మేష రాశి
ఈ రాశివారు తండ్రి సహాయంతో చేసే పనులు విజయవంతమవుతాయి. మీ పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. చేసిన పనికి తగిన ఫలితం పొందుతారు. సబార్డినేట్ ఉద్యోగి లేదా సోదరుడి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మీ రహస్యాలను ఇతరులకు వెల్లడించవద్దు.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులు తమ ప్రియమైన వారు చేసే రాజకీయాలకు బలైపోతారు. సామాజిక జీవితంలో ప్రజాదరణ పెరుగుతుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో సంబంధం దృఢంగా ఉంటుంది, పెద్దల మనోభావాలను గౌరవిస్తారు. ఈరోజు ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారు బుధవారం కుటుంబ కార్యక్రమాలలో మరింత బిజీగా ఉంటారు. ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సమస్యలతో భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా వ్యవహరించాలి. ఈ రోజు మీర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
Also Read: శవాల బూడిదతో హోలీ వేడుకలు ఆరంభం, 5 రోజుల పాటూ కన్నులపండుగా రంగుల పండుగ
కర్కాటక రాశి
ఈ రోజు కుటుంబ కలహాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. సమిష్టి చర్యల్లో అందరి సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ఆరోగ్యంలో ఫ్రెష్ నెస్ ఉంటుంది.
సింహ రాశి
కార్యాలయంలో బిజీగా ఉండడం వల్ల ఇంటిపనులపై దృష్టి సారించలేరు. ఆలోచించి అప్పు ఇవ్వడం మంచిది లేదంటే డబ్బు చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. మీ తెలివితేటలతో ప్రత్యర్థులను ఓడిస్తారు. ఉద్యోగం, వ్యాపారం బాగానే సాగుతుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారి ప్రణాళికలు ఈ రోజు కార్యరూపం దాల్చుతాయి. సమస్యల పరిష్కారంతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని ఒత్తిడిల కారణంగా నిర్ణయాలు తీసుకోలేరు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
Also Read: కామం దహించి ప్రేమ-సౌభాగ్యం వెల్లివిరిసిన రోజు హోలీ, రంగుల వేడుక వెనుక ఎన్నో పురాణ కథలు
తులా రాశి
ఈ రోజు తులారాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటంది. సరదా కోసం ఖర్చు చేస్తారు. ఈ రోజు మీరు బహుమతులు అందుకునే అవకాశం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేయాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు అస్థిరతతో ఇబ్బంది పడతారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. నాటకరంగంతో సంబంధం ఉన్న వ్యక్తుల విలువ పెరుగుతుంది. కార్యాలయంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారు అపరిచితులను నమ్మొద్దు. అనుకున్న పనులు పూర్తికావు. ఆకస్మిక ఖర్చులు బడ్జెట్ పై ప్రభావం చూపుతాయి. ఎవరితోనైనా అనవసర వివాదాలు తలెత్తుతాయి. మాటతూలొద్దు.
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి వ్యాపార పురోభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. పనిలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. దాన ధర్మాలు చేయడానికి ఇదే సరైన సమయం.
కుంభ రాశి
ఈ రాశివారికి ఓపిక చాలా అవసరం. తొందరపాటు వల్ల నష్టపోతారు. చట్టపరమైన పనుల్లో బిజీగా ఉంటారు. చిన్న విషయాలకు వివాదం తలెత్తే అవకాశం ఉంది. తోబుట్టువులతో సమయాన్ని గడుపుతారు.
మీన రాశి
పని చేసే ప్రదేశంలో తరచూ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేస్తే తక్షణ ప్రయోజనం ఉంటుంది. విమాన ప్రయాణం చేయే అవకాశం ఉంది. దాన ధర్మాలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.