గుప్పెడంతమనసు మార్చి 30 ఎపిసోడ్


రిషి-వసు ఇద్దరూ ఏదో దాస్తున్నారని మహేంద్రతో అంటుంది జగతి.  అదేం లేదు జగతి నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అన్న మహేంద్ర.. అయినా మన దగ్గర దాచి పెట్టాల్సిన అవసరం వాళ్లకు ఏముందంటాడు.
జగతి: ఎవరి పంతం వాళ్లది. ఏ ఒక్కరూ తగ్గరు. ఏ క్షణాన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్లకే తెలియదు. రిషి నాకు సోరీ ఎందుకో చెప్పాడు.. అదే విషయం వసుధారని అడిగితే మీకే తెలుస్తుంది మేడం మీరు టెన్షన్ పడకండి అసలు ఏం జరుగుతుంది మహేంద్ర
మహేంద్ర: నువ్వేం టెన్షన్ పడొద్దు జగతి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి
జగతి: నాకు అంతకంటే ఏం కావాలి మహేంద్ర
 ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. మేడం వసుధార కనిపించిందా అని అడుగుతాడు... ఇల్లంతా వెతికాను లేదని చెప్పేసి సరే నేనే కనుక్కుంటాను అనేసి వెళ్లిపోతాడు. కాసేపు ఆలోచించిన తర్వాత..వసుధార ఎక్కడుంటుందో నాకు తెలుసు అనుకుంటూ వెళతాడు. 


Also Read: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక


వసుధార రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటుంది. అడిగిన వెంటనే ఉద్యోగం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్ అంటుంది వసుధార... ఇంతలో అక్కడకు రిషి వస్తాడు.
వసు: గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి ఏం కావాలి..ఏదో డల్ గా ఉన్నారు
రిషి: కష్టమర్స్ మూడ్ తో ఏం సంబంధం..ఆర్డర్ తీసుకోడం మీ పని
వసు: వేడివేడిగా ఏం కావాలి సర్
రిషి: వేడివేడిగా ఐస్ క్రీమ్ కావాలి
వసు: వేడివేడిగా ఐస్ క్రీం ఎలా 
రిషి: వేడివేడిగా అన్నావ్ కదా అందుకే అడిగా అనేసి కాఫీ ఆర్డర్ చేస్తాడు. వన్ మినిట్లో వస్తానని వెళ్లి తీసుకొస్తుంది... వచ్చిన తర్వాత కాఫీ క్యాన్సిల్ చేయ్ అంటాడు
వసు: ఏమైంది సార్ అంటే...
రిషి: వన్ మినిట్ లో తీసుకొస్తానన్నావ్..అందుకే క్యాన్సిల్...
వసు: అలా కాదు సార్ అలా క్యాన్సిల్ చేస్తే కుదరదు తాగాల్సిందే 
రిషి: నేను ఎక్స్పెక్ట్ చేసిన సమయానికి రాలేదు నువ్వు చెప్పిన టైంకి రాలేదు నాకు కాఫీ వద్దు
వసు:ఇప్పుడు మీరు ఈ కాఫీ తీసుకోకపోతే నా శాలరీ కట్ అవుతుందని అనగానే సరే అని కాఫీ తాగుతాడు. 
రిషి: ఈ పార్ట్ టైం జాబ్ వదిలేసేయ్
వసు: నాకు పాకెట్ మనీ కావాలి కదా సార్ 
రిషి: అంతకంటే ఎక్కువ నేను ఇస్తాను నా అసిస్టెంట్ కాదు జాయిన్ అవ్వు
సరే సార్ జాయిన్ అవుతాను జీతం ఇస్తారా అనడంతో సరే అంటుంది. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు రిషి తాగిన కాఫీ తాగుతుంది.  రిషి చూస్తాడు..
వసు కోసం రిషి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార బయటికి రావడంతో నేను పాత రిషిని పాత రిషి లాగే ఉండాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతోలో కొందరు రౌడీలు వసుధారని ఏడిపిస్తూ ఉండగా రిషి అక్కడికి వెళ్ళి వాళ్లని చితకొట్టి తను నా భార్య అని చెప్పి తీసుకెళతాడు. కార్లో  వెళ్తూ ఉండగా తను నా భార్య అన్న రిషి మాటలు గుర్తుచేసుకుని వసుధార కన్నీళ్లు పెట్టుకుట్టుంది. 


