ఫిబ్రవరి 21 రాశిఫలాలు, ఈ రాశులవారికి అదృష్టం, ఆ రాశులవారి జీవితంలో ఇబ్బందులు

Rasi Phalalu Today 21st February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Continues below advertisement

మేష రాశి

ఈ మంగళవారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మేష రాశివారి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు, ఇది లాభదాయకంగా ఉంటుంది. మీరు సమయాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. చాలా కాలంగా నిలిచిపోయిన ధనాన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా పొందవచ్చు. రోజు ఆనందంగా గడిచిపోతుంది. సామాజిక రంగంలో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు

Continues below advertisement

వృషభ రాశి

ఫిబ్రవరి 21వ తేదీ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దు. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలున్నాయి. 

మిథున రాశి

ఈ రోజు మిథున రాశి వారికి జీవితంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడండి. మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. మీ దూరదృష్టి, తెలివితేటలతో మీరు మీ పనిలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి

ఈ రాశికి చెందిన వారికి ఈ రోజు మంచి జరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. సమాజ సేవలో ఉండేవార గౌరవ మర్యాదలు పొందుతారు.

సింహ రాశి

సింహ రాశి వారికి వ్యాపారంలో లాభాలొస్తాయి. కుటుంబం, సమాజంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు.  ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో అనవసర పోటీకి దిగొద్దు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. 

Also Read: ఫిబ్రవరి 20 నుంచి 26 వారఫలాలు, ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి

కన్యా రాశి

ఈ రాశివారికి కళాకృతులపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కొత్త ఆఫర్ వస్తుంది. వివాహం చేసుకునే వారికి ఈ సమయం శుభప్రదం. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

తులా రాశి

తులా రాశి వారు ఈ రోజు ప్రారంభంలో బిజీగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉండొచ్చు. ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.ఏ విషయంలోనూ తొందరపాటు వద్దు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు వ్యాపారంలో రుణం తీసుకోవలసి రావచ్చు. అనుకూలమైన ఫలితాల కోసం క్రియాశీలత , సంకల్పం అవసరం. విశేష ప్రయోజనాల వల్ల మనసులో ఆనందం ఉంటుంది. ఈరోజు సంతానం వల్ల సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశి 


ధనుస్సు రాశివారికి ఈ రోజు శుభదినం. చాలాకాలం తర్వాత వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. మీ పరిచయాల పరిధి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త.

మకర రాశి

మకరరాశి ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ బాధ్యతల నుంచి పారిపోవద్దు..ప్రత్యేక శ్రద్ధ వహించండి. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. మీ పనిలో సృజనాత్మకత ఉంటుంది. కార్యాలయంలో గౌరవం పొందుతారు.

Also Read: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా ఈరోజు శుభప్రదం. ఈ రోజున పనులు తక్కువ సమయంలో పూర్తవుతాయి. ఆస్తివివాదాలు ఏమైనా కొనసాగితే ఈరోజు పరిష్కారం దిశగా అడుగుపడే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పథకాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

మీన రాశి

మీన రాశివారు తమ ప్రవర్తనలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాహనం, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపార పనులనిమిత్తం చేసే ప్రయాణం లాభదాయకుండా ఉంటుంది. మీ పిల్లల నుంచి ఓదార్పు పొందుతారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola