జానకి కళ్ళు తిరిగి పడబోతుంటే జ్ఞానంబ పట్టుకుంటుంది. రాత్రి పగలు కష్టపడుతూ ఉంది అందుకే ఇలా అయ్యిందని వెన్నెల చెప్తుంది. నీరసంగా ఉంది అంటే ఏదైనా విశేషమా అని జ్ఞానంబ మనసులో అనుకుంటుంది. జానకి చదువుకుంటూ ఉండగా జ్ఞానంబ వచ్చి మాట్లాడుతుంది. చదువు గురించేనా ఆరోగ్యం గురించి ఆలోచించవా అని అంటుంది. పగలంతా కష్టపడుతూ రాత్రంతా చదువుకుంటే ఆరోగ్యం ఏమవాలి అని అడుగుతుంది. నువ్వు చెప్పుకోలేని బాధ ఏదైనా ఉంటే తనతో చెప్పుకోమని అంటుంది. రేపు హాస్పిటల్ కి వెళ్దామని జ్ఞానంబ జానకితో చెప్తుంది. అత్త వచ్చి తనతో ప్రేమగా మాట్లాడినందుకు జానకి పొంగిపోతుంది.


Also Read: రాజ్ ని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదన్న స్వప్న- కావ్య ముందు బుక్కైన రాహుల్


తిలోత్తమ కాళ్ళు నొప్పిగా ఉన్నాయని కాసేపు నొక్కమని మల్లికకి చెప్తుంది. ఇప్పటి వరకు మా అత్తయ్య కాళ్ళు పట్టుకోలేదని మల్లిక అంటే జెక్కి కాళ్ళు పట్టకపోయినా పరవాలేదు నా కాళ్ళు పట్టుకోని నొక్కు అని చెప్తుంది. జానకి జ్ఞానంబ మాటలు భర్త రామతో చెప్పుకుని సంతోషిస్తుంది. ప్రకాష్ వల్ల అమ్మ మాట్లాడలేదు కానీ తనకి నేనంటే బోలెడు ప్రేమ అని అంటాడు. అతని దగ్గర మిగిలిన డబ్బులు కూడా వసూలు చేసి షాపు కూడా విడిపించుకోవాలని జానకి సలహా ఇస్తుంది. అడిగాను కానీ వాడి దగ్గర ఇక డబ్బులు లేవని వాడి నుంచి డబ్బులు రావడం కష్టమేనని రామ అంటాడు. అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చని చెప్పి జానకిని చదువుకోమని అంటాడు. కాసేపు సరదాగా మాట్లాడి ముద్దు పెట్టమని అడుగుతాడు.


Also Read: 'ఆ తాళి తియ్యగలవా వసుధార'? ప్రశ్నల వర్షం కురిపించిన రిషి- కొడుకుని సమర్థించిన జగతి


తిలోత్తమ గోవిందరాజులకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కాసేపు ఇద్దరూ చూపులతో ప్రేమించుకుంటారు. అదంతా జ్ఞానంబ చూసి ఈ వయస్సులో ఏంటి ఇది అని దెప్పిపొడుస్తుంది. రామ వేడి నీళ్ళు తీసుకొచ్చి జానకి ఎక్కడ అని జెస్సిని అడుగుతాడు. నవ్వి జానకిని చెప్పమని చెప్తుంది. జ్ఞానంబ వచ్చి రామని చూసి నవ్వుతారు. పౌడర్ పూసుకున్నట్టు మసి పూసుకున్నావ్ ఏంటని తిలోత్తమ అడుగుతుంది. కాసేపు నవ్వుకుంటారు. జ్ఞానంబ జానకిని తీసుకుని హాస్పిటల్ కి తీసుకొచ్చి చెక్ చేయిస్తుంది. మీరు అనుకుంటున్నా నీరసం కాదు.. సరిగా నిద్రలేకపోవడం వల్ల వచ్చిన నీరసం అని డాక్టర్ చెప్తుంది. బయటకి వెళ్లబోతుంటే జ్ఞానంబకి కళ్ళు తిరుగుతాయి. వెంటనే డాక్టర్ తనకి టెస్ట్ లు చేయిస్తుంది. గోవిందరాజులు చెప్పులు తెగిపోవడంతో జెస్సి అఖిల్ ని కొనమని అంటుంది. గోవిందరాజులు మాత్రం అఖిల్ జీతం గురించి దెప్పి పొడుస్తూ ఉంటాడు. ప్రతి మాటకు నీ జీతం 15 వేలేగా అంటూ చురకలేస్తాడు.