Trinayani Today Episode నయని కత్తి తీసుకొని గాయత్రీ దేవి ఫొటో దగ్గరకు వెళ్తుంది. సోనాలిలా మోడ్రన్‌గా వచ్చిన గంటలమ్మ భయపడి వెళ్లిపోతా అంటే హాసిని ఉండమని అంటుంది. ఇక విశాల్ ఏమైందని నయనిని అడిగితే ఈ కత్తి ఒకర్ని చంపేసిందని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. చంపింది తాను కాదని గాయత్రీ దేవి అని చెప్తుంది.


తిలోత్తమ: గాయత్రీ అక్క ఈ కత్తి తీసుకొని చంపేసిందా.
విశాల్: చీమకు కూడా హాని చేయని అమ్మ కత్తి తీసుకొని చంపేసింది అంటే ప్రాణం వదిలిని వాడు పాపం పనే చేసి ఉంటాడు. 
నయని: అవును బాబుగారు. గాయత్రీ పాపని బలి చేయాలి అనుకున్న వాడిని కడతేర్చేశారు అమ్మగారు.
విక్రాంత్: ఎవరు వదినా ఆ రాక్షసుడు.
నయని: రక్తపుంజి.


 ఆ మాట విని సోనాలిగా వచ్చిన గంటలమ్మ పడిపోతుంది. పావనా నీళ్లు ఇస్తాడు. ఇక నయని తనతో పుర్రెలదిబ్బ నుంచి పాపని తీసుకురావడానికి గాయత్రీ దేవి తనకు ఆ కత్తి ఇచ్చారని మంచి వాళ్లని ఆమె ఏం చేయరని దుర్మార్గులన్ని వదలరని అంటుంది. గంటలమ్మ భయపడుతుంది. పుర్రెలదిబ్బ ఎలా వెళ్లారంటే తెలీదని గాయత్రీదేవి అండతో ఇంటికి వచ్చేశాను అని నయని అంటుంది. ఇక సోనాలి వెళ్లిపోతా అంటే నయని వద్దని ఆతిథ్యం తీసుకొని సాయంత్రం వెళ్లమని అంటుంది. ఇక నయని కత్తి తీసుకొని పైకి వెళ్లిపోతుంది. ఇక సుమన విక్రాంత్ తమ గదిలో మాట్లాడుకుంటారు.  తన అక్క నయనినే హత్య చేసి దాన్ని గాయత్రీదేవి మీదకు తోసేస్తుందని పోలీసులకు చెప్పి ఎంక్వైరీ చేయించాలని అంటుంది. దాంతో విక్రాంత్ పిచ్చి హాస్పిటల్‌ వాళ్లకి పిలిచి నిన్ను అప్పగించేయాలి అని అంటాడు. ఇక టీవీలో పేపర్లలో వస్తే అప్పుడు తెలుస్తోందని సుమన అంటే పుర్రెలదిబ్బ ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదని కేసులు అవ్వవని అంటాడు. 


నయని వచ్చి కత్తికి శాంతి పూజ జరిపించాలి అని అంటుంది. ఇక విశాల్ నయనితో ఎలా పుర్రెలదిబ్బకు వెళ్లావ్ అని అడిగితే.. మంచం మీద అని చెప్తుంది. పావనా, విశాల్‌కు హాసిని మొత్తం చెప్తుంది. గాల్లోకి మంచం వెళ్లిందని అందరూ నోరెళ్లబెడతారు. ఇక ఆ టైంలో నయని ఎంత భయపడిందో చెప్తుంది. ఇక పుర్రెల దిబ్బలో మాంత్రికుడు చేసిన పనిని వివరంగా చెప్తుంది. 


విశాల్: మనసులో.. వాడు ఎత్తుకెళ్లిన అమ్మని కాపాడుకోవడానికి అమ్మే వచ్చింది నయని. 
పావనా: నువ్వు చెప్తుంటే నా బుర్ర వెడెక్కిపోయింది. అలాంటిది నువ్వు అన్ని పుర్రెల మధ్య పోరాడావు అంటే గ్రేట్. త్వరగా ఆ శాంతి పూజ చేయండి అప్పుడు గానీ నా గుండె దడ తగ్గదు.
గంటలమ్మ: ఆ గాయత్రీ మహాజ్జాతకురాలు దాన్ని రక్తచాముండికి బలి ఇస్తే రక్తపుంజి మహా మాంత్రికుడు అవుతాడు అనుకున్నాను. ఆ ఒక్క కార్యం సంపూర్ణం అయింటే ఎవర్ని ఎలా అయినా ఆటలు ఆడించేవాళ్లం. రక్తపుంజిని గాయత్రీ దేవి హతమార్చింది అనగానే నా గుండె ఆగినంత పని అయింది. నా కుడి భుజం బలైంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.
తిలోత్తమ: ఎవరి మీద దాడి చేస్తావ్ నయని మీదనా.
గంటలమ్మ: తల్లా పిల్లా అదే ఆలోచిస్తున్నాను.
వల్లభ: పెద్ద మరదలి గురించి ఏం అనుకుంటున్నావ్. తనతో పెట్టుకుంటే నీ తల అరవై అడుగుల దూరం పడేస్తుంది.
గంటలమ్మ: గాయత్రీ పాపని గడప దాటిస్తే చాలు నయని వచ్చేస్తుంది. 
వల్లభ: ఆ పిల్ల అంత సులువైనది కాదు. 
తిలోత్తమ: అవును గంటలమ్మ తను చిచ్చరపిడుగు ఎవర్నీ నమ్మదు.
గంటలమ్మ: పాప నా చేతిలో ఉన్న మంత్ర దండం కర్ర పట్టుకుంటే చాలు నా వెంట వచ్చేస్తుంది. చిన్న పిల్లల్ని ఎలా మచ్చిక చేసుకోవాలో నాకు తెలుసు.


నయని, హాసిని, పావనా అందరూ గాయత్రీదేవి ఫొటో దగ్గర కత్తిని ఉంచి పూజ చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. గాయత్రీ పాప దీపం వెలిగించడానికి ప్రమిద తీసుకొని వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర ఇంట్లో అడుగుపెట్టబోతున్న సంయుక్త.. తనని మర్చిపోమని జానుతో చెప్పిన వివేక్!