తెలంగాణ వ‌ర్క్స్ అకౌంట్స్ స‌ర్వీస్‌లో డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


తెలంగాణలో 53 డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల నుంచి ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాతపరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేయనున్నారు.


పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పోస్టుల వివరాలు..


* డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ (గ్రేడ్-2): 53 పోస్టులు


పోస్టుల కేటాయింపు: ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02.


రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 అరిథ్‌మెటిక్ & మెన్సురేషన్ నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


పరీక్ష సిలబస్, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


పే స్కేలు: రూ.45,960- రూ.1,24,150.


పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.


Also Read:


'గ్రూప్‌-3' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, పోస్టుల సంఖ్య పెరిగిందోచ్! మొత్తం ఖాళీలు ఎన్నంటే?
తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో మరో 12 పోస్టులు పెరిగాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే ఈ సొసైటీ పరిధిలోని 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటనలో పేర్కొనగా.. తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి. ఈ మేరకు పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్ తెలిపింది. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్‌-2' ఉద్యోగాలు - ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ - వారం రోజుల్లో పరీక్ష తేదీ ప్రకటన!
తెలంగాణలో గ్రూప్‌-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 5,51,943 దరఖాస్తులు అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తర్వాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్ప మార్పులుండే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...