యానివర్సరీ ఫంక్షన్ లో ఫ్లెక్సీ కి విన్నీ నిప్పు పెడతాడు. కాలిపోతున్న ఫోటో చూసి వేద పరుగున వెళ్ళి చేత్తో దాన్ని ఆర్పేస్తుంది. తన చేతికి గాయం కావడంతో యష్ చాలా బాధపడతాడు. అది కాలిపోతే ఇంకొకటి తెచ్చి పెట్టె వాళ్ళం కదా ఎందుకు ఈ సాహసమని యష్ అంటాడు. ఇంతకముందు వేద అయితే వదిలేసేది కానీ ఇప్పుడు కాదు మొన్నటి వరకు అన్నీ ప్రశ్నలే. ఇప్పుడు నా ప్రశ్నలన్నింటికీ క్లారిటీ ఉంది. మీకు సంబంధించినది అన్నీ నాకు చాలా విలువైనవే. అన్నింటినీ కాపాడుకునే బాధ్యత నాది. అక్కడ నా ఫోటో ఉంటే పట్టించుకోను కానీ అది వేద ఎమోషనల్ అవుతుంది. అది చూసి యష్ చాలా సంతోషిస్తాడు. ఖుషి డాన్స్ తో యానివర్సరీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. వేద, యష్ కూడా తమ డాన్స్ తో మెప్పించేస్తారు.


Also Read: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య


వేద కోసం నా జీవితాన్ని నాశనం చేశావో ఆ వేదనే లేకుండా చేస్తాను. మ్యారేజ్ డే రోజునే మీ పెళ్లి బ్రేకప్ చేస్తానని మార్ఫింగ్ చేసిన ఫోటోస్ ని ఖైలాష్ ఒక వ్యక్తికి ఇచ్చి పంపిస్తాడు. అతను వచ్చి ఆ ఫోటోస్ యశోధర్ కి ఇస్తాడు. అవి చూడకుండా పక్కన పడేసి వేదతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుని సంతోషంగా ఉంటాడు. సంవత్సర కాలంగా ప్రయాణం చేశాం కానీ ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా సాగింది. కానీ ఇక నుంచి అలా కాదు నా జీవితంలో నువ్వు, నీ జీవితంలో నేను ఉంటాను. ఐ లవ్యూ వేద అని తనలో తనే మాట్లాడుకుంటూ కొరియర్ వైపు చూస్తాడు. దాన్ని తీసుకుని ఓపెన్ చేసే టైమ్ కి వసంత్ వేద తెచ్చిన గిఫ్ట్ చూపిస్తాడు. లెక్క ప్రకారం ఇది వేద వదిన స్టేజ్ మీద ఇవ్వాలి. కానీ నేను దీన్ని చూశాను అందుకే తీసుకొచ్చేశానని ఖుషి వాళ్ళతో కలిసి ఉన్న పెయింటింగ్ చూపిస్తాడు. అది వేద కూడా చూస్తూ ఉంటుంది.


Also Read: అందరి ముందు అడ్డంగా బుక్కైన రాజ్- అన్నని ఇరికించేసిన కళ్యాణ్


ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ రిటర్న్ గా ఏమి ఇవ్వగలను. నాకు చేతనైంది ఒక్కటే అందరి ముందు నాలుగు మంచి మాటలు చెప్పడం తప్ప ఏం చేయగలను. ఏం చేసినా వేదకి ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వలేను. వేద నా లైఫ్ లోకి వచ్చాక నేను బెస్ట్ సీఈవో అయ్యాను. మా ఇంట్లోకి కొత్త వెలుగు వచ్చింది. నేను చాలా లక్కీ. నా అదృష్టదేవత వేద. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే వేదని కోరుకుంటాను. తనే నా సంతోషం. తను లేనిదే నేను లేనని చెప్తాడు. ఆ మాటలన్నీ విని వేద తెగ మురిసిపోతుంది. ఫ్రేమ్ లో ఉన్న వేదకి ముద్దు పెడతాడు. నాకు తెలుసు మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నేను కూడా మీకు అందరి ముందు బ్యూటీఫుల్ గా ప్రపోజ్ చేస్తానని అనుకుంటుంది. యష్ తనకి గులాబీ పూలు ఇచ్చి ప్రపోజ్ చేసినట్టు ఊహించుకుంటుంది. వేద కూడా రోజా పువ్వు ఇస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీవారు, ఐ లవ్యూ శ్రీవారు అని చెప్తుంది.