తులసి కేఫ్ లాభాల్లో వాటా అడుగుతుందేమో అని లాస్య అంటే అడగనివ్వు చూద్దాం తను నా కంటే ఎక్కువ కష్టపడిందని నందు అంటాడు. అప్పుడే తులసి వస్తుంది నీ గురించే మాట్లాడుకుంటున్నామని అంటాడు. నువ్వు కూడా నాతో కలిసి పని చేయొచ్చు కదా ప్రాఫిట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తానని నందు తులసికి ఆఫర్ ఇస్తాడు. అలాంటి ఆలోచన నాకు లేదు కేఫ్ ఒక దారిన పడేదాకా అండగా ఉండాలని అనుకున్న ఇప్పుడు నా అవసరం లేదు అందుకే ఆఫీసుకి వెళ్తున్నా అని తులసి చెప్పేసి వెళ్ళిపోతుంది. తులసితో పార్టనర్ బిజినెస్ చేయాలని అంత ఆరాటంగా ఉందా అని లాస్య నందు మీద చిందులు వేస్తుంది. నాకు తెలుసు తులసి సమాధానం కానీ నీ ముందు ప్రూవ్ చేయడం కోసం అలా అడిగానని నందు అంటాడు.


Also Read: అభి ప్లాన్ తిప్పికొట్టిన చిత్ర- వేద పరిస్థితి చూసి విలవిల్లాడిపోయిన యష్


ఇంట్లో అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే నందు చూసి మురిసిపోతాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను రోజు ఈరోజే. నాకు పునర్జన్మ ఇచ్చిన రోజు. తులసి సలహాతో కేఫ్ స్టార్ట్ చేసి సక్సెస్ సాధించిన రోజు అని అంటాడు. ఈయనకి మళ్ళీ తులసి పిచ్చి పట్టింది వదిలించాలని లాస్య మనసులో అనుకుంటుంది. అందరూ కలిసి సరదాగా ఆట ఆడుతుంటే నందుకి పొరపోతుంది. లాస్య పట్టించుకోకుండా ఉంటే ప్రేమ్ పరుగున వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొచ్చి తాగిస్తాడు. నా కళ్ళలోకి చూడటానికి ఇష్టపడని నా చిన్న కొడుకు ఇప్పుడు నా కోసం వాటర్ తీసుకొచ్చాడు చాలు తండ్రిగా నేను గెలిచాను, థాంక్స్ తులసి ఇదంతా నీ వల్లే సాధ్యం అయ్యిందని నందు ఎమోషనల్ అవుతాడు. ఆ మాటలు విని లాస్య చిరాకుగా వెళ్లబోతుంటే నందు ఆపి ఉమ్మడి కుటుంబంలో మనం ఒక భాగం అవుదామని అంటాడు.


దివ్య వస్తుందని శ్రుతి గట్టిగా సంతోషంగా అరుస్తూ చెప్తుంది. పీజీ పూర్తి చేసుకుని మూడేళ్ళ తర్వాత డాక్టర్ మనవరాలు వచ్చేస్తుందని పరంధామయ్య సంబరపడతాడు. ప్రేమ్ కి పిల్లోడు పుట్టేస్తాడు. ఇంట్లో ఎవరు కనిపించడం లేదని లాస్య అనుకుంటూ ఉండగా అనసూయ విషయం చెప్తుంది. కూతురు వస్తుందన్న సంతోషంలో తులసి గుళ్ళో  108 కొబ్బరి కాయలు కొడుతూ సంబరంగా ఉంటుంది. దివ్య పేరు మీద పూజ చేయించి ఎయిర్ పోర్ట్ కి వెళ్తుంది. తన కూతురు మంచి ఇంటికి కోడలిగా వెళ్ళేలా చూడమని తులసి కోరుకుంటుంది. దివ్య వస్తుందనే విషయం ఇంట్లో మనకి తప్ప అందరికీ తెలుసని లాస్య చిర్రుబుర్రులాడుతుంది. తనకి కూడా తెలుసని నందు అంటాడు.


Also Read: 'ఆ తాళి తియ్యగలవా వసుధార'? ప్రశ్నల వర్షం కురిపించిన రిషి- కొడుకుని సమర్థించిన జగతి


ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి దివ్యని తీసుకురమ్మని లాస్య చెప్తుంది. ఢిల్లీలో పీజీ చేసిన అమ్మాయి ఇప్పుడు తులసి బైక్ ఎక్కి వస్తుందా తను స్టేటస్ ఏమవాలి వెళ్ళి కారులో తీసుకుని వద్దామని అంటుంది. ఎంత ఎదిగిన దివ్య తులసి కూతురే అని నందు చెప్పినా కూడా వినిపించుకోకుండా లాస్య తనని తీసుకుని వెళ్తుంది. కొత్త దివ్య ఎంట్రీ ఇస్తుంది.