గుప్పెడంతమనసు మార్చి 31 ఎపిసోడ్


రిషి-వసు మాటలు విన్న జగతి..రూమ్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వచ్చిన మహేంద్ర... ఏంటి జగతి ఫంక్షన్ కి నేను వెళ్లి వస్తే నేను డిస్టర్బ్ గా ఉండకుండా నువ్వు డిస్టర్బ్ గా ఉన్నావేంటి అని అడుగుతాడు. వర్క్ ఫినిష్ అవ్వలేదా అంటాడు
జగతి: అయింది మహేంద్ర
మహేంద్ర: మరి ఇంకేంటి జగతి 
జగతి: రిషి, వసులో మార్పు వచ్చిందని నేను అంటే..నువ్వు లేదన్నావు కానీ మనకు తెలియకుండా వాళ్ళు చాలా చేస్తున్నారు అంటూ జరిగింది మొత్తం వివరించడంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం
మహేంద్ర: ఏం కాదు జగతి 
జగతి: నేనంటే పడని రిషి నీకోసం దేవయాని అక్కయ్యను ఎదిరించి మరీ నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. అందరితో పాటు కలిసి నన్ను కూడా ఉండనిచ్చాడు. ఎలా అయిన రిషి రుణం తీర్చుకోవాలి మహేంద్ర వాళ్ళిద్దరూ సంతోషం కోసం మనం ఏదో ఒకటి చేద్దాం
మహేంద్ర: సరే జగతి


రిషి అద్దంలో చూసుకుని తనతో తాను మాట్లాడుకుంటాడు..మన మధ్య ఉన్న ప్రేమనే బంధం అని నమ్మాలి అనుకుంటాడు. ఆ తర్వాత బెడ్ పై  నెమలి ఈక ఉండటంతో ఇక్కడ ఎవరు పెట్టారనుకుంటూ అక్కడున్న పేపర్ తెరిచి చూస్తాడు. ఎండీ గారు ఈరోజు మనం ఇద్దరం కలిసి భోజనాన్ని ఆనందించాలని రాసి ఉంటుంది.


Also Read: రిషిధారలు ఒక్కటయ్యే సమయం కోసం ఎదురుచూద్దాం అన్న రిషి, జగతికి మొత్తం క్లారిటీ వచ్చేసింది!


ఆ తర్వాత ఇంట్లో అందరూ కలిసి సరదాగా టెర్రస్ పై భోజనం చేస్తుంటారు. ఆరుబయట వెన్నెల్లో భోజనం చేస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు... దేవయాని మాత్రం ఫైర్ అవుతుంది. ఎక్కడ కూర్చుని తిన్నా కూడా అదే తిండి కదా..ఇలా పైకి కిందికి సామాన్లు అని తీసుకుని చాకిరీలు చేయడం అవసరమా అనడంతో ఇందులో చాకిరీ ఏముంది మేడం ఇలా వెన్నెల్లో కూర్చొని తినాలంటే అదృష్టం ఉండాలి అంటుంది వసుధార.
ఇవన్నీ మధ్యతరగతి వాళ్ల ఆలోచనలు...నలుగురు కూర్చుని భోజనం చేయాలి మంచి చెడు గురించి మాట్లాడుకోవాలని రిప్లై ఇస్తుంది జగతి. 


భోజనం తర్వాత రిషి వసుధార దగ్గరికి వెళతాడు.. ఇద్దరూ ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటారు. వాళ్లిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే దేవయాని సీరియస్ గా చూస్తుంటుంది...అక్కడకు వెళ్లిన జగతి.. మరీ ఎక్కువగా చూడకండి అక్కయ్యా దిష్టితీయాల్సిన అవసరం వస్తుందని సెటైర్ వేసి వెళ్లిపోతుంది..ఇంట్లో అందరూ కలిసి టీవీ ని చూస్తూ ఉంటారు. అప్పుడు టీవీలో జయచంద్ర అనే పండితుడు చెప్పే సమాజం-యువత-మార్పు గురించి చెబుతాడు. ఈయనతో కాలేజీలో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయమని మినిస్టర్ గారు చెప్పారని రిషి అంటాడు. అప్పుడు వసుధార ఆయన మాటలును స్టూడెంట్స్ కి వినిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు సార్ అని అంటుంది.  జగతి కూడా మినిస్టర్ గారు మనకు ఇచ్చిన అతి పెద్ద అవకాశం అని చెప్పవచ్చు అంటుంది. కాలేజీలో ఆ ప్రోగ్రామ్ ప్లానింగ్ లో ఉంటారు. 


Also Read: మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!


వసుధార రిషి క్యాబిన్ లోకి వెళ్లి అక్కడ లవ్ షేప్ ఎండీ అనే అక్షరాలను చూసి సంతోష పడుతూ ఉంటుంది. వాటిపై స్కెచ్ పెన్ తో రాస్తుండగా ఇంతలో రిషి రావడంతో అక్కడే పెట్టేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే ఏం లేదు అంటుంది. వసు వెళ్లిపోయిన తర్వాత రిషి హెచ్ అనే లెటర్ ని మళ్లీ రాస్తూ ఉంటాడు. ఏ పని పూర్తిగా చేయదు  అనుకుంటాడు. మళ్లీ ఎంట్రీ ఇచ్చిన వసుధార థ్యాంక్స్ సార్..నేను ఏది వదిలిపెట్టినా పూర్తిచేస్తారు అంటూ...మీరు జెంటిల్మెన్ అనేసి వెళ్లిపోతుంది


జగతి పని చేసుకుంటూ ఉండగా వెళ్లిన మహేంద్ర..ఈరోజు జయచంద్ర గారు మన కాలేజీకి వస్తున్నారు ఆ ఏర్పాట్లను చూడాలి కదా అనడంతో అవును మహేంద్ర మర్చిపోయాను అంటుంది జగతి. ఫ్లెక్సీలు కడుతుండగా వసుధార జారి కందపడబోతుంది...అప్పుడే అక్కడకు వెళ్లిన రిషి కిందపడకుండా పట్టుకుంటాడు...బ్యాగ్రౌండ్ లో ఓ రొమాంటింక్ ట్రాక్ వస్తుంది... ఎవరినైనా పిలవొచ్చుకదా అని రిషి కోప్పడతాడు... ఇప్పుడే అటెండర్ అటు వెళ్లాడు అందుకే నేను కడుతున్నా అంటుంది. నేను కడతానని రిషి అంటే..ఎండీగారు ఇలాంటి పనులు చేయకూడదని వసుధార అంటుంది. నేను ఏది వదిలిపెట్టినా మీరు పూర్తిచేస్తారని నువ్వే చెప్పావు కదా అంటూ ఫ్లెక్సీ కడతాడు...