యష్ పానకం తాగి బాత్ రూమ్ కి పరుగులు పెడుతూ ఉంటే వేద ట్యాబ్లెట్స్ ఇస్తుంది. బయట విన్నీ కూడా పొట్ట పట్టుకుని కుయ్యో మొర్రో అని అంటాడు. ట్యాబ్లెట్ వేసుకోమంటే యష్ వేసుకొనని అంటాడు కానీ వేద పక్కకి వెళ్లిపోగానే యష్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు. ఇక విన్నీ కోసం కూడా ట్యాబ్లెట్ తీసుకొచ్చి వేసుకోమని ఇస్తుంది. పోటీలు పెట్టుకుని బిందెలు బిందెలు పానకం తాగడం ఎందుకు ఇప్పుడు ఊ ఆ అని అనడం ఎందుకని వేద అంటుంది. మీ ఆయన చాలా గ్రేట్ నిజంగా అంత పానకం తాగారని అంటుంది. వేద వెళ్లబోతుంటే కాలు స్లిప్ అయ్యి నొప్పితో బాధపడుతుంటే విన్నీ కంగారు పడతాడు. కరెంట్ పోయింది వేద కిందకి వెళ్ళింది చీకట్లో మెట్ల మీద ఎలా వస్తుందో ఏంటో అని యష్ అనుకుంటాడు.
Also Read: నిజం చెప్పేసిన కృష్ణమూర్తి- కనకం మీద అనుమానపడిన రాజ్ తల్లి
విన్నీ కాసేపు జోక్స్ వేసి వేదని నవ్విస్తూ ఉంటాడు. నువ్వు నా మనసుని ముక్కలు చేశావ్ వేదు, నువ్వంటే నేను ఎంత ఫ్లాట్ అయ్యేవాడినో తెలుసా? ముందు ఆ మనోహర్ ని ప్రేమించావ్.. తర్వాత యశోధర్ ని పెళ్లాడావ్, నువ్వు నాకు ఒక్క ఫోన్ చేసినట్టయితే ప్రపంచంలో ఎక్కడ ఉన్న రెక్కలు కట్టుకుం నీ ముందు వాలిపోయే వాడిని. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు నేను నీకు గుర్తుకురాలేదా? అని విన్నీ అడుగుతాడు. ఆ మాటలన్నీ యష్ విని కోపంగా మొహం పెడతాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని వేద అడుగుతుంది. చేసుకుంటాను కానీ నీలాంటి అమ్మాయి కావాలి అని మనసంతా నువ్వే అని అంటాడు. నీ మనసులో నేను ఉన్నానేమో కానీ నా మనసులో మాత్రం నా భర్త, బిడ్డ ఉన్నారు అని వేద చెప్తుంది.
వేద విన్నీతో ముచ్చట్లు పెట్టడం తప్పు కదా అని యష్ అనుకుంటూ ఉండగా అంతరాత్మ ఎంట్రీ ఇస్తుంది. ఏం తప్పులేదని అంటాడు. వేదలో తేడా వచ్చిందని యష్ అంటే ఏం లేదు నువ్వే తేడా అని అంతరాత్మ అంటుంది. ఇంట్లో వాళ్ళకి ఏమైనా లోటు చేసిందా? మరి నీ బాధ ఏంటి? వేద అంటే నీకు కోపమా, అనుమానమా? మరి ఇష్టమా? అని అడుగుతాడు. వేద నీకు దూరం అయిపోతుందేమో అని భయం. వేద చెప్పినట్టు విను, తన మాటకి విలువ ఇవ్వు. తను నీ జీవితంలోకి రాలేదు నువ్వు తన జీవితంలోకి వచ్చావ్. తను లేకపోతే నువ్వు లేవు అని అంతరాత్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. అభిమన్యు ఆఫీసులో ఉండగా భ్రమరాంబిక వస్తుంది. మాళవిక ఆస్తి కోసం నీ మీద కేసు వేస్తుందని భ్రమరాంబిక అంటుంది.నీ మీద ఎటువంటి కేసు పెట్టను అని తనకి తానుగా రాసిచ్చే లీగల్ డాక్యుమెంట్, ఆ మాళవికతో ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిస్తే నువ్వు సేఫ్ నీ ఆస్తి సేఫ్ అనేసరికి అయితే పెట్టిస్తానని అభి అంటాడు. మాళవికతో ఏదో డాక్యుమెంట్ మీద సంతకం చేయించాలని అనుకుంటున్నారని చిత్ర అనుకుంటుంది.
Also Read: తులసి వల్లే కెఫ్ మూతపడుతుందని అవమానించిన లాస్య- సంబరంలో గాయత్రి
యష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రాజేశ్వరి తనతో మాట్లాడుతుంది. తన కూతురు కీర్తనకి విన్నీ ఇద్దామని అనుకుంటున్నా సంబంధం కుదర్చమని అడుగుతుంది. వేద ఒప్పిస్తుందని యష్ అంటాడు. బఫూన్ గాడిని వదిలించుకోవచ్చని యష్ మనసులో సంబరపడతాడు. ఇంకొక గంటలో పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామని యష్ చెప్తాడు. విన్నీని పిలిపించి యష్ హడావుడి చేస్తాడు. మాలిని విషయం చెప్తుంది. కీర్తన మా ఫ్లాట్స్ లో అమ్మాయి కీర్తన చాలా మంచిదని చెప్తారు. అప్పుడే వేద వస్తుంది. రాజేశ్వరి విన్నీని అల్లుడు అని పిలిచేస్తుంది.