జగతి వర్క్ చేసుకుంటూ ఉండగా వచ్చిన మహేంద్ర...ఏంటి జగతి ఇంకా బయలుదేరలేదు అవతల ఫంక్షన్ కి టైం అవుతుంది.  వదిన అన్నయ్య అప్పుడే వెళ్ళిపోయారు మనమే లేట్ తొందరగా వెళ్దాం పద అనగానే నేను రాను మహేంద్ర నువ్వు వెళ్ళు అంటుంది. ఇంతలో ధరణి అక్కడికి రావడంతో మీ మామయ్య కూడా రెడీగా ఉన్నారు. మీరు కలిసి వెళ్ళండి అని చెప్పి జగతి పని చేసుకుంటూ ఉంటుంది. 


Also Read: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి


ఆ తర్వాత వసుధార రిషి ఇంటికి చేరుకుంటారు...వసుధార లోపలకు వెళుతుండగా...మనం మాట్లాడుకోవాలి అని పిలుస్తాడు...వసుధార డల్ గా వచ్చి కూర్చుంటుంది. 
రిషి: మనం టైమ్ ట్రావెల్ చేయలేము
వసు: ఎందుకు సార్
రిషి:ఇప్పటికే మనం చాలా దూరం వచ్చేసాము. ప్రేమలో ఎప్పుడు ముందుకు వెళ్లడమే ఉంటుంది కానీ వెనక్కి వెళ్లడం ఉండదు ఇప్పుడు మనం ప్రేమికులుగానే ఉన్నా మళ్ళీ  మారలేము . పాత కథలు తిరిగి రావు . మనం పాత రిషి,వసు లము అవుదామని అన్నావు అది ఎప్పటికీ కుదరదు వదిలేయ్ వసుధార 
ఇంట్లో ఒక్కతీ ఉండిపోయిన జగతి..ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చి..రిషి-వసు మాటలు వింటుంది....
రిషి: అప్పుడు నాకు జగతి మేడం అంటే కోపం కానీ ఇప్పుడు జగతి మేడం అంటే గౌరవం. పాత రిషి లా ఉండలేకపోతున్నాను. కాలేజీలో మేడం ఎదురు పడినా కూడా కోపగించుకోలేకపోతున్నాను. కోపం తెచ్చుకోవాలి అనుకున్న కూడా మేడం మీద కోపం తెచ్చుకోలేకపోతున్నాను
ఆ మాటలు వినిజగతి సంతోష పడుతుంది 
రిషి: ఒకప్పుడు నిన్ను నా భార్య కాదు అన్నాను ఇప్పుడు వాళ్లతో నువ్వే నా భార్య అని చెప్పాను. ఎందుకంటే నేను నిన్ను పాత వసుధారగా చూడలేకపోతున్నాను. 
వసు-రిషి మటాలకు జగతి అయోమయ పడుతుంది. 
వసు-రిషి: సర్ మీరు దూరం ఉన్న, ప్రేమిస్తారు దగ్గర ఉన్న ప్రేమిస్తారు మీ ప్రేమ నాకు తెలుసు సార్. ఆ ప్రేమ ఎప్పటికి నాకు కావాలి అనడంతో ఈ రిషి ప్రేమ ఎప్పటికీ నీకే వసుధార ఈ రిషేంద్ర భూషణ్ ఒకసారి ప్రేమను ఇస్తే తిరిగి తీసుకోడు అనడంతో వసుధర సంతోష పడుతుంది. నువ్వు నేను వేర్వేరుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అందుకే రిషిధార లు ఒక్కటేయ్యేంతవరకు ఎదురుచూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
 ఆ మాటలు విన్న జగతి ఇదా వీరి మధ్య జరుగుతున్నది అనుకుంటూ ఉంటుంది.