Guppedanta Manasu  Serial Today Episode:  రంగా, శైలేంద్ర ఇద్దరూ కలిసి వెళ్తుంటే మధ్యలో ఊరి వాళ్లు కలిసి రంగతో మాట్లాడుతున్న మాటలు విని వీడు కచ్చితంగా రంగానే అని క్లారిటీకి వస్తాడు శైలేంద్ర. ఇంతలో బుజ్జి ఆటో తీసుకుని వస్తాడు. ఆటోలో వెళ్దామని చెప్పగానే నేనిక రానని మీ సంబంధం బాగా నచ్చిందని ఆదే విషయం మీరే మీ మామయ్యకు  చెప్పండని చెప్పి తన ఫోన్‌లో ఉన్న వసుధార ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతాడు శైలేంద్ర. దీంతో రంగ, బుజ్జి షాక్‌ అవుతారు. చూడలేదని రంగ చెప్పి ఆటోలో శైలేంద్రను పంపిస్తాడు.


రంగ: ఏంట్రా బుజ్జి అలా చూస్తున్నావు.


బుజ్జి: మేడం గారు మన ఇంట్లోనే ఉన్నారు కదా అన్నా ఎందుకు అబద్దం చెప్పావు.


రంగ: నాకెందుకో తనని చూస్తే అనుమానంగా ఉందిరా? అందుకే చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకు.


బుజ్జి: అది సరే కానీ సరోజను చూడ్డానికి వచ్చిన వాళ్ల దగ్గర మేడం గారి ఫోటో ఎందుకు ఉంది అన్న.


రంగ: అదేరా నా డౌటు మనం ఇప్పుడు నిజం చెప్తే.. మళ్టీ మేడం గారికి ఏదైనా ప్రమాదం ఉంటుందేమోనని చెప్పొద్దు అంటున్నా?


బుజ్జి: వాళ్లు మళ్లీ మన ఊరు వచ్చినప్పుడు మేడం గారిని చూస్తే ప్రాబ్లం అవుతుంది కద అన్నా.


రంగ: అరేయ్‌ ఇది కరెక్టే కదా నేనేంటి ఇంత చిన్న లాజిక్‌ మిస్సయ్యాను. సరే వాళ్లు చూసినప్పుడు ఆలోచిద్దాం.


  అని వెళ్లిపోతుంటే బుజ్జి అక్కడే నిలబడి అనుమానంగా చూస్తుంటాడు. మరోవైపు వసుధార, సరోజ ఇంటికి వెళ్లి రిషి సార్‌ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. రిషి ఎవరో నాకు తెలియదు అంటుంది. దీంతో రంగా వచ్చాడా? అని అడుగుతుంది.  నువ్వు అక్కడ ఉండగా మా బావ ఇక్కడికి ఎందుకు వస్తాడు. అంటూ వసుధారను తిడుతుంది సరోజ. నా బావను నాకు కాకుండా చేస్తున్నావు.. అసలు నీ రిషి సార్‌ ఉన్నాడో చచ్చాడో తెలియదు అనగానే ఇంతలో రంగ వచ్చి సరోజను తిడతాడు.


రంగ: ఇంక చాలు ఆపుతావా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఒక మనిషి గురించి తెలియకుండా అలా మాట్లాడటం తప్పు కాదా?


సరోజ: సరే నేను అలా మాట్లాడ్డం తప్పే  కానీ నేను ఒకటి అడుగుతాను చెప్తావా? తను నిన్ను రిషి సార్ అంటుంది. అంటే నువ్వు తన రిషి సారా?


సంజీవ: చెప్పు అల్లుడు నా కూతురు అడుగుతుందిగా


రంగ: కాదు నేను రంగానే


సరోజ: రంగా అయితే తనను ఎందుకు భరిస్తున్నావు బావ


రంగ: అది నా ఇష్టం నీకు చెప్పాల్సిన అవసరం లేదు.


సరోజ: సరే బావ నేను ఒకటి అడుగుతాను. నేను నీ మనసులో ఉన్నానా? లేనా?


సంజీవ: పర్లేదు అల్లుడు నిజమే చెప్పు. నా కూతురుకు నేనో పెద్ద విలన్‌ లా కనిపిస్తున్నాను.


రంగ: లేవు. నా మనసులో నువ్వే కాదు ఎవరూ లేరు.


సరోజ: నాకు అర్తం అయ్యింది బావ. ఇది నిన్ను మార్చేసింది కదా?


అనగానే రంగ కోపంగా సరోజను తిట్టి మనిద్దరం కలవడం ఈ జన్మకు జరగదని చెప్పి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బుజ్జి మీ రిషి సార్‌ మీ ఇంటికి వచ్చి మీరు అక్కడ లేరని తెలిసి మళ్లీ వెతకొచ్చు కదా అందుకే మీరు ఒకసారి మీ ఇంటికి వెళ్లొచ్చు కదా అని అడుగుతాడు. దీంతో వసుధార ఈ మాట నువ్వు అడుగుతున్నావా? లేక మీ అన్న అడుగుతున్నాడా? అంటుంది. మరోవైపు శైలేంద్ర, దేవయానికి ఫోన్‌ చేసి వాడు రంగానే.. రిషి కాదని క్లారిటీ వచ్చిందని చెప్తాడు. ఊరు మొత్తం వాడు రంగానే అని చెప్తున్నారు అంటాడు. రిషి లేడు.. వాడు రాడు. వీడు రంగానే. అనగానే ఆ రంగా గాడి వల్లే మనం కాలేజీ మన సొంతం చేసుకోవచ్చు అని తన ప్లాన్‌ చెప్తుంది దేవయాని దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.