తులసి ఇంట్లో శివరాత్రి పూజ చేయమని అనసూయకి చెప్తుంది. అదేంటి ప్రతి ఏడాది నువ్వే కదా పూజ జరిపించేది అని నందు అడుగుతాడు. పండగ పూట ఇంట్లో గొడవ జరగడం ఇష్టం లేదు అందుకే అత్తయ్యతో పూజ జరిపిస్తున్నా అని తులసి చెప్తుంది. అప్పుడే హడావుడిగా లాస్య వచ్చి పూజ చేస్తానని అంటాడు. నువ్వు కాదు ఇంటి పెద్ద మా అమ్మ పూజ చేస్తుందని నందు చెప్తాడు. అదేంటి ఇంటి పెద్ద కోడల్ని కదా అంటే పూజ చేయాలంటే పద్ధతిగా సంప్రదాయంగా ఉండాలి అంతే కానీ ఇలా మోడల్ లాగా కాదని నందు చురకేస్తాడు. మీరు మారిపోయారు నాన్న అని ప్రేమ్ అంటాడు. కాసేపు లాస్యకి చురకలేస్తారు.
Also Read: పెళ్లి చూపుల్లో కావ్యని చూసి షాకైన రాజ్ కుటుంబం- రాహుల్ చేయి అందుకున్న స్వప్న
లాస్య కావాలని తన నెక్లెస్ తులసితో సరి చేయించుకుంటుంది. తులసి మెడలో ఉండాల్సిన నెక్లెస్ దీని మెడలో చూడాల్సి వస్తుంది పాతికేళ్ళ కాపురంలో భర్తగా ఫెయిల్ అయ్యాను ఇప్పుడు మాజీ మొగుడుగా ఫెయిల్ అయ్యానని నందు తనని తాను తిట్టుకుంటాడు. శివరాత్రి పూజ విశిష్టత గురించి తులసి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. అప్పుడే నందు కేఫ్ కి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వస్తారు. మీ కేఫ్ మీద కంప్లైంట్ వచ్చింది అర్జెంట్ గా చెక్ చేయాలని చెప్తారు. కేఫ్ లో పని చేసే చెఫ్ వెంటనే నందుకి ఫోన్ చేసి చెప్తాడు. దీంతో హడావుడిగా తులసి వాళ్ళు వెళ్లిపోతారు. ఫుడ్ గురించి ఎవరూ బ్యాడ్ గా ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదని నందు అంటాడు. చందు గాయత్రి ప్లాన్ అమలు చేస్తాడు. కేఫ్ లోని మంచి బర్గర్ తీసేసి నాసిరకం బర్గర్ ని ఆఫీసర్స్ కి ఇస్తాడు. కేఫ్ లోని ఆహార పదార్థాలన్నింటిని అధికారులు టెస్ట్ కోసం తీసుకెళ్తారు.
ఈ శాంపిల్స్ అన్నీ ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేస్తామని ఆఫీసర్ అంటారు. పొరపాటు జరిగితే ఏం చేస్తారని లాస్య వాళ్ళని అడుగుతుంది. సీజ్ చేస్తామని చెప్పేసరికి అందరూ టెన్షన్ పడతారు. నిజాయితీగా బిజినెస్ చేస్తున్నాం ఏం కాదని తులసి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ నందు వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉండగా అప్పుడే ఇంటికి వస్తారు. మన కేఫ్ పెట్టి పెట్టకముందే మంగళగీతం పాడాల్సి వస్తుందని లాస్య దెప్పిపొడుస్తూ అంటుంది. మనదగ్గర ఫుడ్ బాగోలేదని కంప్లైంట్ వచ్చింది అది బాగోలేదని చెప్తే కేఫ్ మూసేయాల్సి వస్తుంది మళ్ళీ రోడ్డు మీద పడతామని లాస్య అంటుంది. హైజెనిక్ గా చేస్తున్నామని తులసి అంటుంది. ఇలాంటి ఇష్యూ రాకూడదని ప్రొఫెషనల్ చెఫ్ ని తీసుకొస్తే వెనక్కి పంపించారు, సర్వం తులసిమయం అన్నావ్ ఇప్పుడు ఏమైంది మొదటికే మోసం వచ్చిందని లాస్య అంటుంది.
Also Read: విన్నీ మీద గెలిచిన యష్- భర్తని చూసి మురిసిపోయిన వేద
ప్రతిదానికి మామ్ ని లాగొద్దని అభి అంటాడు. తులసి మీద ఆధారపడి తను చెప్పిందే చేస్తున్నారని లాస్య నందుని నిలదీస్తుంది. కలిసి కాపురం చేయడానికి పనికిరాని తులసి కలిసి కేఫ్ లో పనిచేయడానికి పనికివచ్చిందా? ఏంటి తనలో వచ్చిన మార్పు అని అవమానించేలా మాట్లాడుతుంది. తెలిసితెలియనితనంతో తులసి కేఫ్ మూయించేలా చేస్తుందని అరుస్తుంది. ఒక్కరోజు ఆగు తెలిపోతుంది కదా తులసి చెప్తుంది. లాస్య తరఫున నందు తులసికి సారీ చెప్తాడు. పిల్లల్ని ఎంతగా ప్రేమించానో కేఫ్ ని కూడా అంతే ప్రేమించాను కేఫ్ ఉండాలని తులసి దేవుడికి మొక్కుకుంటుంది. నా కూతుర్ని నాకు కాకుండా చేసిన ఆ ఇంట్లో సంతోషాన్ని ఆవిరి చేయబోతున్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ కనిపించగానే వాళ్ళ సంతోషం పోతుందని గాయత్రి సంతోషపడుతుంది. తులసి దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తూ ఉంటుంది.