించలేదు మనసుకి ఇదే కరెక్ట్ అనిపించి చేశాను. ఇవన్నీ పక్కన పెట్టండి నేను మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు


రిషి: నేను నిన్ను వదులుకుంటానని నువ్వు ఎలా అనుకుంటావ్. దీని వల్ల నువ్వు ఏం సాధించావ్ నన్ను బాధపెట్టడం నాతో ఆడుకోవడం తప్ప ఇంకేం లేదు కదా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


నేను ఎప్పుడో చెప్పాను నిజం చెప్దామని మీరు వినలేదని మహేంద్ర అంటాడు. రిషి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని జగతి అంటుంది. వసు అలా చేయకుండా ఉండాల్సిందని జగతి మహేంద్ర అనుకుంటారు. ఈ విషయంలో ఎంత తక్కువ జోక్యం చేసుకుంటే అంత మంచిదని చెప్తుంది.


ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంటే దేవయాని కస్సుబుస్సులాడుతుంది. కాసేపు మహేంద్ర దేవయాని మీద సెటైర్లు వేస్తాడు. రిషి స్వీట్ దేవయానికి తినిపిస్తాడు. తర్వాత మనసులో పొగరు తిన్నదో లేదో అని అనుకుంటాడు. వసు రిషి అన్న మాటలు తలుచుకుని ఫోటో చూస్తూ మాట్లాడుకుంటుంది.