మూడేళ్ళ తర్వాత దివ్య ఢిల్లీ నుంచి వస్తుంది. దివ్యని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి తులసి బైక్ మీద వస్తుంది. కానీ తను లాస్య మాత్రం తనని కారులో తీసుకువద్దామని చెప్పి నందుని బలవంతంగా తీసుకుని వెళ్తుంది. ఎయిర్ పోర్ట్ లో ఒక పాప బెలూన్స్ పోకిరి కుర్రాడు కట్ చేస్తాడు. వాటిని దివ్య పట్టుకుని పాపకి ఇచ్చి ఆ పోకిరి కుర్రాడికి కాసేపు క్లాస్ పీకుటుంది. ఇక తులసి దివ్యని చూసి తెగ సంతోషపడిపోతుంది. దివ్య తులసితో సంబరంగా మాట్లాడుతుంది. కాసేపు తులసిలాగా వేదాంతం మాట్లాడేస్తుంది. తర్వాత తండ్రిని చూసి సంతోషంగా వెళ్ళి కౌగలించుకుంటుంది. మీ అమ్మలాగా కాకుండా నీ జీవితానికి గట్టి పునాది వేసుకున్నావ్ అని తులసి అంటుంది.


Also Read: రుద్రాణి ప్లాన్ సక్సెస్, రాజ్ పెళ్లి ఖాయం- రాహుల్‌తో లేచిపోయేందుకు స్వప్న స్కెచ్


లగేజ్ కారులో పెట్టుకుంటుంది. దివ్యకి నీమీద ప్రేమ తగ్గలేదు కానీ బైక్ మీద నుంచి కారు రేంజ్ కి వచ్చిందని లాస్య తులసికి చురక వేస్తుంది. తులసి ఉండగా నాతో వస్తుందని అనుకోలేదని నందు అనుకుంటాడు. దివ్య లగేజ్ కారులో పెట్టిన తర్వాత నందు వాళ్ళకి బై చెప్పి తులసితో బైక్ మీద కబుర్లు చెప్పుకుంటూ వస్తానని అంటుంది. ఆ మాటకి లాస్య షాక్ అవుతుంది. మనం లగేజ్ మోసుకురావడానికి మాత్రమే పనికోస్తామా అంటూ చిందులేస్తుంది. ప్రేమ్ వాళ్ళు దివ్య కోసం ఇల్లంతా డెకరేట్ చేసి అందరూ హడావుడి చేస్తూ ఉంటారు. మూడేళ్ళ తర్వాత నా మనవరాలు వస్తుందని అనసూయ గోల గోల చేస్తుంది. అప్పుడే దివ్యని తీసుకుని తులసి వస్తుంది. తనకి హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మంటుంది. పరంధామయ్యతో డాన్స్ చేసి ఫుల్ హంగామా చేస్తుంది.


Also Read: దివ్య ఎంట్రీ అదుర్స్- ప్రేమ్ కి కొడుకు, కొత్త కథతో గృహలక్ష్మి


ఈ ఇంట్లో అందరి కొలెస్ట్రాల్ కంట్రోల్ తగ్గించేస్తానని దివ్య అంటుంది. దీని డైలాగ్ లు ఉంటుంటే ఏది ఫిక్స్ అయినట్టుగా ఉంది ఇన్ డైరెక్ట్ గా నాకే పంచ్ లు వేసినట్టు ఉందే అని లాస్య మనసులో అనుకోగానే అలా అని అజాగ్రత్తగా ఉండొద్దని రాములమ్మ పైకి అంటుంది. రాములమ్మ స్వీట్ తీసుకుని ఎండీ కంప్లీట్ చేయడానికి కారణం మీరు మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నానని దివ్య అంటుంది. కాసేపు ప్రేమ్ దివ్యని ఆటపట్టిస్తాడు. తులసి దివ్యకి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. వచ్చి ప్రేమ్ కుళ్ళుకుంటూ తనకి పెట్టమని అడుగుతాడు. మూడేళ్ళ పాటు అమ్మ ప్రేమ నువ్వే పొందావ్ ఇప్పుడు అమ్మ దగ్గరకి రాకు అని ప్రేమ్ తోసేస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు ప్రేమ్ అభి, అంకిత వాళ్ళకి వీడియో కాల్ చేస్తాడు. ఎండీ కంప్లీట్ చేశావ్ కదా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అభి అడుగుతాడు. క్లినిక్ పెట్టి పేద వాళ్ళకి వైద్యం చేయడం అమ్మ కల అదే చేస్తానని దివ్య అంటుంది.