Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మి దగ్గరకు రామ్ వచ్చి భోజనానికి పిలుస్తాడు. నేను రాకుండా ఎవరూ తినరు అని విషయం మర్చిపోయి ఆలోచిస్తూ ఉండిపోయాను అని మహాలక్ష్మి అంటే సీత కింద కూర్చొని తినేస్తుందని రామ్ చెప్తాడు. దానికి మహాలక్ష్మి సీతకు తన మీద ప్రేమ లేదు అని అంటుంది.


రామ్: మీకే సీత మీద ప్రేమ లేదని అంటున్నారు పిన్ని. సీత, విద్యాదేవి టీచర్, చలపతి మామయ్య, రేవతి అత్తయ్య వాళ్లు అంటున్నారు పిన్ని. సీత అమ్మ మేనకోడలు అయినా మీరు తనకి మర్యాద ఇవ్వకుండా దారుణంగా చూస్తున్నారని అంటున్నారు. నీ మీద నిందలు వేస్తున్నారు పిన్ని, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు కానీ వాళ్లకి తెలీడం లేదు పిన్ని. నీ స్థానంలో అమ్మ ఉంటే మరోలా చూసుకునేదని సీతని ప్రేమగా చూసుకునేదని అంటున్నారు. అలా ఏం లేదు మా అమ్మ పిన్ని ఒకలా చూసుకుంటారు అన్నాను.
మహాలక్ష్మి: బాగా చెప్పావ్ రామ్.
రామ్: కానీ వాళ్లు నమ్మడం లేదు పిన్ని. వాళ్లు కళ్లు తెరిపించాలి అంటే నువ్వు ఓ పని చేయాలి పిన్ని.
మహాలక్ష్మి: ఏం చేయాలో చెప్పు రామ్ నువ్వు చెప్తే కళ్లు మూసుకొని చేసేస్తా.  
రామ్: నువ్వు కిందకి వచ్చి కాసేపు అమ్మలా నటించాలి. నువ్వు అమ్మలా సీతని చూసుకోవాలి పిన్ని. అమ్మని మరిపించాలి పిన్ని.
మహాలక్ష్మి: ఇలా ఇరికించావ్ ఏంటి సీత. రామ్ తెలివైన వాడో తెలివి తక్కువ వాడో తెలీదు నన్ను అడ్డంగా బుక్ చేసేశాడు. ఇప్పుడు నేను నా శత్రువుతో ప్రేమగా నటించాలా.. ఛా రామ్ కోసం నటించాల్సి వస్తుంది.
చలపతి: నాకు తెలిసి మహాలక్ష్మి కిందకి రాదు. వచ్చినా సుమతి వదినలా సీతతో ఉండదు.


మహాలక్ష్మి, రామ్‌లు కిందకి వస్తారు. పిన్నిని తీసుకొచ్చానని రామ్ అంటే రేవతి ఊరికే తీసుకొస్తే సరిపోదు అని సుమతి వదినలా ప్రవర్తించాలి అని అంటారు. ఇక రామ్ మహాలక్ష్మితో సీతతో మాట్లాడమని అంటాడు. ఇక మహాలక్ష్మి సీతతో కోడలు పిల్లా నా మేనకోడలివి నువ్వు కింద కూర్చొని తింటే నాకు ఎంత నామోషిగా ఉంటుంది పైకి వచ్చి కూర్చొని తినమని ఈ రోజు నుంచి నా కోడలు సీత అందరితో సమానంగా ఉంటుందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. అర్చన మనసులో మహా రెండు నాలుకల పాము అని ఎలా అయినా మాట్లాడగలదని అంటుంది. ఇక సీత సుమతితో మాట్లాడినట్లు వద్దు అత్తయ్య పైన ఉన్న మహాలక్ష్మి అత్తయ్యకి నేను పైన తింటే ఇష్టం ఉండదని మహాని బ్యాడ్ చేసి మాట్లాడుతుంది. 


మహాలక్ష్మి: చాలు సీత మన మధ్య ముందు జరిగిన గొడవలు వదిలేయ్. నువ్వు సుమతికి మేనకోడలివి అయితే నాకు కూడా మేనకోడలివే. ఈ రోజు నుంచి నువ్వు అందరితో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిను. 
సీత: ఈ మాట మీరు మా సుమతి అత్తయ్యలా చెప్తున్నారా మహాలక్ష్మి అత్తయ్యలా చెప్తున్నారా. మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్తమ్మ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి చూస్తే నన్ను టేబుల్ మీద నుంచి గెంటేస్తుంది.
రామ్: అలా ఏం ఉండదు సీత నువ్వు వచ్చి కూర్చొ.
సీత: ఆ మాట అత్తమ్మకి చెప్పమను.


సీత మహాలక్ష్మికి తన చేయి పట్టుకొని టేబుల్ మీద కూర్చొ పెట్టమని అంటుంది. మహా చేయి ఇవ్వగానే ప్లేట్ కూడా పట్టుకోమని అంటుంది. రామ్ కోసం మహాలక్ష్మి తప్పక సీతని కూర్చొపెడుతుంది. ఇక సీత మహాలక్ష్మితో మనద్దరం కలిసి పక్కపక్కన కూర్చొని తిందామని అంటుంది. రామ్ మహాలక్ష్మిని కూర్చొమని పక్కన కూర్చొని కలిసి తినమని అంటాడు. సీత ఇంకెప్పుడు మీరు అమ్మ వేరు వేరు అనకుండా చేయమని అంటాడు. మహాకు ఇష్టం లేకుండా కూర్చొంటుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. సీత మహాలక్ష్మిని దెప్పిపొడుస్తుంది. ముందు ముందు మిమల్ని ఇలా ఇంకా ఆడిస్తాను అని అంటుంది. ఇక విద్యాదేవి తన మేనకోడలిని తన కుటుంబంతో కలిసి తినేలా చేశానని సంతోషంగా ఉందని అనుకుంటుంది.


రామ్ గదిలో ఉండగా సీత పాలు తీసుకొని వస్తుంది. అందరి ముందు తన పిన్నిని అలా ఆడుకోవడం నాకు నచ్చలేదని నువ్వు రెచ్చిపోవడం టీచర్ ఇన్వాల్వ్ అవ్వడం నచ్చలేదని అంటాడు. సీత, రామ్‌లు గొడవ పడితే తన వల్లే అని బయట నుంచి వింటున్న విద్యాదేవి అనుకుంటుంది. తన పిన్ని కాబట్టి నీ అల్లరి భరిస్తుందని అదే తన తల్లి అయితే మేనకోడలు అయినా నీ అంతు చూసేదని అంటాడు. తన అత్త గురించి నాకు తెలుసు అని సీత అంటే మా అమ్మ గురించి నీకు ఏం తెలుసని రామ్ ప్రశ్నిస్తాడు. రేపు తన తల్లి వచ్చి సీత నాకు నచ్చలేదు అంటే ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు. ఇంతలో విద్యాదేవి డోర్ కొట్టి లోపలికి వస్తుంది. సీతతో గొడవ పెడుతున్నావా అని అడుగుతుంది. నేను కామెడీ చేస్తుంటే ఈవిడ వచ్చిందని అనుకుంటాడు. ఇక సీతని చూసి మీ అమ్మ చాలా సంతోషపడుతుందని అంటుంది. సుమతి మాటలు అని తన మనసులో మాటలు చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపపై మంత్ర దండం ప్రయోగించనున్న గంటలమ్మ.. హత్యకు వాడిన కత్తికి పూజలు!